పెన్షన్ | Pension | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 30, 2023 · 14 MIN

పెన్షన్ | Pension | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pension' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'పెన్షన్' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పెన్షన్ మీద ఆధారపడే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. సుజాతమ్మ, రాఘవయ్య, రాములమ్మ అనే ముగ్గురు వ్యక్తులు పెన్షన్ మీద ఆధార పడే వ్యక్తులు. ముగ్గురి స్థితిగతులూ వేరు. కానీ ముగ్గురూ ప్రతి నెలా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముగ్గురివీ వేరు వేరు సమస్యలు. ఆ సమస్యలని కళ్ళకు కట్టినట్లు ఈ కథలో చూపారు రచయిత MRV సత్యనారాయణ మూర్తి గారు. ఇక కథ ప్రారంభిద్దాం. ముందుగా సుజాతమ్మ కథ.. “ఎక్కడికండీ సుజాతమ్మ గారూ, పొద్దున్నే బయల్దేరారు? ” అడిగింది సింహాచలం. చిన్నగా నవ్వి “పాల పేకేట్టుకి” అంది సుజాతమ్మ. “మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళని తెమ్మంటే తేరా? మీరు బయల్దేరారు” ఆరా తీసింది సింహాచలం. “అస్తమానూ ఇంట్లో వుంటే ఏం తోస్తుంది. అందుకని.. ” నడుస్తూనే చెప్పింది సుజాతమ్మ. కిరాణా షాప్ పక్కవీధిలోనే. సుజాతమ్మ ఇంటికి పెద్ద దూరం కాదు. సింహాచలం నాలుగు అడుగులు వేసి తెలుగు మాస్టారు ఇంట్లోకి వెళ్ళింది పనిచేయడానికి. ఐదు నిముషాలలో కిరాణా కొట్టు దగ్గరకు వచ్చింది సుజాతమ్మ. పాల పేకెట్టు, రెండు బట్టల సబ్బులు తీసుకుని వెనుతిరిగింది. సుజాతమ్మ ఇంట్లో అద్దెకుండే వెంకట్రామయ్య చాలా మంచి వ్యక్తి. ఎవరికీ ఎ సాయం కావాలన్నా చేస్తాడు. ఒకటి రెండు సార్లు అడిగాడు ‘నేను పాల ప్యాకెట్లు, కిరాణా సరకులు తెచ్చిపెడతానని’. సుజాతమ్మే ‘వద్దు బాబూ.. నేను తెచ్చుకుంటాను. ఇంట్లో ఎం తోచదు కదా’ అని సున్నితంగా చెప్పింది. కానీ అసలు విషయం ఏమిటంటే ‘నువ్వు ఇంట్లోనే కూర్చుంటే కాళ్ళు, చేతులు పట్టేస్తాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి. సరకులు అన్నీ నువ్వే తెచ్చుకో. దాని వలన నీకు సరుకుల ధరలు కూడా తెలుస్తాయి’ అని కూతురు పల్లవి హితబోధ చేసింది. అందుకని అరవై ఎనిమిదేళ్ళ వయసులో సరకుల కోసం బయటకు వెళ్తోంది సుజాతమ్మ. సుజాతమ్మ భర్త కృష్ణమూర్తి కాలేజీ లో లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగంలో ఉండగానే కాలనీ లో మేడ కట్టుకున్నాడు. కూతురికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళి చేసాడు. కొడుకు ఎం. కాం. చదివినా ఉద్యోగం రాక బలాదూర్ గా తిరుగుతున్నాడు. తండ్రి గారాబమే అతన్ని పాడు చేసింది. లక్షా ఏభై వేల జీతంలో రిటైర్ అయ్యాడు కృష్ణమూర్తి. ‘మనకి బోల్డు డబ్బుంది. నువ్వు బెంగ పెట్టుకోకు, ఉద్యోగం రాలేదని. హ్యాపీ గా ఉండు’ అని కొడుక్కి చెప్పి అతను ఎంత అడిగితె అంత డబ్బు ఇచ్చేవాడు. చెడు అలవాట్లు మరిగి ఒకరోజు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్య్యాడు కృష్ణమూర్తి కొడుకు. ఆ షాక్ కి కృష్ణమూర్తి కి పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పడిపోయాయి. సుజాతమ్మ భర్తకి సేవలు చేయడంతోనే సరిపోతోంది. ఒక రోజు కృష్ణమూర్తి కొడుకు స్నేహితులతో మోటార్ సైకిల్ మీద తణుకు రెండవ ఆట సినిమాకు వెళ్లి తిరిగి వస్తూ, ఆగి ఉన్న లారీ ని గుద్దేసి స్పాట్ లోనే చనిపోయాడు. అప్పటికే అతను బాగా తాగి ఉన్నాడు. కొడుకు దుర్మరణం కృష్ణమూర్తి ని బాగా కృంగ దీసింది. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణమూర్తి చనిపోయాడు. సుజతమ్మని కూతురు హైదరాబాద్ తీసుకెళ్ళదు. రెండు నెలలకో, మూడు నెలలకో ఒకసారి శివాపురం వచ్చి తల్లిని చూసి వెళ్తుంది. పెన్షన్ డబ్బులు, ఎక్కువగా ఖర్చు పెట్టవద్దని, పొదుపుగా ఉండమని తల్లికి నూరిపోస్తుంది. ప్రస్తుతం సుజాతమ్మకి భర్త పెన్షన్ ఎభైవేలు వస్తోంది. ఇంటి అద్దె ఆరువేలు వస్తోంది. ‘నువ్వు పదహారు వేలకంటే ఎక్కువ ఖర్చు పెట్టకు. ప్రతి నెలా, నలభై వేలు బ్యాంకు లో ఉంచు. మా అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడుతుంది’అని తల్లికి గట్టిగా చెప్పింది పల్లవి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/t0-5Dj4deTM

Episode metadata supplied by the publisher feed · Published May 30, 2023

Embed this episode

NOW PLAYING

పెన్షన్ | Pension | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

0:00 14:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 30, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!