EPISODE · Feb 10, 2023 · 4 MIN
తనదాక వస్తే కానీ | Tanadaka Vasthe Kani | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తనదాక వస్తే కానీ రచన: Ch. ప్రతాప్ మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. కాలనీ. అంతా కోవిడ్ ప్రభావంతో నిర్మానుష్యంగా వుంది. డెలివరీ అబ్బాయిలు సరుకులను మెయిన్ గేటు వద్దే వదిలి వెళిపోతున్నారు. వాటిని తీసుకోవడానికి ముఖాలకు మాస్కులు పెట్టుకొని వచ్చే కొద్ది మంది తప్ప ఇంకే విధమైన అలికిడి లేదు. వంట పూర్తవడంతో సోఫాలో రిలాక్స్ అయ్యి మొబైల్ లో వాట్సప్ మెస్సేజిల్ని చూస్తూ చేరగిలబడింది వనజ. మన కాలనీ లో ఫలానా బిల్డింగ్ లో ఫలానా ఫ్లాట్ లో ఒక ఆఫీసరు గారికి కోవిడ్ 19 వచ్చిందని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని,అందరూ ఈ సంఘటనతో జాగ్రత్త పడాలని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ నుండి మెసేజి వచ్చింది. కోవిడ్ ప్రభావిత వ్యక్తి పేరు చూడగానే వనజ మనస్సు ఆనందంతో గంతులు వేసింది. ఆయన వనజ భర్త ఆఫీసులోనే పని చేస్తున్నారు. జూనియర్ అయినా త్వరగా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ పిల్లలు వనజ పిల్లల కంటే చదువుల్లో బాగా రాణిస్తున్నారు. అందుకే వాళ్ళ కుటుంబం అంటే వనజకు ఒళ్ళు మంట. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారి కుటుంబంపై విద్వేషాగ్ని విరజిమ్మేందుకు సిద్ధంగా వుంటుంది. అదిగో.. ఈ మెస్సేజి రూపంలో వనజకు మరొక మంచి అవకాశం వచ్చింది. ఇక ఆ మెస్సేజికి మరి నాలుగు లైన్లు అదనంగా జోడించి కాలనీలో కాక, వారి ఆఫీసులో కోలీగ్స్ భార్యలకు ఫార్వర్డ్ చేసేసింది. పదవులు వస్తే చాలదని, బాధ్యతగా కూడా ప్రవర్తించాలని, ఆయనగారి బాధ్యతా రహిత ప్రవర్తన వలన ఈ కాలనీ లోని వందలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాసి అందరికీ పంపించింది. అంతే కాకుండా అజాగ్రత్తతో వుండి, కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం తిరిగి వాళ్ళతో పాటు ఇతరుల జీవితాలను కూడా ఎలా ప్రమాదంలో పడేస్తున్నారో వివరిస్తూ ఇన్స్టాగ్రాం, ఫేస్ బుక్ లలో పోస్టులు పెట్టింది. కడుపులో వున్న ద్వేషం అంతా కక్కేసాక మనసు ఎంతో రిలీఫ్ గా అనిపించింది. సుష్టుగా భోజనం చేసి కంటికి నిండా నిద్రపోయింది. సాయంత్రం ఆరవుతుండగా వనజ భర్త రవి ఆఫీసు నుండి ఫోనొచ్చింది. రవి బాసు ఫోన్ చేసి హఠాత్తుగా రవికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని, దగ్గర్లో వున్న డాక్టరుకు చూపిస్తే కోవిడ్ లక్షణాలు వున్నాయని, అందుకే ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారని చావు కబురు చల్లగా అందించాడు. అంతే కాకుండా లంగ్ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా వుండడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా వున్నందున వెంటిలేటర్ పై వుంచారని, బ్రతికే అవకాశాలు ఎంత వున్నాయో చెప్పడం కష్టమని డాక్తర్లు అంటున్నారని చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ptZ683kFIvQ
What this episode covers

NOW PLAYING
తనదాక వస్తే కానీ | Tanadaka Vasthe Kani | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.