Sneham Sakshigaa |స్నేహం సాక్షిగా | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 16, 2022 · 9 MIN

Sneham Sakshigaa |స్నేహం సాక్షిగా | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్నేహం సాక్షిగా కొత్తపల్లి ఉదయబాబు దేశంలో కరోనా అనే ప్రాణాంతక మహమ్మారి వ్యాపిస్తోందని టీవీలలో ప్రచారం ప్రారంభమయిన మొదటి రోజులవి. హైదరాబాద్ లో ప్రయివేట్ కంపెనీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు. చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే హైద్రాబాద్ లో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని వచ్చి, మొదటివారం స్నేహితుని రూంలో ఉన్న కాలంలోనే అతని చురుకుదనానికి, సమయస్ఫూర్తికి ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం ఇచ్చేసింది. ఇద్దరు అక్కల తరువాత ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఉండలేక, అలా అని అతని భవిష్యత్తు పాడవుతుందని మిన్నకుండి పోయారు అతని తల్లి తండ్రులు. తల్లితండ్రులను చూద్దామని శనివారం ఉదయం బయల్దేరి ఆదివారం రాత్రికి మళ్లీ ఉద్యోగానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని వచ్చిన శశాంక ఆ ఆదివారం రాత్రినుంచే లాక్-డౌన్ ప్రకటించడంతో ఆగిపోయాడు. అప్పటికే కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో… అందుకు మనం పౌరునిగా పాటించవలసిన ధర్మాలేమిటో తెలుసుకున్నవాడుగా మరుసటి ఉదయమే రంగంలోకి దిగాడు. ఇంట్లో పనికిరాని పాతచీరలన్నీ తీసుకుని స్వయంగా జేబురుమాలు సైజులో కత్తిరించి తమ పేటలో ప్రతి వ్యక్తికి 3 మాస్కులు కనీసం ఇచ్చేలా కుట్టించాడు. తల్లి, తను వాడిన  డిష్-వాష్ సీసాలన్నీ ఒక బస్తాలోవేసి, బస్తా నిండాక అమ్ముతూ ఉంటుంది. వాటిని తీస్తే ఎనభైకి పైగా ఉన్నాయి. ఎదో టీవీలో చూసిన విధానం గుర్తుపెట్టుకొని డెట్టాల్ సబ్బులు కొని, వాటిని పెద్ద సీవండి దాబారా గిన్నెలో తురిమి, అందులో వెనిగర్ వేసి ఉడికించి, ఆ పేస్ట్ ను సీసాలన్నింటిలోను నింపాడు. తనవయసు కుర్రవాళ్ళని పదిమందిని పిలిచి ఏ4 సైజు పేపర్లు, కార్బన్లు కొని, వాటిమీద కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వ్రాయించి… ప్రతి కుటుంబానికీ  3 మాస్కులు, ఒక సీసా, ఒక కరపత్రం అందించాడు.పేట పేటంతా, సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వృత్తాలు గీయించాడు. తాను యూట్యూబ్ లో రకరకాల పచ్చళ్ళు చూసి, ఆ పదార్ధాలు కొనుక్కువచ్చి, తల్లిచేత దగ్గరుండి చేయించి, ఆ విధివిధానాలన్నీ మనసులో ముద్రించుకున్నాడు. తమపేటలోకి వచ్చిన అన్నార్తులకు ఆ పచ్చళ్ళు వేసి ఉన్నంతలో భోజన పొట్లాలు అందించాడు. "నాయనా..నీ ఉద్యోగం?" అడిగింది తల్లి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/6_s-e2mosvk

Episode metadata supplied by the publisher feed · Published Sep 16, 2022

Embed this episode

NOW PLAYING

Sneham Sakshigaa |స్నేహం సాక్షిగా | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com

0:00 9:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 16, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!