EPISODE · Jan 4, 2023 · 26 MIN
నేనూ వాట్సాప్ కోడీ కుంపటీ | Nenu Whatsapp Kodi Kumpati | Telugu short Story | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేనూ వాట్సాప్ కోడీ కుంపటీ రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పిన కథ: వెనకటికో ఊళ్లో ఓ ముసలమ్మ. ఆమెకో కోడి. అది తెల్లారు ఝామునే కూస్తే, ముసలమ్మ లేచి కుంపటంటించేది. ఊరి జనం కోడికూత విని తెల్లారిందని నిద్ర లేచేవారు. ముసలమ్మ దగ్గర నిప్పు తీసుకెళ్లి ఇళ్లల్లో పొయ్యి రాజేసుకునేవాళ్లు. కానీ ఎన్నేళ్లు గడిచినా ఊళ్లోవాళ్లు తన ప్రాముఖ్యాన్ని గుర్తించలేదని ముసలమ్మకి కోపమొచ్చి- ఓ రోజు కోడీ కుంపటితో సహా ఊరికి దూరంగా వెళ్లి ఓ చోట కూర్చుంది. కాసేపటికి ఆ ఊర్నించి ఎవరో వస్తుంటే, “నా కోడీ కుంపటీ ఇక్కడుండిపోయాయి. మరి ఆ ఊళ్లో తెల్లారిందా” అనడిగిందిట. “భలేదానివే- నీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?” అని నవ్వేట్ట అతడు. ఆ మాటే సామెతగా మారింది. ఈ కథలో ముసలమ్మని నేనైతే, నా కోడీ కుంపటి విషయంలో నేను గ్రహించిన కొత్త కోణమొకటి ఉంది. అందుకు నా కథని రెండు భాగాలుగా చెప్పాలి. ఒకటి రిటైర్మెంటుకి ముందు, రెండు రిటైర్మెంటు తర్వాత. రిటైర్మెంటుకి ముందు నేనో గవర్నమెంటు డిపార్టుమెంట్లో పెద్ద ఆఫీసర్ని. పదిహేనేళ్లలో రిటైరౌతాననగా పెద్ద ప్రమోషనొచ్చింది. బ్యాంకులు, ఫైనాన్సు కంపెనీలు, పరిశ్రమలు- వీటి ఆర్థిక లావాదేవీలు తనిఖీ చెయ్యడం నా డ్యూటీ. ఆ పొజిషన్లో నాకు ముందున్న ఆఫీసరు విలాసరావు భారీగా లంచాలు పట్టి సస్పెండయాడు. ఆ వెంటనే అమెరికాలో కొడుకు దగ్గరకెళ్లి విలాసంగా విశ్రాంతజీవితాన్ని ఆస్వాదిస్తూ, తనకొచ్చిన చెడ్డపేరుని పట్టించుకోలేదు. నేను చార్జి తీసుకోగానే సమాజంలో పెద్దోళ్లు చాలామంది నన్ను కలుసుకున్నారు. అందరిదీ ఒకే మాట! “విలాసరావు చెప్పాచెయ్యకుండా ఆకస్మిక తనిఖీలు చేసేవాడు. దాంతో అయోమయంలో పడ్డ మమ్మల్ని రక్షించడానికి ‘ఖరుసవుద్ది’ అనేవాడు. మేము ఖరుసు భరించేవాళ్లం. అందువల్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా, ఆయన జనానాకు చేరేది” అని ముందు నేపథ్యం చెప్పారు. “మీరు నిజాయితీపరులని విన్నాం. మీరు స్ట్రిక్టుగా ఉంటే మేమూ నిజాయితీగా ఉంటాం” అని నా’పథ్యం’ చెప్పారు. (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zMvjZ4_NHQQ
What this episode covers

NOW PLAYING
నేనూ వాట్సాప్ కోడీ కుంపటీ | Nenu Whatsapp Kodi Kumpati | Telugu short Story | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.