EPISODE · Feb 3, 2023 · 11 MIN
సన్యాసం | Sanyasam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సన్యాసం జీడిగుంట శ్రీనివాసరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) యాగంటి గారి ప్రవచనలకి వెళ్తానని బయలుదేరుతున్న భర్త సుబ్బారావు వంక ఆశ్చర్యంగా చూసి, “మీకు భక్తి ఎప్పటినుంచి వచ్చింది?” అంది రమణి. “నాకు ఎన్నో ఏళ్ళ నుంచి గరుడపురాణం లో ఏముంటుంది, అందులో చెప్పినవి జరుగుతాయా అని అనుమానం. యిప్పుడు యాగంటి గారు ఎన్టీఆర్ స్టేడియం లో గరుడపురాణం చెపుతున్నారు. యిదే ఛాన్స్.. అందులో రహస్యాలు తెలుసుకుని జాగ్రత్తగా వుండటానికి” అన్నాడు సుబ్బారావు. “నా పుణ్యం పుచ్చింది కాబోలో.. మీకు యింత మంచి బుద్ది పుట్టింది, జాగ్రత్తగా వెళ్లి రండి” అంది రమణి. రాత్రి పది అయినా భర్త యింటికి రాకపోవడం తో కంగారుగా బయటకు వచ్చి రోడ్డు వైపు చూస్తో నుంచుంది. కార్లు వెళుతున్నాయి, వస్తున్నాయి కానీ మా కారు జాడ కనిపించలేదు. ఫోన్ తీసుకొని వెళ్తే డిస్టర్బ్ చేస్తారు అని ఫోన్ యింట్లో వదిలేసారు. ఏం మనిషో ఏమిటో అనుకుంటూ కారు లోపలికి రావడానికి గేటు తీసి లోపలికి వచ్చింది. యింకో అరగంట తరువాత కారు హారన్ వినిపించడం తో తలుపు తీసి, “అమ్మయ్య, వచ్చారా? ఎందుకు యింత ఆలస్యం అయింది” అంది. కారులోనుంచి సంచి తీసి భార్య చేతికి యిచ్చి, “యిదిగో! రేపు ఉదయం మంచి టైం చూసి, సన్యాసం తీసుకుంటాను” అన్నాడు సుబ్బారావు. “సన్యాసం తీసుకునే వాళ్ళు ఈ సంచి నిండా కూరలు ఎందుకు తెచ్చారు?” అంది రమణి. “నీ కోసం, నాలుగు రోజులు సరిపోతాయి, తరువాత నువ్వే తెచ్చుకోగలవు” అన్నాడు. “ఒక్క రోజు ప్రవచనం వినగానే, సన్యాసం తీసుకోవాలి అనిపించిందా, ముందు చేతులు కడుక్కుని వచ్చి అన్నం తినండి, మీకిష్టమని కంది పచ్చడి, పచ్చిపులుసు చేసాను” అంది రమణి. “రేపు ఉదయం వరకు నీకిష్టమైనవి ఎన్నీ అయినా చేసి పెట్టు, తింటాను” అన్నాడు కంచం దగ్గరికి లాకుంటూ. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని తను వాడుతున్న మందులు అన్నీ తీసి సర్దుకుంటున్న భర్తని చూసి, “ఏమిటి ప్రొద్దున్నే మందులు చూసుకుంటున్నారు?” అంది రమణి. “సన్యసించినంత మాత్రనా షుగర్ కి, బీపీ కి మందులు వాడకపోతే, తపస్సు లేకుండానే స్వర్గానికి పోతాను, త్వరగా వెళ్లి సన్యాసి డ్రెస్ కొనుక్కోవాలి” అన్నాడు సుబ్బారావు. “అయితే నిజంగానే హిమాలయాలకు వెళ్తారా” అంది కాఫీ కప్ తీసుకొని వచ్చి. “సన్యాసులు అబద్దం చెప్పకూడదు, అది మొదటి నియమం” అన్నాడు. “అయితే వేడి వేడి కాఫీ వద్దా” అంది రమణి. “వద్దు, మానేసాను” అన్నాడు సుబ్బారావు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XtOIRbqGSMs
What this episode covers

NOW PLAYING
సన్యాసం | Sanyasam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.