EPISODE · Nov 23, 2022 · 18 MIN
ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... | Aa Rojullo Aa Iddaru | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది కరోనా సమయం. అయినా వాళ్లే ఒకరినొకరు దూరం పెడుతున్న రోజులు. అలంటి సమయంలో తమకు ఏమీకాని కూలీల కోసం ఒక లారీ డ్రైవర్, క్లీనర్ చూపిన మానవత్వం ఎంతో అభినందనీయం, అందరికీ ఆచరణీయం. మానవత్వపు విలువలను చాటి చెప్పే ఈ కథను చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు రచించారు. 2019 నవంబర్ ... డిశంబర్లో చైనాలో మహమ్మారి పుట్టి ప్రబలి వ్యాపించి 2020 ఫిబ్రవరి మార్చి నాటికి యావత్ ప్రపంచాన్ని కమ్ముకొని... లక్షల్లో వ్యాధి పీడితులు కాగా... లక్షల్లో మరణాలు సంక్రమించాయి. సువిశాల భారత దేశంలో.... నిర్విరామంగా కొనసాగే అనేక రకాల కట్టడ నిర్మాణాల్లో పనిచేసేటందుకు కూలీలు... ఒక ప్రాంతాన్నుంచి మరో ప్రాంతానికి (పనిదొరికే చోటికి) వెళ్లి పనిచేసుకొంటూ పొట్ట నింపుకుంటారు. అలాగే అనేక రకాల వస్తువులను లారీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్లు... ఒక వూరి నుండి మరొకపూరికి చేరవేస్తుంటాయి. దేశంలో కరోనా వ్యాధి తీవ్రత వలన 'లాక్డౌనును గవర్నమెంటు అమలు పరచింది. మాస్కులు... సోషల్ డిస్టెన్స్... విధిగా జనం అంతా పాటించవలసిన సమయం... వ్యాధి తీవ్రతగా సంక్రమించిన ప్రాంతాలను రెడ్ జోన్స్... నలువైపు కట్టుదిట్టాలతో ఇతరులు... ఆ ప్రాంతానికి రాకుండా రక్షకభటుల బందోబస్తులు నిర్దేశింపబడిన సమయం... రాముడు లారీ డ్రయివర్.... అతని శిష్యుడు క్లీనర్ అంజి... ప్లయ్‌వుడ్‌ను హైదరాబాద్ ఎల్.బి.నగర్. గోడౌన్లో దించారు. తిరుగు ప్రయాణం వయా కడప తిరుపతి... మీదుగా చెన్నైకి చేరాలి... కరోనా కారణంగా కట్టడ నిర్మాణాలు అపివేయబడ్డాయి. వలసగా వచ్చిన కూలీలకు పనిలేని కారణంగా కూలీ డబ్బులు రానందున... మహానగరంలో పప్పు నిప్పు నీరు... కూడా కొనవలసి వచ్చినందున నగరంలో నిలువలేక... ప్రయాణ సౌకర్యాలు రైళ్లు... బస్సులు... ప్రైవేట్ వాహనాలు అన్ని ఆగిపోయినందున... వీరభద్రుడి లేబర్ నలభైమంది స్వగ్రామమైన రేణుగుంటకు కాలినడకన బయలుదేరారు. హైదరాబాద్ నుండి తిరుపతి 560 కిలోమీటర్లు... వీరభద్రుడి ముఠాలో ఐదుగురు చిన్నపిల్లలు... పదిహేనుమంది. పాతికేళ్లవాళ్లు... పదిమంది యాభైకి లోపు... పదిమంది అరవై లోపు... వయస్సు వారున్నారు. మొత్తం నలభైమందిలో పాతిక మంది మగ... పదిహేనుమంది స్త్రీలు. వారిలో... మంగమ్మ గర్భిణీ నవమాసాలు... మొగుడు రాజయ్య... బరువునంతా తను మోస్తూ... భార్యచేతిని పట్టుకొని మెల్లగా నడుస్తున్నాడు. అందరూ కాలి నడకలో... దేవుని మీద భారం వేసి హైదరాబాదు నుండి బయలుదేరారు. చిన్ని... మణి అక్కా చెల్లెళ్లు... కవలలు... ఇరవై సంవత్సరాలలోపు... అందరికీ సాయంగా వరస కలిపి ఆప్యాయంగా మాట్లాడుతూ.. ముందుకు నడుస్తున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/A4_HzZBNXnY
Embed this episode
NOW PLAYING
ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... | Aa Rojullo Aa Iddaru | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.