EPISODE · Jun 19, 2023 · 18 MIN
పంతులమ్మల హోటేళ్ళు | Panthulammala Hotellu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంతులమ్మల హోటేళ్ళు రచన : M R V సత్యనారాయణ మూర్తి మా పెనుగొండలో కాఫీ హోటళ్లకు లోటులేదు. అడుగు అడుగుకి ఓ హోటల్ ఉంది. అయితే కొంచెం పేరున్న హోటళ్ళు కొన్నే. గోంగూర తూము సెంటర్లో ఉన్న నారాయణరావు హోటల్, మినర్వా టాకీసు దగ్గర ఉన్న ఆనందరావు హోటల్, గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న ఉడిపి అయ్యార్ హోటల్, జవ్వాదివారి మిల్లుకి వెళ్ళే దారిలో ఉన్న పాబోలు వారి హోటల్, లింగాలవీది చివర ఉన్న రామచంద్రం హోటల్, వంతెన దగ్గర ఉన్న జల్లూరి వారి హోటల్. వీటి అన్నింటినీ ’డీకొనే‘ హోటళ్ళు రెండు ఉన్నాయి. అవే ‘పంతులమ్మల హోటళ్లు’. ఒకటి మినర్వా టాకీసు రోడ్డు లో ఉన్న పంతులమ్మ హోటల్. టిఫిన్లు చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా ఉంటాయి. ఇడ్లీ లోకి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి ఉంటాయి.స్పెషల్ ఇడ్లీ అంటే, వీటితోపాటు నెయ్యీ, కారప్పొడి ఉంటాయి. రేటు కొంచెం ఎక్కువ. బజారులోని వర్తకులు పంతులమ్మ గారి హోటల్ కి వచ్చి స్పెషల్ ఇడ్లీ ఖచ్చితంగా తిని వెళ్తారు. పంతులమ్మగారు సన్నగా, పొడవుగా ఉంటారు. అందరూ ’మామ్మగారూ’ అని పిలుస్తారు. ప్రతివారినీ ఆప్యాయంగా పలకరిస్తారు. “ఏరా, వెంకట్రాముడూ, అమ్మాయి పెళ్లి చేసావుట, ఏ ఊరు ఇచ్చావు?అబ్బాయి ఏం చేస్తాడు?” ఇడ్లీ లోకి మరోసారి అల్లం పచ్చడి వేస్తూ నవ్వుతూ అడిగిన మామ్మగారిని చూడగానే, సిగ్గుపడ్డాడు వెంకట్రాముడు, మామ్మగారిని పెళ్ళికి పిలవలేదన్న విషయం గుర్తుకు వచ్చి. తర్వాత తేరుకుని “ఇరగవరం ఇచ్చానండి, గంగాధరం నాయుడు గారి అబ్బాయికి. ఒక్కడే కొడుకండి. పదెకరాల పొలం, ఎకరం కొబ్బరి తోటా ఉన్నాయండి. అంతా హడావిడి అయిపోయిందండి” అన్నాడు తనూ చిన్నగా నవ్వుతూ. అందుకే మిమ్మల్ని పిలవలేక పోయానన్న భావం వ్యక్తం చేసాడు వెంకట్రాముడు. “చాలా బాగుందిరా అబ్బాయి. చాలా దగ్గరే ఇచ్చావన్న మాట. పిల్లని ఎప్పుడు చూడాలంటే అప్పడు పావుగంటలో సైకిల్ మీద వెళ్లి చూసి రావచ్చు. ఈసారి అమ్మాయి దగ్గరకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు. రెండు కొబ్బరికాయలు ఇస్తాను. ఇరగవరం పాలేశ్వర స్వామి గుడిలో కొట్టి వద్దువుగాని” అన్నారు మామ్మగారు. “అలాగేనండి. వెళ్ళేటప్పుడు మీకు కనిపించి వెళ్తాను” అన్నాడు వెంకట్రాముడు. “ఏరా సూరిపండూ, మీ రెండో అమ్మాయికి పురుడు వచ్చిందటగా, మనవడా? మనవరాలా?” పెసరట్టు, ఉప్మా టేబుల్ మీద పెట్టి అడిగారు మామ్మగారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7yUq8jlD2Kg
What this episode covers

NOW PLAYING
పంతులమ్మల హోటేళ్ళు | Panthulammala Hotellu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m