EPISODE · Dec 2, 2022 · 12 MIN
మానవత్వం | Manavathvam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మానవత్వం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ ప్రతి యుగంలోనూ దేవదానవులు వున్నారు. ఈ కలియుగంలోనూ మానవాకృతిలో... దేవతలు దానవులు వున్నారు. ఈ రెండు వర్గాలకు సదా విరోధం... గెలుపు దేవతలదే... అదే మానవత్వం... భువనగిరి రామారాయుడు ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి చుట్టూ వున్న పది పన్నెండు గ్రామాల్లో మంచి పేరున్న మనిషి. వారి తాతతండ్రులూ అదే పేరుతో బ్రతికినవారు.. సత్యం, ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీలకు ప్రతిరూపం రామారాయుడు. వీరి తండ్రి గారు గోవింద రాయుడు, వారి తండ్రిగారి చివరి రోజుల్లో వారి యిష్టానుసారంగా నూరు ఎకరాల పంట భూమిని ఆ గ్రామ పేద ప్రజలకు పంచారు. ఆ వూరిలో వీరి సొమ్ము తినని వారులేరు. తాతతండ్రులు కీర్తిశేషులు. రాయుడి అర్థాంగి జానకమ్మ. రాయుడిగారికి అన్ని విధాల తగిన యిల్లాలు. వీరికి ఒక కూతురు. పేరు పల్లవి. అమెను డాక్టర్ చేయాలని, ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మించి తన కూతురి చేత ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయించాలనే తన చిరకాల వాంఛ కారణంగా... యం.బి.బి.ఎస్ పాసైన తర్వాత... అమెరికాలో వున్న తన పినతండ్రి కొడుకు... తమ్ముడూ అయిన డాక్టర్.. డీన్ అయిన మోహనరాయుడు వద్దకు పల్లవిని పంపాడు. యిరువురు అనాథ బాల బాలికలను దత్తు తీసుకొని వారిని తమ కన్న బిడ్డల్లా చూచుకొంటూం చదివిస్తున్నారు ఆ దంపతులు. వీరి పాలేరు కనకయ్య... గుమాస్తా ఆదిశేషయ్య. పువ్వుకు వున్న వాసస, కట్టిన నారకు సంక్రమించినట్లుగానే... వారిరువురికీ యజమాని గుణగణాలు అలవడ్డాయి. వారి ఆదేశాలను తు.చ తప్పకుండా నిర్వర్తిస్తూ, రాయుడికి తగిన బంట్లని... వారూ మంచి పేరు తెచ్చుకొన్నవారే. పాలేరు కనకయ్య భార్య సుమతి. వీరికి ఒక మొగబిడ్డ. పేరు రఘు. హై స్కూలు చదువు పూర్తి కాగానే రఘు యిష్ట ప్రకారం... అతన్ని బి.యి. సివిల్ యింజనీరింగ్‌లో చేర్పించాడు. రాయుడు. గుమాస్తా ఆదిశేషయ్యకు ఒక కూతురు. పేరు సంధ్య. యీమె తల్లి పదేళ్ళ క్రిందిట. మరణించింది. నాయనమ్మ శాంతమ్మ, ఆమెను పెంచి పెద్ద చేసింది. సంధ్య బి.యిడి చదువుతూ వుంది. కనకయ్య... ఆదిశేషయ్యలు మంచి స్నేహితులు. వీరి సఖ్యతను చూచిన రాయుడు ఆదిశేషయ్య కుమార్తెను, కనకయ్య కుమారుడికిచ్చి వివాహం చేసి వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని వేరు వేరుగా ఆ యిరువురితో ప్రస్తావించారు. రాయుడి గారి అభిప్రాయానికి వారు సంతోషించారు. సమ్మతించారు. అప్పటికి రఘు యింజనీరింగ్ చదువు పూర్తయింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kjc0FPnxayI
Embed this episode
NOW PLAYING
మానవత్వం | Manavathvam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.