EPISODE · Apr 14, 2023 · 12 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 | Garudashram - Episode 14 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ తరువాత ప్రణవి మళ్ళీ మొదలు పెట్టింది. "యువరానర్! భావన తన హత్యకు ముందు వ్రాసిన డైరీ ఇది. ఇందులో ఆమె ఏం జరిగిందో అంతా వ్రాసింది. మల్హోత్రా అనే ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె దగ్గరికి వచ్చి, మిసైల్స్ కి సంబంధించిన డ్రాయింగులు కావాలని అడిగినట్లు, అందుకు తాను ఇవ్వనని అతనితో చెప్పినట్లు ఆమె వ్రాసింది. ఆ తరువాత నా క్లయింట్ శ్రీహర్ష అరెస్ట్ తరువాత ఆమె మళ్ళీ మల్తోత్రాకి ఫోన్ చేసి అతన్ని నిలదీసినట్లు కూడా ఇందులో వ్రాయబడింది. దీన్ని బట్టి ఆమె హత్యకు, డ్రాయింగులు బయటకు వెళ్ళడానికి 'కింగ్ పిన్'- అంటే ముఖ్య కారణం మల్తోత్రా అని తెలుస్తోంది. తాను డ్రాయింగులు ఆమెని అడిగిన తరువాత డ్రాయింగులు బయటకు వెళ్ళాయి కాబట్టి దానికి తనే కారణం అని ఆమెకు తెలిసి పోయి ఉంటుందనీ, ఆమె బ్రతికి ఉంటే తన బండారం బయట పడుతుందని భయపడి మల్తోత్రానే భావనని కిరాయి హంతకులతో హత్య చేయించి ఉండొచ్చు. ఇంకొక్క ముఖ్య విషయం, ఆ హంతకులు రవీంద్ర చెబుతున్నట్లు ఇక్కడి వ్యక్తులు కారు. వాళ్ళిద్దరూ బీహరీ క్రిమినల్స్.. ఎన్నో హత్య కేసుల్లో ముద్దాయిలు. వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళు, ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తి తన పలుకుబడితో రవీంద్రని ప్రలోభ పెట్టి ఆ ఇద్దరు నేరస్తులను ఇక్కడికి పంపించి వాళ్ళని ఏదో కేసులో ఇరికించి లాకప్పులో ఉంచి అవసరమైన సమయంలో వాళ్ళని బయటకు పంపి హత్య చేయించారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరీ మల్తోత్రా? ఇతను ఆ మిసైల్ డ్రాయింగ్స్ కోసం ఎందుకు ఆ మిసైల్స్ డిజైన్ సెంటర్ కి వెళ్ళాడు? ఇతను ఎవరి సలహాతో ఈ పని చేసాడు? ఆ ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను ఎవరు పంపారు?; ఇంతకీ ఈ కేసులో ముఖ్య వ్యక్తులు ఎవరు? వీరికి పాకిస్తాన్ గూఢాచారులతో సంబంధం ఉందా ? ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు ఇటువంటి పనులు చేస్తూ దేశభద్రతకు ముప్పు తెస్తున్నారు? కేసుని పక్క తోవ పట్టించడానికే సీఐడి ఏ సంబంధం లేని శ్రీహర్షను అరెస్ట్ చేసారా ? వీటన్నిటికీ సమాధానాలు కావాలి. వాటికి సమాధానాలు తెలియకపోతే దేశభద్రతకు పెను ముప్ప వాటిల్లుతుంది.. దీన్ని ఇలా వదిలేస్తే చాప కింద నీరులా శత్రువులు కుట్రలు పన్ని దేశంలో అల్లకల్లోలాలు సృష్టించే అవకాశం వుంది .. కాబట్టి కోర్టు వారు ఈ సాక్ష్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించి, దేశభద్రతను కాపాడవలసిందిగా కోరుతున్నాను ” అంటూ తన వాదనలు ముగించింది. కోర్టు ఆ కేసుని రెండు రోజుల తరువాతకు వాయిదా వేసింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/hWNTpfwURl4
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 | Garudashram - Episode 14 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.