EPISODE · Apr 3, 2023 · 11 MIN
పంచాంగ శ్రవణం | Panchanga Sravanam | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంచాంగ శ్రవణం రచన : జీడిగుంట శ్రీనివాసరావు(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)కాఫీ తాగుతో ఫోన్లో యూట్యూబ్ చూస్తున్న భర్త రవీందర్ తో “అలా ఉదయమే ఆ రాజకీయనాయకుల తిట్టుకోవడాలు చూడకపోతే, ఈ రోజు ఉగాది కదా.. టీవిలో పంచాంగశ్రవణం వస్తుంది. విని మీ రాశి కి, నా రాశి కి, పిల్లల రాశి కి ఈ ఏడాది ఎలా వుందో చూడండి” అంది రమణి పూజ చేసుకుంటో.పండగపూట ఎందుకొచ్చిన గొడవ అని, ఫోన్ పక్కన పడేసి టీవీ పెట్టాడు రవీందర్. ఏ ఛానల్ చూసినా పంచాంగశ్రవణం తో హడావిడి చేస్తున్నారు. భార్య వినమంది కదా అని ఒక ఛానల్ లో ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో జరుగుతున్న పంచాంగశ్రవణం పెట్టాడు.“అయ్యో రాత, అన్ని రాశులు గురించి చెప్పే పంచాంగశ్రవణం వినమంటే ఆ రాజకీయనాయకుడి జాతకం వింటున్నారేమిటండి, ఏమైనా అరిస్తే అసలే ఉగాది, సంవత్సరం అంతా అరవాలి, అంత ఓపిక లేదు నాకు. ఆర్డమైందా మీకు..” అంటూ పూజ గదిలో నుంచి అరుపులకి టీవీ ఛానల్ అదంతటికి అదే భక్తి టీవీ లోకి మారిపోయింది.నుదుట పెద్ద కుంకం బొట్టు, మెడ నిండా రుద్రాక్షలు, భారీ ఆకారం పంచాంగశ్రవణం చేస్తున్నారు. ఆయనని చూడగానే రవీందర్ కి భక్తిభావం కలిగింది.ఒక్కొక్క రాశి గురించి చెప్పటం మొదలుపెట్టారు శాస్త్రిగారు. భర్త రాశి చెప్పటానికి ముందే పూజ ముగించి, వచ్చి కూర్చుంది రమణి.“యిప్పుడు తులా రాశి వారి జాతకం” అన్నారు శాస్త్రి గారు గట్టిగా ఊపిరి తీసుకొని.“మీదే.. వినండి జాగ్రత్తగా. ఏ ఫోన్ వచ్చినా తీయద్దు” అంది రమణి.“తులారాశి లోని స్వాతి జాతకులకి ఈ సంవత్సరం అద్భుతంగా వుంటుంది, పట్టిందల్లా బంగారమే. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి” అన్నారు శాస్త్రి గారు.రవీందర్ ముసిముసి నవ్వులు నవ్వుతో “నాకు సంతానం కలుగుతుందిట” అన్నాడు. “బాగానే వుంది వరస, 70ఏళ్ళు పెట్టుకుని యింకా సంతానం అనగానే ఆ మురిసిపోవడం ఏమిటండి.. సిగ్గులేకుండా” అంది రమణి.“స్వాతి వారికి అన్నీ రోజులు బాగున్నాయి, అయితే ఆగష్టు లో జాగ్రత్తగా వుండాలి. పెద్ద ప్రమాదం పొంచి వుంది. రాహువు కాటు వేయడానికి సిద్ధంగా వుంటాడు. డిసెంబర్ లో కొడుకుకి పెళ్లి చేస్తారు” అని చెప్పిన శాస్త్రి గారి మాటలు విని, “మన అబ్బాయి పెళ్లి అయ్యింది గా, బహుశా ఆయనని పెళ్ళికి పిలవకపోవడం వలన తెలిసి వుండదు” అన్నాడు, మనసులో రాబోయే ఆగస్టు సంక్షోభమ్ గురించి ఆలోచిస్తో.“యిప్పుడు మకరరాశి వారికి.. ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కలిసివస్తుంది. వివాహం జరుగుతుంది, ఉద్యోగం లో పెద్ద లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కోర్టు కేసులు గెలుస్తారు” అని సెలవిస్తున్న టీవికి సెలవిచ్చింది రమణి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/f_oxwRvE_gY
What this episode covers

NOW PLAYING
పంచాంగ శ్రవణం | Panchanga Sravanam | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.