కోవిదార సుమం | Kovidara Sumam | Telugu Short Story | Ganga Koumudi | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 17, 2023 · 10 MIN

కోవిదార సుమం | Kovidara Sumam | Telugu Short Story | Ganga Koumudi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Kovidara Sumam' - New Telugu Story Written By Ganga Koumudi 'కోవిదార సుమం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: గంగా కౌముది కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "అమ్మా! విద్యావతి, నాకు పూజకి వేళ అవుతొంది. గంగమ్మను అర్చించి వస్తాను. అంతవరకు పిల్లలను చూస్తూ ఉండమ్మ" అంటూ జాగ్రత్త చెబుతోంది ఓ వనిత. చూడటానికి తపస్వినిలా ఉన్నా ఆమె స్వరం కోకిలకి పాఠాలు నేర్పేటంత మధురంగా ఉంది. ప్రపంచంలో ఉన్న పూలన్నీ కలిపి తయారు చేసినట్లు ఆమె ముఖం కాంతి వెదజల్లుతొంది. కోటి సూర్యులు, శత కోటి చంద్రులు ప్రకాశించినా ఆ కాంతి ముందు తక్కువే అనిపిస్తోంది. ఆమె నడక హంసలకి పాఠాలు చెప్పే విధంగా ఉంది. సాక్షాత్తు ఆదిలక్ష్మీ దేవి భువిపైకి వచ్చినట్లున్న ఆమె గంగా నదికి బయలు దేరుతూ తోటి చెలికి తన పిల్లలను అప్పగిస్తోంది. "అలాగే లోకపావనీ దేవి! నాకు అంతగా చెప్పాలా! నువ్వు పూజ చేసుకుని రా తల్లీ! నేను పిల్లలను చూసుకుంటాను" అన్నది ఆమె చెలి విద్యావతి. తూర్పు తెల్లవారింది. బాల భానుని నునులేత కిరణాలు పద్మాలను ముద్దాడుతున్నాయి. విరిసీ విరియని కుసుమాలు అరవిరిసిన అరవిందాలతో మకరందాలు చిందుతున్నాయి. ప్రకృతి అంతా శరత్కాల శోభని సంతరించుకుంది. ఆ నగర ప్రాంగణంలో అంత శోభ విరిసినా ఓ మందిరంలో ఎవ్వరూ పోల్చలేని చీకటి తాండవిస్తూనే ఉంది. ఐదేళ్లుగా ఆ చక్రవర్తి హృదయాంతరాళంలో కమ్ముకున్న విషాద మేఘాలు కరిగి కన్నీరై వర్షిస్తోంది. ఇంతలో ఏవో అడుగుల సవ్వడి విని అటువైపు చూసాడు. "అన్నా ! వందనం" అంటూ ఒక శుభ లక్షణ మూర్తి ఆ చక్రవర్తికి పాదాభివందనం చేసాడు. ఆ శుభ లక్షణ మూర్తి సర్వ శోభితుడైన లక్ష్మణ స్వామి. ఆ చక్రవర్తి భువనైక మోహన జగదాభి మూర్తి యైన శ్రీరామ చంద్రమూర్తి. "అన్నా! గురువులైన వశిష్టుల వారి ఆనతి ప్రకారం మనం ఈ శరత్కాల వేళ వేటకు బయలుదేరాలి. అరణ్య ప్రాంత సంరక్షణా బాధ్యత నిర్వర్తించవలెనని గురువుల కోరిక. కనుక తమ ఆనతి అయితే రేపే సిద్ధం చేస్తాను అన్నయ్య!" అని సవినయంగా విన్నవించుకున్నాడు లక్ష్మణ స్వామి. "లక్ష్మణా! సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం అపవాదు కారణంగా మీ వదినను కానలకు పంపిన కఠినాత్ముడను. నన్నూ ఆ కానల పాలు చేసే తరుణం మంచిదే నాయనా! గురువులు ఎటుల చెప్తే అట్లే కానీ నాయనా" అన్నాడు రామయ్య. ఆ మాటలు వింటూనే "లేదు అన్నయ్య! మనుష్యులు కేవలం నిమిత్తమాత్రులు. సర్వం దైవాధీనం. తమరు అన్యదా చింతించకండి" అన్నాడు. "సరే! రేపే భాగీరదీ అరణ్యానికి ప్రయాణం సిద్ధం చేయి" అంటూ తన లోకంలో తాను ములిగిపోయాడు శ్రీరాముడు. గంగా తీరంలో పూజ చేసి గంగమ్మకి పూలమాల సమర్పించి, లోకపావనీ దేవి తన ఆశ్రమానికి బయలుదేరింది. ఇంతలో ఐదేళ్ల పిల్లాడు ఆమెని చూసి "అమ్మా! అప్పుడే పూజ అయిపోయిందా! మరి పసాదం ఏదీ" అంటూ తన బుజ్జి చేతులతో ఆమెని చుట్టేసాడు. అప్పుడు గ్యాపకం వచ్చింది ఆమెకు ప్రసాదం అక్కడే మరిచానని. "నాయనా! కుశా! నీవు తమ్ముడిని చూస్తూ ఉండు. నేనిప్పుడే ప్రసాదం తీసుకువస్తాను" అంటూ మరలా గంగా తీరానికి వెళ్ళింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AQl1CEOlEwA

Episode metadata supplied by the publisher feed · Published Aug 17, 2023

Embed this episode

NOW PLAYING

కోవిదార సుమం | Kovidara Sumam | Telugu Short Story | Ganga Koumudi | manatelugukathalu.com

0:00 10:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 17, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!