EPISODE · Jan 31, 2023 · 5 MIN
కాకి కావాలి | Kaki Kavali | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకి కావాలి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుబ్బారావు, వెంకటేష్, మూర్తి ముగ్గురు అన్నదమ్ములు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. సుబ్బారావు పెద్దవాడు అవడం తో పదిహేను సంవత్సరాల నుండి తల్లితండ్రుల తద్దినం పెడుతున్నాడు. మొదటిలో సెరమనీ కి అయ్యే ఖర్చు ముగ్గురన్నదమ్ములు సమంగా భరించేవాళ్ళు. అయితే ఏమైందో కానీ, సుబ్బారావు తమ్ముళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా ఖర్చు మొత్తం తనే భరించేవాడు. అన్నగారింటికి వెళ్లి, తద్దినం పెట్టే వాడి తమ్ముళ్లలా వుండకుండా, ‘యిన్ని సంవత్సరాలనుండి అన్నగారు తల్లిదండ్రుల తద్దినం పెడుతున్నా, ఒక్కసారి కూడా కాకి పిండాన్ని కాకి వచ్చి తినలేదు’ అని తమలో తామే మాట్లాడుకోవడం, సుబ్బారావు భార్య విని, మొగుడికి చెప్పింది. ‘పదివేలు ఖర్చు పెట్టి యింత శ్రద్దగా మీరు మీ తల్లిదండ్రుల తిధి పెడుతున్నా, మీ తమ్ముళ్లు ఒక్క పైసా ఖర్చు పెట్టక సరికదా, మీరు తిధి పెట్టడం మీ తల్లిదండ్రులకి యిష్టం లేదని, అందుకే కాకి వచ్చి పిండం ముట్టడం లేదని అనుకుంటున్నారు’ అని చెప్పింది. దానితో మనసు పాడైన సుబ్బారావు, తమ్ముళ్ళని పిలిచి “యిహనుంచి తల్లిదండ్రుల తిధి ఏడాది కి ఒకరి యింట్లో పెడదాము, దానివలన మీరు కూడా తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నట్టు అవుతుంది” అని అన్నాడు. అన్నగారి మాటలకి తెల్లబోయిన వెంకటేష్, మూర్తి సరే అని ఒప్పుకున్నారు. సంవత్సరం గడిచింది. రెండు రోజులలో తండ్రి తిధి వెంకటేష్ యింట్లో పెట్టాలి. వెంకటేష్ కి నిద్రపట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి సిద్దమైనా, ఒకవేళ తిధి నాడు కాకి రాకుండా వుంటే ఎలా? నిన్నటి వరకు అన్నగారిని అక్షేపించినట్టు, యిప్పుడు తనని కూడా అనుకుంటారు అనుకుని, తమ్ముడు మూర్తి కి ఫోన్ చేసి, తన భయం చెప్పాడు. “నిజమే, ఈ హైదరాబాద్ లో కాకులు ఎక్కడివి రావడానికి, ఇన్నాళ్ళు అన్నయ్య ని ఆడిపోసుకున్నాము” అన్నాడు మూర్తి. చివరికి ఒక ఉపాయం అలోచించి, స్కూటర్ మీద అబిడ్స్ లో పక్షులు అమ్మే అతని దగ్గరికి వెళ్లి, ఒక కాకిని అద్దెకు తీసుకుని తిధి వరకు ఆ కాకికి గోడ మీద అన్నం ముద్ద పెట్టి అది తిని మళ్ళీ వచ్చేవిధంగా ట్రైనింగ్ యిచ్చే విధంగా ఒప్పించుకుని వచ్చారు. ఒప్పుకున్న విధంగానే కాకి యజమాని వచ్చి ట్రయినింగ్ యివ్వడం, తను కూడా కడుపునిండా తినడం జరిగింది. అనుకున్న రోజు వచ్చింది. తమ్ముడి ఇంటికి భార్య, పిల్లలతో చేరుకున్నాడు సుబ్బారావు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/747mHkFxF30
What this episode covers

NOW PLAYING
కాకి కావాలి | Kaki Kavali | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.