తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి' episode artwork

EPISODE · Feb 14, 2023 · 42 MIN

తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

from Harshaneeyam

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.కథ:గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగామోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.“జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” 'పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు - ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్య నెక్కడికీ పంపేవాడు కాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్తా, భార్యా, గవరయ్యా - ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ,ఊళ్లో ఎవరికి తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతడు గవరయ్యను గురించిన భోగట్టా అందజేశారు.గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగూళ్లో ఒకావిడని వుంచుకొన్నాట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డపేరువలన గవరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు.ఆఖరికి ఆ వూరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించినాయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడీ దైవభక్తి వున్నవాడు. ప్రతిఏటా సుబ్బరాయుడి షష్టి ఉత్సవాలూ అన్న సంతర్పణా చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ వుత్సవాలలో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రి చేత యిచ్చిన దానికన్న రెండు రెట్లుకి తనఖా వ్రాయించుకొని వున్న భూమి కాస్తా అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ.కాని వూళ్లో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదే కాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతిమీదే చేస్తున్నారు కాబట్టి పెద్దమనిషీ పరమ భక్తుడూ అయిన భూస్వామి యిలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలచుకోలేదు.గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లనీ, రెండు పిల్లిపిల్లల్నీ తెచ్చి యిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. “మనుషుల కంటె యివే నయం” అనేవాడు రోగిష్టి అయిన భార్యతో.గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్ళకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగా లెక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బుకోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడీమెకు చివరి రోజుల్లో వైద్యసహాయం చేయించలేక పోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పెట్రేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తూండగా ఎవరో వాడి తల రెండు చెక్కలయ్యేట్టు యినుపకడ్డీతో కొట్టారు.భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్టు చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా, భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడింది.తండ్రి ఆఖరిమాటగా కొడుకుతో 'ఎవర్నీ నమ్మకు. నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు' అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు.తల్లిలేని, తండ్రిలేని గవరయ్య ఆ యింట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో రెండు రోజులు తిండి తిప్పలు లేక యింట్లో మూలగా కూర్చుని పధ్నాలుగేళ్ళ గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు. పలకరించలేదు. రౌడీ, హంతకుడూ అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయనీ, వీడెకెంత దూరంలో వుంటే అంత మంచిదని ఆ వూళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందులేదు, మాకులేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ యింట్లోంచి రాత్రుళ్ళు “అమ్మా చచ్చిపోతున్నానేవ్' అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా దీనంగా.మశూచి అని తెలియగానే ఆ పొలిమేరలలో కూడా జనం నడవటం మానివేశారు.“ఈ కొడుకు కూడా పోతే వూరికి పీడా వదలిపోతుం” దన్నారు కొందరు.ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం ఒక గుర్రబ్బండీ గవరయ్య ఇంటిముందాగింది. దానిలోనుంచి నలభై ఏళ్ళ స్త్రీ దిగింది. ఒంటినిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా వుంది. చెంపలదగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమెకేసి చూస్తూ నించున్నారు. కాని ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నిటినీ లోపల పెట్టి తలుపులు దభాల్న వేసేశాడు.నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి యిలాకా ఉన్న ఆవిడనీ, ఆరునెలలు పుణ్యక్షేత్రాలు సేవించి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చిందనీ, గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడడమూ కొడుకు దిక్కులేని వాడై ఉండడమూ తెలిసి యెకాయెకిని సామాన్లు పట్టించుకుని ఆ వూరు వచ్చేసిందని తెలిసింది. అంతే, నాటినుండీ గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బునుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా వున్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధమున్నంత మాత్రాన ఈ చాతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పిచూశారు. కానీ ఎవర్నీ లక్ష్యం చేయని గుణం ఆమెలో వుంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్ళి చేసింది. గవరయ్య ఇరవయ్యోయేట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలూ, పదివేల రూపాయల నగదూ యిచ్చివేసింది.తర్వాత అతనీ వూరిలో మేనత్త ఇంటికి రావడం, తోళ్ళ వ్యాపారం చేయడమూ, ఏడెనిమిదేళ్ళకు మొదటి భార్య పోవడమూ ఊళ్ళో అందరికీ తెలిసినదే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం యీసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు, వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత, ఇంతటి అమానుషుడు వచ్చీ వచ్చి తమ వూళ్ళో పడ్డాడనే బాధ ఒక వైపున పీడించింది నలుగుర్నీ.అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు గవరయ్య దుర్మార్గుడు నిజమే. వికృత రూపుడు _ అదీ నిజమే _ పిసినిగొట్టు, ఎవరికీ కానీ రాల్చడు - ఒప్పుకున్నాం...

NOW PLAYING

తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

0:00 42:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 42 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on February 14, 2023.

What is this episode about?

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!