EPISODE · Apr 2, 2023 · 22 MIN
మమతల మధువు ఎపిసోడ్ 8 | Mamathala Madhuvu Episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 8 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అరగంటలో యీ వార్త ఆ వాడంతా వ్యాపించింది. వారి బంధువులు.... తెలిసిన వారు వీర గోవిందయ్య యింటికి చేరారు. గోపాల్... భీమారావులు వెళ్ళి చూచి వచ్చారు. ఆ సాయంత్రం... పాండూ మట్టిలో కలసిపోయాడు.భీమారావు మనుమడు ఆదిత్య పాండును కొట్టి చంపాడని... జనం తీర్మానించారు. యీ అవమానంతో గోపాల్ ఆదిత్యను ఆవేశంతో తిట్టాడు. కొట్టాడు. అన్నను ప్రక్కకు త్రోసి భవానీ... ఆదిత్యను తన యింటికి తీసుకొని వెళ్ళింది. వాడవారి మాటలను విన్న ప్రేమ, ఆదిత్యను చూచేదానికే భయపడింది. తన వల్ల పాండు చచ్చిపోయాడని ఆదిత్య కుమిలి కుమిలి... ఏడ్చాడు. యింట్లోనించి బయటికి వచ్చేదానికి బయపడ్డాడు.పాండూ మేనమామ పుల్లారావు... రౌడీ... త్రాగుబోతు. భీమారావు యింటికి వచ్చి... "నా అల్లుణ్ణి నీ మనవడు చంపాడు. మేము పోలీస్ కంప్లయింట్ యిస్తాం... కోర్టులో కేసు వేస్తాం... మీ వాడిని... జైలుకు పంపిస్తాం. నా సంగతి మీకు తెలవదు.” త్రాగిన మైకంలో నోటికొచ్చినట్లు వాగాడు.భీమారావు... డాక్టర్ వేణుమాధవు, మాస్టారు మాధవయ్యను. సబ్ ఇన్ స్పెక్టర్ జార్జిని వారి... ఆఫీస్ కు ఆహ్వానించాడు. ధర్మాధర్మాలను గురించి కొడుకు గోపాల్ సమక్షంలో వారితో చర్చించాడు. చివరిగా... “పాండూ చనిపోవడం మాకూ ఎంతో బాధగా వుంది. డాక్టర్ వేణుమాధవ్ గారి మాట ప్రకారం వాడికి గుండెలో యింతక ముందే సమస్య వున్నట్లు తెలిసింది. మాస్టర్ రామనాధంగారి మాట ప్రకారం... పాండుయే మొదట ఆదిని కొట్టాడన్నది నిజం. ఏది ఏమైనా... వీరగోవిందు తన కొడుకును కోల్పోయాడు. పోయిన వాడిని మనం తెచ్చియివ్వలేము. యధార్థానికి నా మనుమడి తప్పులేకపోయినా... తప్పును ఎదిరించిన కారణంగా యీనాడు వాణ్ణి అందరూ అసహ్యించుకొంటున్నారు. వాడూ... ఎప్పుడూ ఏడుస్తూనే వున్నాడు. తన వల్ల పాండు చనిపోయాడని బాధపడుతున్నాడు.వీర గోవిందు పేదవాడు. వాడికి నేను రెండు ఎకరాల భూమిని యివ్వదలచాను. యివిగో పత్రాలు, మీరు ముగ్గురూ మాకు వీరగోవిందుకు శ్రేయోభిలాషులు. యీ పత్రాలను వాడికి యివ్వండి. కోర్టుకేసు... అని, త్రాగి నా యింటికి వచ్చి ఆ పుల్లారావు వాగాడు. నేను సహనంతో అన్నీ విన్నాను. మీరు... గోవిందును కలసి... వివరంగా మాట్లాడి యీ పత్రాలు వాడికి యివ్వండి. ఆ రెండు ఎకరాల విలువ యిరవై లక్షలు. నేను మీకు చెప్పదలచుకొన్నది చెప్పాను. యిక మీరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి.” సవినయంగా చెప్పాడు భీమారావు. భీమారావు ఔదార్యాన్ని... నిర్ణయాన్ని ఆ ముగ్గురు మెచ్చుకొన్నారు. "మేము మీకు చెప్పేటంతటి వారముకాము” చేతులు జోడించారు. సబయిన్స్పెక్టర్ ఆ పత్రాలను చేతికి తీసుకొన్నాడు. ఆ ముగ్గురూ వీరగోవిందుయింటికి వెళ్ళారు.వారి మాటలను విని వీరగోవిందు ఒప్పుకొన్నా... త్రాగు బోతు పుల్లారావు నోరు విప్పి వాగసాగాడు. యిన్స్పెక్టర్... 'యింక ఒక్కమాట మాట్లాడితే... న్యూసెన్సు కేసు క్రింద అరస్టు చేసి, కటకటాల వెనక్కు త్రోసి ఎముకలు విరిచేస్తాను. జాగ్రర్త.' హెచ్చరించాడు. వారి మాటలకు భయపడి పుల్లారావు... పారిపోయాడు. వీరగోవిందు భూమి పత్రాలను తీసికొన్నాడు.ముగ్గురూ భీమారావుగారి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పారు. భీమారావు చేతులను జోడించి వారికి కృతజ్ఞతలను తెలియజేశాడు. వారు వెళ్ళిపోయారు.కుర్చీలో కూర్చొని... మనుమడిని గురించి... అతని భవిష్యత్తును... ఎలా తీర్చిదిద్దాలా అనే విషయాన్ని గురించి ఆలోచించసాగాడు భీమారావు. చివరకు... ఒక నిర్ణయానికి వచ్చాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/MAb_fMomMTo
Embed this episode
NOW PLAYING
మమతల మధువు ఎపిసోడ్ 8 | Mamathala Madhuvu Episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.