EPISODE · Aug 4, 2023 · 11 MIN
వాచస్పతి | Vachaspathi | Telugu Short Story | Sudarsana Rao Pochampally | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Vachaspathi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally 'వాచస్పతి' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : సుదర్శన రావు పోచంపల్లి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ‘పూవు పుట్టగానే పరిమళిస్తుంది’. ఇది లోక వాడుక. కానీ ఏ పూవూ పుట్టుకతో పరిమళించదు. పెరిగి విప్పారినప్పుడే పరిమళము గుప్పుమంటూ గుబాళిస్తుంది. అట్లనే ఏ కాయైనా పండితేనే పరిమళముతోపాటు మాథుర్యము మనకందిస్తుంది. పూవు రుచి చూడము కాని, కాయను ఓపికలేక కసరుకాయనుండే కొరికేయడమూ మానవ సహజమే. పరిపక్వ దశకొచ్చేటప్పటికి చేదు, వగరు, పులుపు తరువాతనే తీపిదనము ఆస్వాదిస్తాము. తరువాత జాతులైన, పక్షి రెక్కల బలము పెరిగితేనే ఎగురగలదు, పశువు పాలు మరచి మేత గరిచే దాకనే తల్లి వెంట తిరుగుతుంది. అట్లనే "ఆళి, కుళి, వృచ్చిక, వేణు, రంభ అవసానకాలే ఫలముద్భవంతి" అంటారు. అంటే తుమ్మెద, వెండ్రకాయ(పీత), తేలు, వెదురుచెట్టు, అరటి చెట్టు ఫలమొసంగి చనిపోతాయంటారు. మానవునికి మాత్రము బాల్య, కౌమార, యౌవన, వార్థక్యమను నాలుగు దశలుండి. శైశవములో పాలుగుడుచుట, బాల్యములో విద్యాభ్యాసము, యౌవ్వనములో సంపాదన. వార్థక్యములో విశ్రాంతి పొందుతూ ఉంటారు. విద్యాభ్యాసముతో పాటే జ్ఞానము అలవడుతుంది. కొందరికి ఆ జ్ఞానము చిరు ప్రాయముననే బయట పడితే పూవు పుట్టగానే పరిమళిస్తుంది అను సామెత వాడుతుంటారు. ఆ జ్ఞానమబ్బుడు చాలా కొద్దిమందిలో మాత్రమే. కొన్ని తీగ జాతులలో ఉదాహరణకు పొట్ల, ‘పట్టినెత్తుకొనే పందిరెక్కుతుంది’ అంటారు. అన్ని జీవ జాతులలో మానవ జాతి ఉత్కృష్టమైనది. కాని చెట్టుకు చెదలు పట్టినట్టు కొందరు మానవత్వము చంపుకొని కౄరులుగా దానవులుగా, రాక్షస స్వభావము అలవర్చుకొని సంఘములో చీడలా తయారైతారు. అడవిలో కౄర జంతువులైతే అది స్వాభావికము. కొన్ని కౄర పక్షులూ ఉన్నా అవి అడవికే పరిమితము. తక్కిన పక్షులు, పశువులు మనుషులనాశ్రయించుకొని ఉంటాయి. వాటిలోనూ తరచు కొన్ని తెలివితేటలు బయల్పడుతుంటాయి. అందులో కుక్క విశ్వాసముగల జంతువు. యజమానికొరకు ప్రాణమివ్వడానికి కూడా వెనుకాడదు. ఇక కథలోకి వస్తే విశ్వేశ్వర్. వినయ ఆదర్శ దంపతులు. ఒకరిమాటకు ఒకరు వ్యతిరేకత కనబరుచరు. అన్యోన్యతకు మారు పేరా అన్నట్టు వ్యవహరిస్తుంటారు. వాళ్ళకో పుత్ర రత్నం- పేరు వాచస్పతి. పదేండ్లైనా విద్య అబ్బదు సరికదా దురలవాటు. దుర్మార్గపు ఆలోచనలే అతని విధానము. విశ్వేశ్వర్, వినయ లోకములో అందరు బుద్ధిమంతులతో పోల్చుకొని తమకీ దురదృష్టమేమిటి అని వాపోతుంటారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yvWm8IAX5Ac
Embed this episode
NOW PLAYING
వాచస్పతి | Vachaspathi | Telugu Short Story | Sudarsana Rao Pochampally | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.