EPISODE · Jun 24, 2023 · 16 MIN
అశ్వ మేధం - ఎపిసోడ్ - 11 | Aswamedham - Episode - 11 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 11' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 11' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చైనా ఊహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసి నెలరోజుల్లో నియంత్రణలోకి తేగలిగింది. కానీ యూరప్ దేశాలైన ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, టర్కీ, అమెరికా వంటి ధనిక దేశల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. భారత్లో కూడా నెలరోజుల ఆలస్యంగా ప్రవేశించినా వేగంగా వ్యాపించడం మొదలు పెట్టడంతో భారత్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. నెలరోజుల్లో సుమారు 80 దేశాలు లాక్ డౌన్ని ప్రకటించాయి. ప్రపందేశాలన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి. సుమారు 400 కోట్ల మంది ప్రజలు ఇళ్ళలోనే ఉండిపోయారు. విమానాలు, రైళ్లు, బస్సులు.. . ఇలా అన్నీ ఆపివేయబడినాయి. మాల్స్, సినిమాహాళ్లు, అన్నీ మూతబడ్డాయి. ఈ వైరస్ కరోనా జాతికి సంబంధించినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) ప్రకటించింది. దీనికి ప్రజలు ఒకరికొకరు తాకకుండా దూరం పాటించడమే మంచిదనీ, దీనికి వేరే మందులేదనీ, దీనికి వాక్సిన్ కనుగొనడానికి కనీసం సంవత్సరం పడుతుందనీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజల స్థితిగతులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి . అసలు ఇటువంటి వైరస్ ల చరిత్రలోకి వెళితే మానవాళిని ఇవి చాలా సార్లు మృత్యు ముఖంలోకి తీసికెళ్లాయని తెలుస్తోంది. ప్రభుత్వ లాక్ డౌన్ ప్రకటన వచ్చిన రోజున దీప, విహారి, సౌదామిని అందరూ చరణ్ ఇంటికి రావడంతో వారంతా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. పోలీసులు, వైద్యాధికారులు ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. అయినా రోజురోజుకు కేసులు పెరగసాగాయి. యూరప్, అమెరికాలో పోలీస్తే మనదేశంలో దీని వస్తరణ కొద్దిగా తక్కువగానే ఉంది. "ఇటువంటి వైరస్ మానవాళి ఎప్పుడైనా బాధపడిందా?" అని విహారి ఒకరోజు చరణ్ ని అడిగాడు. అది పల్లె కాబట్టి ఉదయాన్నే వాళ్ల నలుగురు దూరదూరంగా మాస్కులు వేసుకొని బయటకు వెళ్లేవారు. అయితే అదృష్టవశాత్తు ఆజిల్లాలో ఒక్క వైరస్ కేసుకూడా బయటపడలేదు. ఇదే మొదటిసారి కాదు; విహారి.. . 1920లో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ సైనికుల వల్ల ఇదే కరోనా వైరస్ మొదటిసారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్ సుమారు 3. 90 కోట్లమందికి సోకింది. అపుడు ప్రపంచజనాభా 150 కోట్లు మాత్రమే. ఒక భారతదేశంలోనే 1. 40 కోట్ల మందికి సోకిందని చరిత్ర చెబుతోంది . అంటే జనాభాలో 40 శాతం మందికి సోకిందన్న మాట;ఆ సమయంలో సబర్మతి ఆశ్రమం లో ఉన్న గాంధీజీకి కూడా ఈవైరస్ సోకి చాలా రోజులపాటు బాధపడినట్లు మొన్న హిందూ పత్రిక ఫోటోతో సహా ప్రకటించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/P0g9331ISYU
Embed this episode
NOW PLAYING
అశ్వ మేధం - ఎపిసోడ్ - 11 | Aswamedham - Episode - 11 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.