EPISODE · May 24, 2023 · 11 MIN
మా తిరపతి పయానం | Ma Tirapati payaanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ma Tirapati payaanam' New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao 'మా తిరపతి పయానం' తెలుగు కథ రచన: వారణాసి భానుమూర్తి రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వుండేది. పుట్టినెంట్రుకలు తీయించే దానికి కొందరు గుర్రం కొండ కాడుండే రెడ్డమ్మ కొండకు, కొందరు చౌడేపల్లి కాడుండే చౌడమ్మ గుడికి పోతారు. మా నాయన అప్పో సప్పో చేసి తిరపతికి పోతా వుండె. తిరపతికి పోవల్లంటే కర్చు చ్యానా అవుతుంది. మా కుటుంబం పోవల్లంటే నూరు రూపాయలయినా గావల్ల. అంత దుడ్డు మా కాడ ఉండేది గాదు. మా నాయన నాకు ఆరేడేళ్ళు వచ్చినా పుట్టినెంటుకలు తీయించలా నాకు. "పాపం మగ పిల్లోడు.. యాందీ దరిద్రము? ఆడ పిల్ల మాదిరి జుట్టు పెంచుకొని జడ ఏస్తావుంటే నాకు ఏడుపు వస్తా వుండాది. నాకు కోపమొస్తే మంగలోళ్ళ రామన్న పిలిపించి ఇంట్లోనే గుండు కొట్టిస్తా!" అని గట్టిగా మా నాయన్ను తిడ్తా వుండేది మా యమ్మ. మా నాయన నన్ను తీసుకొని ముద్దు చేసే వాడు. “సూడు నా కొడుకు! ఎంత అందంగా ఉండాడో! జుట్టు పెద్దదయినా గిరజాలు వేసుకొని, రిబ్బన్లు ఏసుకొని, చిన్ని కిట్టయ్య మాదిరి వుండాడు." అని నన్ను దగ్గరకు తీసుకొని ముద్దులు కురిపించే వాడు మా నాయన. "నాయనా! నాకు మగ పిల్లోళ్ళ మాదిరి క్రాపు చేయించు. నన్ను చూసి నా స్నేహితులంతా గేలి చేస్తా వుండారు. ఆడోడా.. అడోడా అని పిలుస్తా నవ్వతా వుండారు. నాకు బిరీన గుండు కొట్టిస్తావా ? లేదా?" అని నేను చానా కోపంగా అడిగినా. "తిరపతికి పోదాము నాయనా! ఈ సారి కూరగాయలు ఏసినాము గదా మన మడ్లో! వారం వారం అమ్మతా వుణ్డాము గదా మాలు సంతలో.. కలకడ సంతలో గూడా అమ్మతా వుండాము. ఈ సారి మన ఆవులు ఈని నాయి గదా? పాలు గూడా బాగా యిస్తా వుండాయి. కవ్వం పెట్టి అమ్మ సిలికితే మస్తుగా వెన్న పడతా వుండాది. ఆ ఎన్న వుట్టి మీద ముంతలో పెట్టి వారానికి ఒక సారి మరగ పెడితే నెయ్యి వస్తా వుండాది. నెయ్యి గూడా సొలిగె పావలా లెక్కన అమ్మతా వుండాము. రూపాయికి నాలుగు సొలిగెల నెయ్యి. నూరు రూపాయలు సేతిలో పడితే తిరపతికి అందరమూ పోతాము నాయనా!" అని మా నాయన కథంతా సెప్పె. బియ్యం గూడా శేరు రూపాయి అని మా నాయన చెప్పినాడు. అందుకే మేము నూకలు కొనుక్కొని రాగి సంగటి చేసుకొని తింటాము. బియ్యం ధర ఎక్కువంట. నాకు ఏ ఇసయ మైనా మా నాయన పూస గుచ్చి నట్లు చెప్తాడు. అందుకే నాకు అన్ని ఇసయాలు మా అన్న, అక్క కంటే నాకే బాగా తెలుసు. చానా విసయాలు నేను మా నాయన దగ్గరే నేర్చు కొన్నా! ఎందుకంటే నేను సిన్న కొడుకును గదా! అందుకే మా నాయనకు నేనంటే స్యానా ఇష్టం. రెండు, మూడు నెలల తరువాత మా నాయన నూరు రూపాయలు సంపాయించి నాడు. ఒక మంచి రోజు సూసు కొని పొద్దున్నే ఆరు గంటలకు స్నానాలు చేసి, మంచి బట్టలు ఏసు కొని, నేను మా నాయన, మా అమ్మా, మా యన్న, మా యక్క ఇంటిలో ఎంకటేస్వర సామి పటానికి టెంకాయ కొట్టి అందరమూ తిమ్మాపురం క్రాసు కాడికి నడుసుకొంటా పోతిమి. అమ్మ సిత్రాన్నము, గడ్డ పెరుగన్నము టిఫిన్ గిన్నెల్లో కట్టుకొని గుడ్డ మూత కట్టి బిగించె. ఇంకా మా యమ్మ మేము తినేదానికి అప్పచ్చులు, కారాలు, చుట్టలు, పప్పు బిళ్ళలు, కారం బెట్టి వేయించిన అనప కాయ గింజలు, వేయించిన చెనిక్కాయ గింజలు, పాగం పప్పు వుంటలు, జొన్న బొరుగుల బెల్లం కలిపిన వుంటలు అన్నీ ఎత్తుకొని తిత్తిలో పెట్టుకొని ఇల్లు బీగాలు వేసుకొని నడిస్తిమి. ఈ రెండు రోజులూ గొడ్డూ గోదా తిండి కోసం మా ఇంటి పక్కనున్న మా మామోళ్ళకు జాగరత్త గా చూసుకోమని చెప్పితిమి. మాకు కోడి పెట్టలు, పుంజులు నాలు గైదు వుండాయి. వాటి కోడి పిల్లలు పదో ఇరవై వుండాయి. రాత్రి అయిందంటే ఆటిని పెద్ద గంపల కింద చేర్చల్ల. ఆ పని మా అత్తోళ్ళకు చెప్పి నాము. నాలుగైదు మేకలుండాయి. ఆటిని మేతకు తీసుకొని పోవల్ల అని మా మామా వాళ్ళకు చెప్పితిమి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kAr2TiZ4a_U
What this episode covers

NOW PLAYING
మా తిరపతి పయానం | Ma Tirapati payaanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.