EPISODE · May 20, 2023 · 16 MIN
నాకేమవుతోంది ఎపిసోడ్ 22 | Nakemavuthondi Episode 22 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 22(చివరి భాగం) రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మరో అరగంటకి ప్రియ నిద్రలేచి హాల్లోకి వచ్చింది. "నువ్వు బ్రష్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి రా ప్రియా! ఈలోగా నేను వాచ్మెన్ ని పంపి అందరికీ కాఫీలు తెప్పిస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. తర్వాత వాచ్మెన్ ని పిలిచి ఫ్లాస్క్ నిండా కాఫీ తెమ్మని డబ్బులు ఇచ్చి పంపాడు. అంతలో ఏదో సందేహం వచ్చి వెళ్తున్న అతన్ని పిలిచి, "నిన్న మీ అయ్యగారు నీకు ఫోన్ చేసి మేము వచ్చిన విషయం అడిగారా? ఏమని అడిగారు.." అని ప్రశ్నించాడు. వాచ్మెన్ మాట్లాడుతూ "ఢిల్లీ నుంచి వచ్చినవాళ్ళని అయ్యగారి కారు డ్రైవర్ ఇక్కడ దింపి వెళ్ళాడు. అయ్యగారు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని, మీతో పాటు వచ్చిన వాళ్ళని ఆపవద్దని చెప్పాడు. ఇంకెవరు వచ్చినా గెస్ట్ హౌస్ లోకి రానివ్వ వద్దని చెప్పాడు. నిన్న నేనే ఒకసారి అయ్యగారికి ఫోన్ చేశాను. తీయలేదు.తర్వాత ఆయన పిఏ సెల్ నుండి ఫోన్ చేసి, ఏదైనా అవసరం ఉంటే ఆ నెంబర్ కి చెయ్యమన్నాడు. ఆ పిఎ నాకు మామ వరసవుతాడు. నాకు ఇక్కడ పని ఇప్పించింది కూడా ఆయనే. అయన రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదని మా అత్త నాకు ఫోన్ చేసి చెప్పింది" చెప్పడం ఆపి ఒకసారి అటూ ఇటూ చూసి "ఈ దుర్మార్గుడు మా మామను ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది" అన్నాడు. "ఏమీ కాదులే, ధైర్యంగా ఉండు. ముందు కాఫీ తీసుకొని రా. నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు శ్రీనివాస్. "అలాగేనయ్యా" అంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు అతను. ఆ వాచ్మెన్ పేరు రంగయ్య. గతంలో అతని భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ భార్య డాక్టర్ శ్రీదేవి ఆమెకు ట్రీట్ చేసింది. ఆ పరిచయంతోనే శ్రీనివాస్ తో తన అనుమానం చెప్పాడు రంగయ్య. అతను కాఫీ తేవడానికి వెళ్ళగానే లోపలికి వచ్చిన శ్రీనివాస్, అందరితో అతను చెప్పిన విషయం చెప్పాడు. "ప్రియ కల నిజం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. నా అంచనా ప్రకారం ఆమె కలలో కనకారావును చంపింది అతని పి ఏ ఏకాంబరం". చెప్పాడు ఉదయ్. అప్పుడే అక్కడికి రిఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రియకు తన లాప్టాప్ లో కనకారావు, ఏకాంబరం ఉన్న వీడియో చూపించాడు శ్రీనివాస్.. చూస్తున్న ప్రియా కళ్ళు పెద్దవయ్యాయి.హత్య కావింపబడింది కనకారావు అనీ, హత్య చేసింది అతని పిఏ ఏకాంబరం అనీ తేల్చి చెప్పింది ప్రియ. "ఇది ఎలా సాధ్యం? తన పీయేని కనకారావు బంధించి ఉన్నాడు కదా!" అంది డాక్టర్ శ్రీదేవి. "వాచ్మెన్ రంగయ్య కు కనకారావు, తన పిఏ ఏకాంబరాన్ని తన ఇంటి కాంపౌండ్ లో ఉన్న ఒక సర్వెంట్ క్వార్టర్ లో బంధించి ఉన్న విషయం చెబుదాము. కల నిజం కావాలంటే అతను ఏకాంబరాన్ని విడిపిస్తాడు" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఉదయ్ మాట్లాడుతూ "ఐడియా బాగానే ఉంది. కానీ ఏకాంబరాన్ని విడిపించడం పరోక్షంగా కనకారావు హత్యకు సహకరించినట్లే కదా.. విషయం తెలిస్తే మా బాబాయ్ ఏసిపి ప్రతాప్ గారు కానీ డిటెక్టివ్ పురంధర్ గారు కానీ మనల్ని తప్పు పడతారేమో" అన్నాడు. ప్రవల్లిక మాట్లాడుతూ "ప్రియా కల నిజమవుతుందని నిరూపించే ఏ ఆధారాలు మన దగ్గర లేవు. ప్రస్తుతానికి అది కేవలం ఊహ మాత్రమే. ఏకాంబరాన్ని కనకారావు బంధించి ఉన్నాడనేది వాస్తవం. ఆ మాట అతనే డాక్టర్ శ్రీనివాస్ గారితో చెప్పాడు. అతనికి కచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి మన ఊహ ప్రకారం కనకారావు హత్య చేయబడతాడు అనుకోవడం కంటే ఏ ఏకాంబరం బంధించబడ్డ సంగతి రంగయ్యకు చెప్పడం మంచిపని. తరువాత జరగబోయే పరిణామాలకు మన బాధ్యత లేదు. పైగా కనకారావు లాంటి దుర్మార్గుడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకు ఏ హాని చెయ్యకపోయినా ప్రియాను చంపాలని చూస్తున్నాడు అతను" అని చెప్పింది. "మీరు చెప్పింది కరెక్టే" అన్నాడు ఉదయ్. అక్కడ ఉన్న అందరూ కూడా ప్రవల్లిక మాటలకు ఆమోదం తెలిపారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/sr8yvLkrqcg
Embed this episode
NOW PLAYING
నాకేమవుతోంది ఎపిసోడ్ 22 | Nakemavuthondi Episode 22 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.