పశ్చాత్తాపం | Paschatthapam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 15, 2022 · 9 MIN

పశ్చాత్తాపం | Paschatthapam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పశ్చాత్తాపం రచన: నీరజ హరి ప్రభల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హాస్పిటల్ లో వార్డులోని పేషెంట్లను చూసి తన గదిలోకి వచ్చి, కాస్త విశ్రాంతి గా కూర్చున్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీకర్. రాత్రి ఒక పేషెంట్ కు అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఇంటికెళ్లి సరిగ్గా నిద్ర పోకపోయినా, మరలా తన రోజు వారీ డ్యూటీగా హాస్పిటల్ కు వచ్చాడు శ్రీకర్. అలసటగా ఉంటే కుర్చీలో కాస్త వెనక్కి వాలి కనులు మూసుకోగానే తన సెల్ ఫోను రింగయింది. ఉలిక్కిపడి 'ఎవరా' అని ఫోన్ చూస్తే ‘శోభ’ అనే పేరు కన్పించి లిఫ్టు చేశాడు శ్రీకర్. " హలో! బావా! " అన్న పిలుపు వినగానే సంతోషంగా " హలో! శోభా! ఎలా ఉన్నావు?" అని పలకరించాడు శ్రీకర్. శోభ తను బాగానే ఉన్నానని, తను ఆ ఊరికి రెండు నెలల మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వస్తున్నట్లు, ఎక్కడైనా వాళ్లకు దగ్గరగా ఒక గదిని చూడమని చెప్పింది. "రెండు నెలలకోసం వేరే గది ఎందుకు? మా ఇంట్లోనే ఉండు. నీకు తోడుగా అమ్మ, సుధ కూడా ఉంటారు." అని చెప్పిన శ్రీకర్ మాటలకు "వద్దు బావా! అలాగ బావుండదు " అని చెప్పింది శోభ. "నీవేమన్నా పరాయిదానివా? మా ఇంట్లోనే ఉండు." అన్న శ్రీకర్ మాటలకు "సరే" అని తను ఆ ఊరికి వచ్చే తేదీని చెప్పి ఫోన్ పెట్టింది శోభ. ఒక్కసారిగా శ్రీకర్ ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. శోభ తన మేనత్త కూతురు. తమ ఊరు, మేనత్త ఊరు దగ్గర దగ్గర ఊళ్లు అవటంతో చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు శోభా, తను. ఎదిగేకొద్దీ చుట్టుపక్కల వాళ్లు, బంధువులు చాలా మంది వాళ్లిద్దరూ కాబోయే భార్యాభర్తలనుకునేవారు. వ్యవసాయదారులైన రామయ్య, తులశమ్మ దంపతులకు శ్రీకర్ ఏకైక కొడుకు. చిన్నతనం నుంచి కష్టపడి చదివే శ్రీకర్ తను డాక్టరు అవ్వాలని ఎన్నోకలలు కనేవాడు. అందుకోసం ఎంతో కష్టపడి చదువుతూ టెంత్ క్లాసు మంచిమార్కులతో పాసయ్యాడు. అతని ఇష్టాన్ని గ్రహించిన రామయ్య వాళ్లు అతన్ని పట్నంలో మంచి కాలేజీలో చేర్పించి, అక్కడే హాస్టల్ లో ఉండేట్లు ఏర్పాటు చేశారు. శ్రీకర్ కష్టపడి చదువుతూ ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్ లో చేరాడు. అతను మెడిసిన్ 3వ సం… చదువుతూండగా రామయ్య కార్డియాక్ అరెస్టుతో అకాలమరణం చెందాడు. జరిగిన దారుణానికి తులశమ్మ, శ్రీకర్ లు చాలా బాధపడి మిగిలిన తంతు పూర్తి చేశారు. ప్రక్క ఊరిలోనే ఉండే మేనత్త శకుంతల కుటుంబం కూడా బాధపడి శ్రీక‌ర్ వాళ్లను ఓదార్చారు. తర్వాత కొన్నాళ్లకు శ్రీకర్ తన తల్లిని ఒంటరిగా ఉంచలేక తనతో తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత 2 సం..కి శ్రీకర్ మెడిసిన్ పూర్తిచేసి, M.D కూడా చేసి హాస్పిటల్ లో డాక్టర్ గా చేరి క్రమేణా మంచిపేరు తెచ్చుకున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yKrysbwu6GY

Episode metadata supplied by the publisher feed · Published Nov 15, 2022

Embed this episode

NOW PLAYING

పశ్చాత్తాపం | Paschatthapam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 9:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!