EPISODE · Jul 13, 2023 · 12 MIN
అరుగు | Arugu | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Arugu' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'అరుగు' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శివపురం లోని కన్యకాపరమేశ్వరి గుడి వీధి నుండి పెద్ద కాలవ కి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకునేవారిని యిట్టె ఆకర్షిస్తుంది జోస్యుల వెంకన్న గారి అరుగు. వెంకన్న గారు పౌరోహిత్యం చేస్తారు. తండ్రి గంగాధరం గారు ఇచ్చిన ఐదు ఎకరాల పొలం జాగ్రత్తగా వ్యవసాయం చేస్తూనే పౌరోహిత్యం కూడా చేసుకుంటున్నారు. ఆయన ఇల్లు నాండ్ర వారి సందు లో ఉంటుంది. కానీ రోడ్డు మీద ఉన్న చిన్న పెంకుటిల్లు లో నాలుగు ఆవుల్ని మేపుతూ ఉంటారు. ఈ ఇల్లూ ఆయనదే. ఆవుల కోసం కొన్నారు. ఈ పెంకుటింటికి వీధి వైపు గుమ్మం ఉండదు. సందులోనే గుమ్మం ఉంటుంది. కానీ వీదివైపు పదిహేను అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో పెద్ద అరుగు ఉంది. ఈ అరుగు చివర ఆనుకుని కూర్చోడానికి వీలుగా ఒక ఆర్చీ కూడా ఉంది. ఉదయం పూజ ముగించుకుని సైకిల్ ఎక్కి కాకిలేరు, కంతేరు గ్రామాలకు పౌరోహిత్యం పని మీద వెళ్తారు వెంకన్న గారు. ఆయన్ని దూరాన్నుంచి చూడగానే ‘ఒరేయ, మన గణపతి గారు వచ్చేస్తున్నారు రా’ అని వేళాకోళం ఆడుకునేవారు రైతులు. వెంకన్న గారిది కొంచెం భారీ కాయం. పెద్ద పొట్ట, విశాలమైన మొహం, గంభీరమైన కంఠం. వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నా, ఆయన్ని చూడగానే నమస్కారంచేసి సాదరంగా ఆహ్వానిస్తారు పల్లె వాసులు. ఆయన్ని ‘వెంకన్న బాబు గారూ’ అనే పిలుస్తారు ఎదురుగా ఉన్నప్పుడు. పూజలు, వ్రతాలు చేయించినా ‘నాకు ఇంత దక్షిణ ఇవ్వాలి మీరు’ అని ఏనాడూ ఆయన చెప్పలేదు. పని పూర్తీ అయ్యాకా, తాంబూలంలో దక్షిణ ఇవ్వకుండా, రెండు అరటి పళ్ళు పెట్టి ఇచ్చినా పట్టించుకోకుండా హృదయ పూర్వకంగా వారిని ఆశీర్వదించి ఇంటికి వచ్చేసేవారు. ‘పోనీలీ, వాళ్ళు ఏదో ఇబ్బంది లో ఉన్నారేమో, వాళ్లకు డబ్బు సర్దుబాటు అయినప్పుడే ఇస్తారు’ అని అనుకునే వారు. మిగతా పురోహితులు ఈ విషయంలో ఆయన్ని విసుక్కునే వారు’నువ్వు ఎక్కడో అమాయకుడివిలా ఉన్నావ్, దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి, పని అవగానే నాలుగు డబ్బులు తీసుకోవాలి. అంతేకానీ వాళ్ళే ఇస్తారు అనుకుంటే రోజులు గడవద్దూ’ అని హితవు పలికేవారు. “భగవంతుడి దయ వలన నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. పాడి ఆవులు ఉన్నాయి. అవి సరిపోతాయి. నా కుటుంబానికి. ఎదుటివాడు బాధపడుతూ ఇచ్చిన డబ్బు మనకి శ్రేయస్కరం కాదు” అని బదులు చెప్పేవారు, అల్ప సంతోషి వెంకన్న గారు. చిన్న పిల్లల మనస్తత్వం. సాయకాలం వేళలలో అరుగు మీద కూర్చుని దారి వెంట వెళ్ళే చిన్న పిల్లల్ని పిలిచి, తన పక్కనే పెట్టుకున్న సంచీ లోంచి, నిమ్మ తొనల బిళ్ళలు తీసి ఇచ్చేవారు. అవి తింటూ ఆనందంగా వెళ్ళే పిల్లల్ని చూసి చాలా సంతోష పడేవారు. వెంకన్న గారికి చాలా కాలానికి గాని పిల్లలు కలగలేదు. అప్పుడు చెల్లెలు పిల్లాడిని తెచ్చి పెంచుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిగారు. మేనల్లుడిని తన దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి పెద్దవాడిని చేసారు. సాయంత్రానికి సబ్బెల్ల పుల్లారెడ్డి, చాట్రాది వీరన్న నాయుడు, కాకిలేరు రామా రావు వెంకన్న గారి అరుగు మీదకు చేరేవారు.. ఊళ్ళో విషయాలు అన్నీ అక్కడ చర్చకు వచ్చేవి. అదే సమయంలో ఎవరైనా ముహూర్తాల కోసం వస్తే లోపలకు వెళ్లి వారి పని చూసి, మళ్ళీ వచ్చి అరుగు మీద కూర్చునే వారు వెంకన్న గారు. అరుగు చివర కుర్చీలా ఉన్న చోటు ఆయనదే. అక్కడ ఎవరూ కూర్చునే వారు కాదు. రాత్రి ఏడుగంటలు కాగానే అరుగు దిగి లోపలకు వెళ్ళిపోయేవారు వెంకన్న గారు. తిరిగి వచ్చేవారు కాదు. అప్పుడు అరుగు మీద చర్చలు వేరే రకంగా ఉండేవి. ఊళ్ళో పేకాటలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవడు ఎంత పోగొట్టుకున్నాడు అన్నీ చర్చకు వచ్చేవి. “ఏమయ్యా వీరన్న నాయుడూ, మొన్న కోడి పందేల దిబ్బ మీద పెకాడుతున్న వాళ్ళ కోసం పోలీసులు వచ్చారంటగా? ఎం జరిగింది?” సిగరెట్ వెలిగించి అడిగాడు సబ్బెల్ల పుల్ల రెడ్డి. “భలేవారే రెడ్డి గారూ, ఆల్లు పోలీసులు కాదు”అన్నాడు వీరన్న నాయుడు. సిగరెట్ గట్టిగా దమ్ము లాగి ‘మరి ఎవరు?’ ఆసక్తిగా అడిగాడు పుల్లారెడ్డి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/lLDIdyzbJBM
Embed this episode
NOW PLAYING
అరుగు | Arugu | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.