అశ్వ మేధం - ఎపిసోడ్ - 9 | Aswamedham - Episode - 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 11, 2023 · 12 MIN

అశ్వ మేధం - ఎపిసోడ్ - 9 | Aswamedham - Episode - 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 9' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) దీపని హాస్టల్ దగ్గర దించుతూ "శ్రీహర్ష నెంబరు ఇస్తే అతనితో మాట్లాడుతాను" అని చరణ్ అనగానే ఆమె ఆనెంబర్ అతనికి ఇచ్చింది. ఆమర్నాడు చరణ్ తన పల్లెకు వెళ్ళిపోయాడు. మరోరెండు రోజుల తరువాత విహారి ఫోన్ చేసి ఊళ్ళో అల్లర్లు మొదలయ్యాయని చెప్పడంతో జీపులో కృష్ణాపురం బయలుదేరాడు. విహారి అతనికి దార్లోనో కలిస్తే "ఏం జరిగింది”? అని అడిగాడు. "మైనింగ్ ని పూర్తిగా ఆపివేయాలని గ్రామస్తులు మొన్న కంపెనీ దగ్గరకి వెళ్ళి మేనేజర్ తో చెబితే ప్రభుత్వం నుంచి మాకు ఆపమనీ ఆర్డర్స్ ఏవీ రాలేదనీ కాబట్టి ఆపే ప్రసక్తిలేదు అని చెప్పడంతో మా వాళ్ళు అక్కడ ధర్నా మొదలు పెట్టారు. చుట్టుప్రక్కల ఊళ్లోనుంచి ఒక్క పనివాడు కూడా అక్కడికి వెళ్ళి పనిచెయ్యకూడదని మా జాయింట్ ఏక్షన్ కమిటీ తీర్మానించడంతో వాళ్ళు కేంప్ లేబర్ని తెచ్చిపనులు చెయ్యడంతో గొడవలు మొదలుయ్యాయి. రెండురోజుల క్రితం మాఊరి దళితవాడ లోని అమ్మాయిని వాళ్ళు అల్లరిచెయ్యడంతో మావాళ్ళు ఆకంపెనీ వాళ్ళను కొట్టి ఒక టిప్పర్ని కాల్చివేయడం తో గొడవలు ముదిరి పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది. ఒకళ్ల మీద ఒకళ్లు కేసులు పెట్టుకున్నారు. ఎమ్యేల్యే వస్తే అతన్ని అడ్డగించి పనులు ఆపించాలని గొడవచేసారు. అందుకే నిన్న రెండువందల మంది పోలీసులు వచ్చి ఇక్కడ కేంప్ చేశారు. కాబట్టి మనం మైనింగ్ కేసులో మరో సారి పిటీషన్ వేసి స్టే అడిగితే మంచిది. లేకపోతే గొడవలు పెద్దవవచ్చు" అన్నాడు విహారి. "తప్పకుండా! మళ్ళీవారం ఈకేసు విచారణ కి వస్తుంది. అపుడు మనం స్టే అడుగుదాం. ఈలోగా ప్రభుత్వం ద్వారా ఆ పనులు ఆపితే దుమ్ము, ధూళి తగ్గి కాలుష్యం తగ్గుతుంది. ఎమ్యెల్యే చెబితే కానీ ఆ పనులు ఆగవు. జాతీయ హరిత ట్రిబ్యునల్ వాళ్ళు ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి నష్టమా కాదా అన్న రిపోర్ట్ ని కోర్టులో దాఖలు చెయ్యాలి. అది తయారుచేసే రాఘవన్ గారు హత్యకు గురయ్యారు కాబట్టి ఆలస్యం అవుతుందనుకున్నాను. కానీ నిన్న ఢిల్లీలో సౌదామిని వాళ్ళ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే రాఘవన్ గారు హత్యకు గురైన రోజే ఆ రిపోర్టుని మెయిల్ ద్వారా పంపారనీ, కాబట్టి మళ్లీ వారం కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారుట. ఆ రిపోర్ట్ కాపీని కూడా సౌదామిని చదివిందట.. అది ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉందనీ చెప్పింది. కాబట్టి మైనింగ్ విషయంలో మనకి అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటున్నాను. ” అన్నాడు చరణ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XxsiEdEVECU

Episode metadata supplied by the publisher feed · Published Jun 11, 2023

Embed this episode

NOW PLAYING

అశ్వ మేధం - ఎపిసోడ్ - 9 | Aswamedham - Episode - 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 12:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!