EPISODE · Oct 19, 2022 · 14 MIN
రెంటికీ చెడ్డా | Rentiki Cheddaa | Telugu short Story | Siriprasad | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రెంటికీ చెడ్డా రచన : శిరిప్రసాద్ వేగంగా వెళుతోంది రవి ప్రయాణిస్తున్న కారు. వెనక సీట్లో తలపట్టుకుని కూర్చున్న రవి తీవ్ర ఆలోచన లో వున్నాడు. అతని గుండె లో మంటలు భగ్గుమంటున్నాయి. దానికి విరుద్ధంగా కళ్ళనించి కన్నీరు కారుతోంది. రామాపురం ప్రయాణాన్ని విరమించుకుని తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పోతున్నాడు. 'నాన్నా రవీ!... యేమైందిరా ? అంత త్వరగా అంత మంచి పొజిషన్ లోకి వెళ్ళి, ఆ తప్పు చేశావెందుకురా?... అంత మంచి జాబ్ కి రిజైన్ చేసావు!... ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?... ' తండ్రి ఆరా. 'ఈ రోజు మన వూళ్ళో మీటింగ్ వుంది అన్నావుగా!... అందుకే ముంబయి నించి వస్తున్నాను... అక్కడికి వచ్చాక అన్నీ విషయాలు చెప్తాను నాన్నా!' 'ఇంకెక్కడి మీటింగ్ రా!... క్యాన్సల్ చేసారు . ఏ బీ సీ కంపెనీ లో డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగావు. ఈ వూరి యువతకి స్ఫూర్తి కలిగించావు. నువ్విచ్చిన స్పూర్తితో ఐదుగురు యువకులు మంచి చదువులు చదువుకుని జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. ఇంకా ఎంతోమంది అదే ప్రేరణ తో చదువుకుంటున్నారు. ఊరి జనం అంతా నిన్ను సన్మానించుకోవాలన్నారు. నువ్వు నన్ను అడగకుండా బయల్దేరావేంట్రా?... నువ్వు షేర్ మార్కెట్ లో మోసం చేసి విచారణ ఎదుర్కుంటున్నావని, వుద్యోగానికి రాజీనామా చేసావని చెప్పుకుంటున్నారు. అందుకే నీ సన్మాన సభని క్యాన్సల్ చేసార్రా !... ఇప్పుడు యిక్కడికి రావడం మంచిది కాదురా. నేను, అమ్మా ముంబై కి వస్తున్నాం. ఎల్లుండికి రిజర్వేషన్ అయింది...' 'సరే... నాన్నా...' గద్గద స్వరంతో అన్నాడు రవి. ఇంకా అంతకు మించి మాట పెగల్లేదు. కష్టంగా, ఆన్నాడు 'మీరు ముంబై రండి... ఏం జరిగిందీ ..... అక్కడ చెప్తాను...' *** రామాపురం హైదరాబాద్ కి దగ్గిరలో వొక కుగ్రామం. అక్కడ సరైన స్కూల్, పీ హెచ్ సి, రక్షిత నీటి సరఫరా యిలాంటి కనీస సౌకర్యాలు యేవీ లేవు. శిధిలావస్థలో వున్న పంచాయితీ స్కూల్లోనే పిల్లలు చదువుకునే వారు. టీచర్లు సీనియర్స్ కావడం వల్ల చదువు మీద ఆసక్తి వున్నవాళ్లు బాగా చదువుకునే వాళ్ళు. రవి తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తన చిన్నతనంలో పట్నంలో తాత దగ్గిర వుండి పీ యూ సీ వరకు చదువుకున్నాడు. వర్షాధారిత వ్యవసాయం వల్ల వుపయోగం లేదని, తన పిల్లలు బాగా చదువుకుని మంచి వుద్యోగాలు చేసుకు బ్రతకాలని అనుకున్నాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/W9AvSdcq-WI
What this episode covers

NOW PLAYING
రెంటికీ చెడ్డా | Rentiki Cheddaa | Telugu short Story | Siriprasad | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m