EPISODE · Jun 26, 2023 · 17 MIN
దోషి ఎవరు పార్ట్ 1 | Doshi Evaru Part 1 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'దోషి ఎవరు' పెద్ద కథ ప్రారంభం 'Doshi Evaru Part 1' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'దోషి ఎవరు పార్ట్ 1' తెలుగు పెద్ద కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “హాయ్ మాధవీ, ఎలా ఉన్నావే?” “హాయ్ సుమా, నేను బాగానే ఉన్నాను, కానీ ఏంటి ఇవాళ నేను గుర్తొచ్చాను నీకు? గులాబీ మొక్కకి మందారాలు పూసాయా లేక మల్లె తీగ, జాజులు విరబోసిందా? ఎప్పుడు నేను చేసినా బిజీ అంటూ, ఎవరో తరుముతున్నట్టు ఫోన్ పెట్టేస్తావు? సరే, ఇవన్నీ వదిలెయ్యవే, ఎలా వున్నారు నువ్వు, మీ శ్రీవారు, మీ ముద్దుల లాస్య?” “అవునే మాధవీ, నిజమే, ఎప్పుడు ఖాళీ దొరకదే. ఓ పక్క ఉద్యోగం, సంసారం, హుష్, సాగరమైనా ఈదొచ్చును కానీ, ఈ సంసారం భారం మోయడం చాల కష్టమే బాబూ. సరే గానీ, సాయంత్రం ఓ అరగంట కి కలవడం అవుతుందా? నీతో చాలా మాట్లాడాలి!” గట్టిగ ఊపిరి తీసింది సుమ, మాధవీ చెప్పే సమాధానం కోసం ఉత్కంఠ గా చూస్తూ. “ఏంటి రా, ఎనీ ప్రాబ్లెమ్ విత్ సుధాకర్? చెప్పు ఏవైనా తోక జాడిస్తున్నాడా.. నా సంగతి తెల్సుగా, తాట తీస్తా” పెళ్లయిన ఆడది బాధ పడుతోంది అంటే, ముందు భర్తలని అనుమానించడం పరిపాటయ్యింది.. “అయ్యో! అలాంటిదేమి కాదే బాబు, పాపం సుధాకర్.. నన్ను ప్రాణానికి ప్రాణం గా చూసుకుంటాడే” భర్త మీద ఈగ వాలనివ్వలేదు సుమ. “ఓకే రా, ఐదింటికల్లా మినర్వా లో కలుద్దాం.. నేను కొంచం త్వరగా వెళ్ళాలి, పాపం అమ్మ, షాలిని ఐదయ్యిందగ్గరనించి, ఎదురు చూస్తూ ఉంటారు..” మాటల్లో తల్లి ప్రేమ వత్తులు పెట్టింది. ******** మాధవీ, సుమ, ఆరవ తరగతి నుండి కలిసి ఒక స్కూల్ లో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ.. అన్నీ ఒక కాలేజీ లో చదివారు. ఇద్దరూ మంచి స్నేహితులు. పెళ్లిళ్లు కూడా హైదరాబాద్ లో స్థిర పడ్డ వ్యక్తులతోనే జరగడం వల్ల, ఇద్దరి స్నేహానికి, ఎలాంటి అవరోధాలు లేవు. మాధవీ చాలా చురుకైనది, అన్నిటా చాలా ముందుంటుంది, సుమ కి కొంచం సిగ్గు, మొహమాటం పాళ్ళు ఎక్కువ, పైగా భయస్తురాలు. ప్రతిదానికి, చిగురుటాకులా కంపించిపోతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా, భూమ్యాకాశాలు ఏకమైపోయినట్టు గాభరా పడిపోతుంది. కానీ, ఇద్దరిలో ఉన్నదీ, అద్వితీయమైన ప్రేమ, అభిమానం, పెద్దలంటే గౌరవం, ఉన్నతమైన సంస్కారం. ఇదే వారి స్నేహానికి, మంచి కాంక్రీట్. ఇద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని, సంసారం నౌకలని, చక్కగా నడుపుకుంటున్నారు. ఇద్దరూ వారి జీవితాల్లో ముఖ్యమైన సందర్భాల్లోను, వేడుకల్లోనూ కలుసుకుంటూ, అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ, కుదిరినప్పుడు, కలుసుకుని, కప్పు కాఫీ తో కాసిన్ని కబుర్లు కలపోసుకుంటుంటారు. కార్తీక మాసం లో వనభోజనాలప్పుడు, రెండు కుటుంబాలు కల్సి, పిక్నిక్ లకి వెళ్తుంటారు. వారి స్నేహ పరిమళాలు నేటికీ గుబాళిస్తూనే ఉన్నాయి. ఇది అందరి విషయంలో సాధ్యపడదు. వీరి స్నేహం దేవుడు ఆశీర్వదించాడు. ********** సాయంత్రం ఐదింటికల్లా మినర్వా గ్రాండ్ చేరుకొని, వారిద్దరూ ఎప్పుడు కూర్చునే, మూల టేబుల్ దగ్గర కూర్చుంది సుమ. మాధవి రాగానే, వారిద్దరికీ అత్యంత ఇష్టమైన, మసాలా దోస ఆర్డర్ చేసుకుని, దాంతో పాటే, మంచి ఫిల్టర్ కాఫీ కూడా తెప్పించుకున్నారు. వారికీ దోస తింటూ మధ్యలో కాఫీ ని కొద్ది కొద్దిగా సిప్ చేయడం అంటే చాలా ఇష్టం. దోస కాఫీ పూర్తయ్యేవరకు, ఏవో అవి ఇవి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. సుమ చెప్పడం ప్రారంభించింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/FJQ0zizsDX8
What this episode covers

NOW PLAYING
దోషి ఎవరు పార్ట్ 1 | Doshi Evaru Part 1 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.