EPISODE · Nov 11, 2022 · 8 MIN
జీవన స్వరాలు | Jeevana Swaralu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జీవన స్వరాలు రచన : M R V సత్యనారాయణ మూర్తి పెళ్లి పందిట్లోంచి వినిపిస్తున్న సుస్వరాల సన్నాయి మేళాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. “చక్కని అన్నమయ్య కీర్తనలు విని చాలా రోజులు అయ్యింది. ఈ మధ్యన చెవులు చిల్లులు పడే వాయిద్యాల హోరు, పిచ్చి పిచ్చి పాటలు విని విసుగెత్తిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది” అన్నాడు రామమూర్తి, పక్కన ఉన్న జగన్నాధంతో. “ఈ సన్నాయి మేళం వాళ్ళది రాఘవాపురంట. రాయుడు గారు ప్రత్యేకంగా పురమాయిన్చారుట’ అన్నాడు జగన్నాధం. రాయుడుగారి మేనకోడలు పెళ్లి శివపురం బాలాజీ ఎ.సి. ఫంక్షన్ హాలులో చాలా వేడుకగా జరిగింది. విందు భోజనం కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలా మంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం. సన్నాయి రమణ, రాయుడుగారి దగ్గరికి వచ్చి దణ్ణంపెట్టి “వెళ్తామండి అయ్యగారూ” అన్నాడు వినయంగా. “భోజనాలు చేసారుగా. టీ తాగి వెళ్ళండి” అన్నారు రాయుడుగారు. ఆయన మాట కాదనలేక “అలాగే నండి” అని మండపం చివర తమకు కేటాయించిన చోటు దగ్గరకి వచ్చి తమ వాళ్ళతో ‘దొర గారు టీ తాగి వెళ్ళమన్నారు’ అని చెప్పాడు. సన్నాయి మేళానికి డబ్బులు ముందుగానే ఇచ్చేశారు రాయుడు గారు. భోజనాలప్పుడు గుమాస్తా గారు వచ్చి దారి ఖర్చులు డబ్బులు కూడా ఇచ్చేశారు. డబ్బులు దండిగా వచ్చినందుకు అందరూ సంతోషించారు. పావుగంట గడిచేసరికి ఒక అమ్మాయి ట్రే లో మైసూరు పాకు, కారబ్బూంది ప్లేట్లలో తీసుకువచ్చి సన్నాయి బృందం ఆరుగురికీ ఇచ్చింది. డోలు వాయించే శేఖర్, ఆ అమ్మాయి కట్టుకున్న పరికిణీ చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లి ఊరేగింపు బొమ్మలు, ఆ అమ్మాయి పరికిణీ మీద చాలా అందంగా కుట్టి ఉన్నాయి. జాకెట్టు చేతులమీద కూడా హంస బొమ్మలు రంగు రంగుల దారాలతో కుట్టి ఉన్నాయి. “అమ్మాయి గారూ, మీ పరికిణీ చాలా బాగుందండి. బొమ్మలు కూడా బాగా కుట్టారు” అన్నాడు శేఖర్. ఆ అమ్మాయి చిన్నగా నవ్వి “రాజమండ్రిలో కుట్టించారు. నెల్లాళ్ళు పట్టింది ఈ బొమ్మలు కుట్టడానికి” అని వెళ్ళిపోయింది. రాయుడు గారి అబ్బాయి వెంకటాద్రి రాయుడు ఆ అమ్మాయిని పిలిచి అడిగాడు ‘ఆ కుర్రాడు నీతో ఏం మాట్లాడాడు’ అని. ‘పరికిణీ గురించి అడిగాడు. అంతే’ అని చెప్పి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది. తన స్నేహితులు ఇద్దర్ని తీసుకుని శేఖర్ దగ్గరకు వచ్చి లాగి చెంప మీద కొట్టాడు వెంకటాద్రి రాయుడు. సన్నాయి మేళం వాళ్ళు అందరూ నివ్వెరపోయారు ఆ సంఘటనకి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/scSC7Zx2k2w
What this episode covers

NOW PLAYING
జీవన స్వరాలు | Jeevana Swaralu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.