EPISODE · Feb 20, 2023 · 10 MIN
మకాం మార్చేయాలి | Makam Marcheyali | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మకాం మార్చేయాలి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రమణారావు, సుజాతలకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటు పిల్లలిద్దరిని చదివించుకుని, అమ్మాయికి పెళ్లిచేసి అమెరికాకి పంపించారు. కారణం ఏమిటో తెలియదు కాని, కొడుకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా, ఇండియాని, తల్లిదండ్రుల ని వదిలి వెళ్లనని, తనకి తగిన మంచి ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరే వుండిపోయాడు. ఆ తండ్రికి కొడుకు, కూతురు అంటే చాలా ప్రేమ. అయితే బయటపడేవాడు కాదు. ఆ తల్లికి పిల్లలంటే ప్రాణం. కొడుకు పెళ్లి జరిగినా కూడా తన తల్లిదండ్రులతోనే వుండేవాడు. కోడలు కూడా ఆ యింట్లో కలిసి పోయింది. అక్కడ కూతురుకి కొడుకు పుట్టాడు. కొన్నాళ్ళు రమణారావు, సుజాత లు అమెరికా వెళ్లి కూతురు అల్లుడు దగ్గర వుండి మనవడి కి ఆరు నెలలు వచ్చే వరకు వుండి, ఇండియా తిరిగివచ్చారు. అయితే మనవడు అలవాటు అయిన రమణారావు కి బెంగ మొదలైంది. రోజూ మనవడి గురించి, వాడి నవ్వుల గురించి మాట్లాడుతు వుండేవాడు. పోనీ మళ్ళీ అమెరికా వెళ్దాం అనుకుంటే చేస్తున్న ఉద్యోగాలు అడ్డుగా వున్నాయి. ఒకరోజు సుజాత భర్తకి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది, మన యింట్లో కూడా మనవడో మనవరాలో పుడతారని. యింటికి వచ్చిన తల్లిదండ్రుల కి కొడుకు శ్రీధర్ సిగ్గుపడుతూ, “నాన్నా! మీరు మీ మనవడిని అమెరికాలో వదిలి వచ్చేసారని దిగులు పెట్టుకున్నారుగా, ఆ దిగులు త్వరలో తీరుతుంది. మమ్మల్ని దీవించండి” అని అన్నాడు. రోజులు యిట్టే గడిచిపోయాయి. కోడలు పండంటి మనవరాలిని ఇచ్చింది. అదే సమయానికి అమెరికా నుంచి కూతురు, అల్లుడు, మనవడు కూడా వచ్చారు. ఇల్లంతా సందడి సందడిగా వుంది. రమణారావు మనవడిని ఒక పక్కన, మనవరాలిని ఒకపక్కనా పడుకోపెట్టుకుని తెగ సంతోషపడటం చూసి రమణారావు కూతురు, కొడుకు తెగ మురిసిపోయేవాళ్లు. “నాన్నా! నువ్వు మమ్మల్ని మా చిన్నప్పుడు ఎలా పెంచావో తెలియదు కాని, యిప్పుడు నువ్వు మా పిల్లలతో యింత సంతోషంగా వుండటం బట్టి మమ్మల్ని కూడా అంతా ప్రేమగానే పెంచావని తెలుస్తోంది” అంది రమణారావు కూతురు. సెలవు అయిపోవడం తో కూతురు అల్లుడు మనవడిని తీసుకుని తిరిగి అమెరికా వెళ్లిపోతో వుంటే రమణారావు మనవడిని వదలలేక వాళ్ళతో అమెరికా వెళ్ళిపోదామాని అనుకున్నాడు, అయితే యిక్కడ మానవరాలి బోసినవ్వులకి లొంగిపోయి, ఇంతే జీవితం అనుకుని సరిపెట్టుకున్నాడు. ఈ విషయం లో సుజాత మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. నిమిత్త మాత్రం గా వుండేది. తను రామాయణం పుస్తకం చదువు కుంటున్నప్పుడు ఎవ్వరు మాట్లాడించినా విసుగుకునే సుజాత అమెరికా నుంచి ఫోన్ రాగానే పుస్తకం పక్కన పెట్టి పరుగున వచ్చేది మనవడిని చూడాటానికి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Lgicczj3wJE
What this episode covers

NOW PLAYING
మకాం మార్చేయాలి | Makam Marcheyali | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.