EPISODE · Feb 20, 2023 · 10 MIN
బాబోయ్ మీకో దండం | Baboy Milo Dandam | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాబోయ్! మీకో దండం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముంబాయి- విశాఖపట్నం విమానం టేకాఫ్ అయిన ఇరవై నిముషాల తరువాత ఎమర్జన్సీ లేండింగ్ చేస్తున్నట్లు పైలట్ ప్రకటించాడు. పైలట్ ప్రకటన విన్న తరువాత అందులో ఉన్న రెండు వందల మంది ప్రయాణికులకు మొదట అతను ఏం చెబుతునాడో అర్థం కాలేదు. అర్ధం అయిన తరువాత ఎక్కడ దించేసాడో అనీ గాబరా పడటం మొదలుపెట్టారు ; ఇంతలో నిలువెల్లా నల్లశాలువాలు, ముఖానికి ముసుగు, చేతుల్లో ఏకె 47 తుపాకీలు పట్టుకున్న ఆరుగురు మనుషులు విమానం మధ్యలోకి వచ్చి "సైలెన్స్..ఎవ్వరూ కదలొద్దు. మేము కాశ్మీర్ తీవ్రవాదులం; ఈ విమానాన్ని హైజాక్ చేసాము. కాశ్మీర్ జైల్లో నిర్భంధించిన పాతిక మంది మా కాశ్మీర్ తీవ్రవాదుల్ని భారత ప్రభుత్వం విడిచిపెడితేనే మీరు ప్రాణాలతో బయటపడతారు.. అంతవరకూ నోరుముసూకొనీ కూర్చోండి".. అంటూ గట్టిగా మైకులో చెప్పారు. తరువాత అందులో ఇద్దరు ఉగ్రవాదులు పైలట్లు ఉన్న కాక్‌పిట్‌లోకి వెళ్ళారు. అందరూ అది ఎక్కడ దిగిందోననీ ఆందోళనతో అద్దాల్లోంచి చూడసాగారు. ఎదురుగా పెద్ద కొండ.. ఏదో బ్రిటిష్ కాలం నాటి పాత ఎయిర్ బేస్ లా ఉంది. దూరంగా వరి చేలు, కొబ్బరి చెట్లు, డీజేల్లో పెద్ద సౌండ్‌తో అర్థం కాని తెలుగులో పాటలు వినిపిస్తూన్నాయంటే బహుశా ఆంధ్రలాగే ఉంది అన్న అభిప్రాయానికి వచ్చారు ; ఇంతలో ఒక ఉగ్రవాది "24 గంటల్లోగా ఆ టెర్రరిస్టుల్ని జైలు నుంచి వదిలెయ్యాలనీ, లేకపోతే విమానాన్ని పేల్చేస్తామనీ" ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుండడం వినిపించింది. బహుశా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ఉన్నాడు. ఆ తరువాత నరకం మొదలైంది. బాత్‌రూమ్‌కి వెళ్ళాలన్నా వాళ్ళకి చెప్పి వెళ్ళవలసి వస్తోంది. కాకపోతే టెర్రరిస్టులు మంచి వాళ్ళలా ఉన్నారు. అందరికి ప్రతీ గంటకు కాఫీలు , టీలు, టిఫిన్లు వాళ్ల సీట్ల దగ్గరికే తెచ్చి ఇస్తున్నారు. అప్పటికే చాలా మంది వాళ్ళిచ్చిన టిఫిన్లు తింటూ సెల్‌ఫోన్లో వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. అలా ఒక రాత్రి గడిచింది. హైజాకర్లు గంట గంటకూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సెల్‌ఫోన్లలో బేరాలు సాగిస్తున్నారు. అప్పుడు ప్రయాణికుల్లో ఒకతను ``బాబూ! అంతసేపు సెల్లో మాట్లాడితే బోలెడు బిల్లుతో పాటు ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ చేసుకోవడానికి విమానంలో బేటరీ కూడా అయిపోతున్నట్లుంది; కాబట్టి కొంచెం పొదుపుగా మాట్లాడండి” అన్నాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NJJ9nTrkZFg
Embed this episode
NOW PLAYING
బాబోయ్ మీకో దండం | Baboy Milo Dandam | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.