బంధాలు అనుబంధాలు 2 | Bandhalu Anubandhalu 2 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 16, 2023 · 13 MIN

బంధాలు అనుబంధాలు 2 | Bandhalu Anubandhalu 2 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bandhalu Anubandhalu 2/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'బంధాలు అనుబంధాలు 2/2' పెద్ద కథ రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: అమెరికాలో స్థిరపడ్డ కృష్ణమూర్తి కొడుకు అరవింద్. తండ్రి ఆఖరి దశలో అతనికి ఇండియాలో మరో భార్య ఉన్నట్లు అరవింద్ తో చెబుతాడు. తనవాళ్ళని కలవమని తండ్రి చెప్పడంతో ఇండియాకి వస్తాడు అరవింద్. ఇక బంధాలు అనుబంధాలు పెద్దకథ చివరి భాగం చదవండి. ఇంతలో లోపలినుండి నడివయసు లో ఉన్న ఒకామె వచ్చి అరవింద్ ను చూసి "మామయ్యా, మామయ్యా.. ఇతను.. " అని సందేహంగా చూసింది అరవింద్ వంక. "చిన్నప్పటి మీ ఫొటో లో వున్నట్లే ఉన్నాడు మామయ్య.. ఇతను.. ఇతను" అంటూ అరవింద్ వేపు తిరిగి "బాబూ నువ్వు అమెరికా నుండి వస్తున్నావా ?" అడిగింది ఆతురతతో .. అరవింద్ కు అర్ధమయింది ఆమె తన పెద్దమ్మ రాధ అని. "అవును అమ్మా" అన్నాడు ఆరవింద్ అప్రయత్నంగానే. అంతే! 'బాబూ' అంటూ దగ్గరికివచ్చి అరవింద్ చేతిని పట్టుకుంటూ సంతోషంతో "మామయ్యా! మీ మనవడు" ఆంటూనే లోపలికి చూస్తూ 'అత్తయ్యా' అని కేకపెట్టింది. ఇంట్లోవాళ్లకు నమ్మశక్యంగా లేదు అరవింద్ రాక. "ముందు డ్రైవరు కు అన్నం పెట్టి పంపించండి" రామయ్యగారి మాటలకు ముందుగా బయటకి వచ్చి చూసిన అమ్మాయి, డ్రైవరు వద్దన్నా వినకుండా అతన్ని వంటగదిలోకి తీసుకెళ్లి అన్నం పెట్టింది. డ్రైవరు అన్నం తిని శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ అరవింద్ చుట్టూ చేరారు. అప్పటివరకు అరవింద్ చేయి రాధ పట్టుకొనే వుంది. "ముందు స్నానం చేసిరా బాబు. అవును ఇంతకూ నీపేరు.. " అంటూ కళ్లలో నీరు తిరుగుతుండగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు కోదండరామయ్య. ఆరవింద్ కు తాతయ్య బాధ అర్థమయింది. పేరు పెట్టి నామకరణం చేయాల్సిన మనిషి పాతికేళ్ల మనవడిని పేరు అడిగి తెలుసుకోవాల్సి వచ్చిందనే బాధ.. ఆరవింద్ తాతయ్య భుజం మీద చేయి వేసి "తాతయ్యా ! నా పేరు ఆరవింద్" అన్నాడు. రామయ్య ఇటు తిరిగి ప్రేమగా చూస్తూ కన్నీరు నిండిన కన్నులతో అరవింద్ ముఖాన్ని తృప్తిగా చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టుకొన్నాడు. ఆరవింద్ నాయనమ్మ దగ్గరకెళ్ళి "నానమ్మా" అంటూ వంగి కాళ్లకు నమస్కరించాడు. అన్నపూర్ణ మనవడిని లేవనెట్టి కౌగిలిలో పొదుపుకున్నది కన్నీళ్లు నిండిన కనులతో. ఆరవింద్ స్నానం చేసి రాగానే రాధ అన్నం కలుపుకుని వచ్చింది. అరవింద్ తింటానన్నా "నేను తినిపిస్తా బాబూ " అంటూ ముద్దలు చేసి పెట్టసాగింది. ఆరవింద్ కు ఊహ తెలిసాక ఎవరూ ఇలా అన్నం తినిపించలేదు. అంతా క్రొత్తక్రొత్తగా, కలగా అనిపిస్తున్నది. అన్నం తింటుండగానే 'మీ అత్తయ్య కూతురు శ్రీనిజ M. sc. అగ్రికల్చర్ చదువుతున్నది. సెలవలకి ఇక్కడికి వచ్చింది. ఈమె రాధ, నీకు పెద్దమ్మ. మీ అక్కయ్య ఖమ్మంలో వుంటున్నది. మీ బావ M. D. O గా చేస్తున్నారు. అక్కయ్యకు ఇద్దరు చిన్న పిల్లలు. L K G, U K G చదువుతున్నారు. మీ మామయ్య అడ్వకేటు గా పనిచేస్తున్నాడు. రేపు వస్తారు అందరూ. ఇప్పుడే ఫోన్ చేసి చెపుతా' అని పరిచయాలు కానిచ్చాడు రామయ్య. అన్నం తినగానే రామయ్యగారు లక్ష్మికి, ప్రణవికి అరవింద్ వచ్చిన విషయం ఫోన్ చేసి చెప్పి రేపు ఉదయం రమ్మని చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_IkAX-071xE

NOW PLAYING

బంధాలు అనుబంధాలు 2 | Bandhalu Anubandhalu 2 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

0:00 13:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 16, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bandhalu Anubandhalu 2/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'బంధాలు అనుబంధాలు 2/2' పెద్ద కథ రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!