EPISODE · Feb 19, 2023 · 5 MIN
పరోపకారం ఇదం శరీరం | Paropakaram Idam Sariram | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరోపకారం ఇదం శరీరం రచన: Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒక ఊరిలో ఒక బిచ్చగాడు నివసిస్తుండేవాడు. పొద్దస్తమానం ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ, దేవాలయాల దగ్గర నిలబడి బిచ్చమెత్తుకుంటూ పొట్ట పోషించుకుంటుండేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని దానిని అక్కడ ఖర్చు పెట్టేసుకొని, సాయంత్రాలు రిక్త హస్తాలతో ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. వాడి భార్యకు బిచ్చగాడితో పడక, తాను జీవిస్తున్న ఈ జీవితం నచ్చక పిల్లల్ని తీసుకొని చాలా కాలం కిందనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏకాకి అయిన వాడు ఊరి చివర వున్న ఒక ఖాళీ స్థలంలో వేసుకున్న పూరిపాకలో ఏక్ నిరంజన్ లా నివసించసాగాడు. రాను రాను భిక్షాటన భరించరానిదిగా వాడికి తయారయ్యింది. తాను ఏ జన్మలో ఏ పాపం చేసాడో, ఈ జన్మలో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తొంది. ఉదయం లేచింది మొదలు ఇష్టంగా దానం చేసే వాళ్ళు బహు తక్కువ. అధిక శాతం తిట్టుకుంటూ, చీదరించుకుంటూ, శాపనార్థాలు పెడుతూ బిచ్చం వేస్తుంటారు. ఎప్పటికి ఈ జన్మ మారుతుందా అని అనుకుంటూ వుంటాడు. ఒకసారి ఆ ఊరి రామాలయంలో ఒక తపసంపన్నుదైన సాధువు వచ్చారని, ప్రజల సమస్యలకు తన తప శక్తితో సూచనలు ఇవ్వడం లేదా వాటిని సత్వరమే పరిష్కరించడం చేస్తున్నారని విన్నాడు. ఆ సాధువు వేంచేసిన రామాలయానికి ఒక రోజు ఆ బిచ్చగాడు వెళ్ళాడు. ఎందరో ప్రజలు నిరాశ నిస్పృహలతో, దుఖంతో, కోపంతో, ఆవేశంతో ఆ సాధువుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆ సాధువు ఏం మంత్రం వేస్తున్నారోగాని, వారందరూ తమ సమస్యలను మర్చిపోయి, ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్లడం ఆ బిచ్చగాడు కళ్ళారా చూశాడు. ఆ సాధువు ప్రజలకు ఏ మాయ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కొండంత దుఖంతో వెళుతున్నవారు అంతే ఆనందంగా తిరిగి వస్తున్నారు.వాళ్ల చేతిలో డబ్బు లేక బంగారం లేక వెండి లేదా ఇతర విలువైన వస్తువులు లేవు. కాని ఆనందంగా ఎలా తిరిగీ రాగలుగుతున్నారు ? ఇవన్నీ ఆలోచించి, బిచ్చగాడు కూడా సాధువు వద్దకు వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడాలని అనుకున్నాడు. తన లాంటి దుఃఖ: పీడితులైన వ్యక్తులకు కూడా ఆ సాధువు నుండి ఉపశమనం లభిస్తుందా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. సాధువు ని కలవడానికి నడిచాడు. సాధువు ఉన్న చోట చాలా పొడవైన వరుస ఉంది, కాబట్టి బిచ్చగాడు కూడా వరుసలో వచ్చాడు. తన వంతు కోసం వరుస లో నిరీక్షించడం మొదలుపెట్టాడు. అతని వంతు వచ్చి సాధువు దగ్గరికి చేరుకున్నాడు. అతను సాధువు తో ఇలా అన్నాడు, “మహాశయా, నేను చాలా పేదవాడిని నాదనుకునే ఒక్క వస్తువు నా దగ్గర ఒక్కటి కూడా లేదు.. నా జీవితాన్ని నడపడానికి కూడా నేను ఇతరులను అడ్డుకోవాలి, ఫలితంగా వారి నుండి ఎన్నో చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తొంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నా జీవితాన్ని ఎలా మెరుగ్గా జీవించగలను ?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4d8st8RZOKQ
What this episode covers

NOW PLAYING
పరోపకారం ఇదం శరీరం | Paropakaram Idam Sariram | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m