EPISODE · Nov 13, 2022 · 9 MIN
నేనూ సదూకున్న | Nenu sadukunna | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేనూ సదూకున్న రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆనకాలం మండుతున్న ఎండతో పొద్దంతా ఎగసిపడ్డ సూరీడు, తన కోపం చల్లారనట్టు ఎర్రని రంగుతో మెల్లగా గుట్టల సాటుకు పాకుతూ, గుంకుతుండు. కొద్దికొద్దిగా ఎలుగున్నా, నల్లని నీడతో నాలుగు దిక్కులనుంచి చీకటి అలుముకుంది. ఆనకాలం మెరిసి మెరిసి కొట్టే ఎండతో చెమటకు పెయ్యంత తడిసి పొద్దుగూకే యేళ కు సల్లవడుతుంది. మేకలన్ని మందకు జేరుకుని అరుస్తూ, అంగడంగడి జేస్తున్నయి. తల్లులకోసం తల్లడిల్లుతున్న పిల్లలను మేకలకు గుడుపుతూ సతమతమైతున్న. గప్పుడే సూరీడు గుంకిన దిక్కు నుంచి మా మామ నెత్తిమీద సంచి మూటతో బస్సు దిగి మందదిక్కు వస్తుండు. మామ నెత్తి మీద మూట సూడంగనే నాకు మస్తు ఖుషీ ఆకాశమంటింది. మామంటే భయం. వాళ్ళ తానే మూడేండ్ల సంది మేకలు మేపుతున్న. పరుగెత్తి అటకాయించ లేను. కాని పాణం నిల్వక జర ముందుకెళ్ళి " ఇప్పుడే వస్తున్నవ మామ, ఇంటికాడంత మంచిగుండ్రా" అని అడిగిన. " ఆ అందరు మంచిగుండ్రు" అని చెప్పుకుంట, గుడిసెల దిక్కువోయిండు. అక్కడున్నోళ్ళేమో ఆళ్ళఆళ్ళ ఇంటికాడ ముచ్చట్లు మాట్లాడతండ్రు. ఎండకాలమే అప్పుజేసి ఇరవై మేకలు కొన్నం. మా కాడ ముప్పై మేకలుండే. అన్నిటిని కొట్టుకుని మేపెటందుకు మా మెదకు ఇడిసి నర్సాపూర్ అడవులకు అచ్చినం. ఆ ఆనలకు తడిసి గుట్టలెక్కి మేసే మేకలకు ' అడవులపొంటి తిరిగే అల్వాటు లేదు. పన్నెండు మేకలు సచ్చిపోయినై. ఆ బుగులుతోనే నేను ఓ మూల కూసున్న. అప్పుడు మా మామ నన్న పిలిసి ' నీ తమ్ముడు యాదిగాడు ఏదో కాయితం ఇచ్చిండు. గా సంచిలుంది సూసుకో" అన్నడు. అప్పటికే చీకటైపాయే. కాయితం తీసి సదువరాదు. మంట ఎల్గుకు సూద్దామని నాలుగు కట్టెలు ఒక్క దగ్గరేసి మంటవెట్టిన. "పొద్దుగాల్ల సూతువులే శీకట్లేం కనిపిస్తది" అని మామ గరమయిండు. మూటను తీస్కపోయి ఓ మూలకు నెట్టిన. సినుకులు పడ్తుండగనే ఇన్ని బియ్యం ఉడ్కవెట్టుకుని తొక్కేస్కోని, తలో బుక్క డు దిని మంటసుట్టు అందరం పన్నం. వారం రోజుల నుంచి ఇడువని వాన. ఎండ సక్కగా లేక గొంగడి ముక్క వాసన వట్టింది. ఆ గొంగడి కప్పుకొని, దానిమీదనుంచి ప్లాస్టిక్ కాయితమేస్కోని, కింద ఓ అరుస రాళ్ళు, ఆటి మీద టేకు ఆకులు ఏసుకొని పండుకున్నం. మక్కవాసనైతే అలవాటైంది గాని సినుకుల సప్పుడు సిటపట ఇన్పిస్తుంది. కిందేసుకున్న రాళ్ళు పక్క బొక్కలను ఒత్తుతున్నై. నా కేమో నిద్రస్త లేదు. ఆ మూటలున్న పేపర్ మీదనే. అందులో పదో తరగతి పాసైనోళ్ళ నంబర్లున్నై. వాటిలో నా నంబర్ సూసుకుందామని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_GwOqA19occ
What this episode covers

NOW PLAYING
నేనూ సదూకున్న | Nenu sadukunna | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.