EPISODE · Jun 30, 2023 · 7 MIN
Sanchika Pongindi - Episode 2 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 2/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు. ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు. అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు. ఇక సంచిక పొంగింది ధారావాహిక రెండవ భాగం చదవండి.. "ఎవరు మీరు." అడిగాడు ఒక పోలీసు. "ఫ్రెండ్స్ మి." చెప్పాడు శ్రీకర్. సంచిక అయోమయంలో ఉంది. "ఎక్కడ నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు." టకటకా అడిగేస్తున్నాడు మరో పోలీస్. శ్రీకర్ చెప్పాడు. "ఐతే హాల్ టికెట్స్ చూపండి." కటినంగా ఉంది పోలీసుల వ్యవహారం. సంచిక వాటిని చూపింది. "సరే. బాగుంది. పేరెంట్స్, ఎల్డర్స్ లేకుండా ఇలా ఇద్దరే రావడం ఏమిటి." అడిగాడు పోలీస్. "తప్పా. ఏం రాకూడదా." టక్కున ప్రశ్నించింది సంచిక. "మగ మగ పర్వాలేదు. ఆడ ఆడ కొంత వరకు పర్వాలేదు. ఇలా ఆడ మగ.." మాట్లాడుతున్న పోలీస్ కు అడ్డై.. "చాలు చాలు. తొక్కలోని స్టేట్మెంట్స్ ఆపండి." రోషంగా అంది సంచిక. "మాకు లేని అభ్యంతరం మీకు ఎందుకు." వెంబడే ప్రశ్నించాడు శ్రీకర్. "అయ్యో. మీ మంచికే చెప్పుతున్నాం. అనవసరమైన అపోహలకు తోవ వేయ వద్దు అన్నది మా భావన." చెప్పాడు పోలీస్. ఆ ఇద్దరూ మాట్లాడ లేదు. "లేని పోని తల నొప్పులు.. ఎందుకు." అన్నాడు మరో పోలీస్. "సరి సరే. టేక్కేర్. రేపు ఒక్క రోజే ఎగ్జామ్ గా. అది కాగానే.. మీ ఊరు పోండి. ఇలా స్టే కొనసాగించ వద్దు." చొరవగా చెప్పాడు ఒక పోలీస్. ఆ తర్వాత.. ఆ వచ్చిన పోలీసులు వెళ్లి పోయారు. శ్రీకర్ రూం డోర్ మూసేశాడు. "అబ్బ. చెత్త. డిస్ట్రబెన్స్. చదివే మూడ్ దొబ్బింది." చిరాకవుతుంది సంచిక. "కూల్ కూల్. చిక.. పడుకుందాం. ఎర్లీ అవర్స్ లో లేపుతాను. అప్పుడు చదువుదాం. ఐనా.. రివిజనేగ." అక్కడి పుస్తకాలు మూసి.. వాటిని తమ బేగ్ మీద పెట్టాడు శ్రీకర్. లైట్ ఆర్పి.. మంచం ఎక్కాడు. "గుడ్నైట్." చెప్పింది సంచిక. "వెరీ గుడ్నైట్." అనేశాడు శ్రీకర్. ఇద్దరూ ఆ డబుల్ కాట్ మీద నడుములు వాల్చారు. నిద్రకు ఉపక్రమించారు. మర్నాడు.. పరీక్ష రాసి ఇంటికి వచ్చిన సంచిక.. తన తండ్రి సీతారాంతో.. "మార్పు ఇంకా రావడం లేదు." అంది చిరాగ్గా. "ఏం ఐంది." అడిగాడు సీతారాం. "మగ ఆడ కలిసి ఒకే రూంలో ఉంటే అదో తప్పులా మాట్లాడేస్తే ఎలా." ఇంకా చిరాకులోనే ఉంది సంచిక. కూతురునే చూస్తున్నాడు సీతారాం. తమ టూర్ లోని ఆ పోలీస్ ల కబుర్లు ఆపడం లేదు సంచిక. ఆమెకు ఆడ్డై.. "మనలాగే ఎదుట వారు ఆలోచించాలని లేదు కదా." చెప్పాడు సీతారాం. "అది కాదు డాడీ.." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ykK_LBcCTN4
What this episode covers

NOW PLAYING
Sanchika Pongindi - Episode 2 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.