వరూధిని | Varudhini | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 3, 2023 · 8 MIN

వరూధిని | Varudhini | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వరూధిని రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ట్రైన్ కదలడానికి ఇంక రెండు నిముషాలు మాత్రమే సమయముందనగా, రొప్పుతూ బోగీలోకి ఎక్కింది పాతిక సంవత్సరాల ఆ జవ్వని. నిమ్మపండు రంగు మేని ఛాయపై పసిడి అందం వెలవెలబోతోంది. నిగనిగలాడే నల్లని ఒత్తైన కురులు, గాలికి చెల్లాచెదురై భుజాలమీదుగా ఊయల లూగుతున్నాయి. ముడిపడిన ఆమె భ్రుకుటి, మన్మథుడు వలపు బాణాలు సంధించడానికి వంచిన విల్లును తలపిస్తున్నాయి. లేడి కళ్ళలాంటి చురుకైన ఆమె కళ్ళలో చిన్న బెరుకు.. ఆ వెంటనే తాను వెతుకుతున్నది కనిపించిన ఆనందంతో ఆ కళ్ళలో చిన్న మెరుపు. చూపుడువేలితో బెర్తు నంబర్లు వెతుకుతూ, మధ్య కూపే దగ్గర ఆగిన ఆమె, లగజ్ ని తనకు కేటాయించబడిన బెర్తు కిందకి తోసింది. అలసటకు నుదుటిపై పట్టిన స్వేదం, ముత్యపు చినుకై మెడ ఒంపులోకి జారింది. "ఎక్స్ క్యూజ్ మీ! మీ కాళ్ళు కొంచెం వెనక్కి తీసుకుంటారా?" ఎదురుగా ఉన్న బెర్తుపై కూర్చున్న వ్యక్తి, వాలుగా తన సీటు కిందకి చాచిన కాళ్ళను తియ్యమన్నట్టు అభ్యర్ధించింది. "ఓహ్! సారీ!" అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుని, తిరిగి ఒడిలో పెట్టుకున్న ల్యాప్ టాప్ పై వర్కు చేసుకోవడంలో మునిగిపోయాడు ఆ వ్యక్తి. కిటికీ పక్కగా ఒదిగి కూర్చున్న ఆమె, ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోంది. చల్లగా వీస్తున్న గాలికి, మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఒక్క కుదుపుతో ట్రైను ఆగేసరికి ఉలిక్కిపడి లేచి, సర్దుకుని కూచుంది. అప్పుడు చూసింది.. ఎదురుగా కూచున్న అతని వైపు. పూర్తిగా నిమగ్నమై పని చేసుకుంటున్న అతను, చుట్టూ పరిసరాలను గమనించే స్థితిలో లేడు. పైనుంచి కిందవరకూ అతడినే పరిశీలనగా చూస్తున్న ఆమె, ఒకింత సంభ్రమానికి గురయ్యింది. అంతవరకూ మగవారిలో అంత అందంగా ఉన్నవారిని చూసి ఎరుగని ఆమె, రెప్ప వెయ్యకుండా అతడి వైపే చూస్తోంది. ఒత్తుగా పైకి దువ్విన క్రాఫు, సూదిగా మొనతేలిన ముక్కు, ఎర్రటి పెదవులపైకి సగం వరకూ కప్పినట్టు గుబురుగా పెరిగిన మీసకట్టు, నీట్ షేవ్ లో ఉన్న గెడ్డం, శంఖుపూల వలే ముచ్చటగా ఉన్న చెవులూ.. దర్పానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది అతని కనుముక్కు తీరు. మరులు రేకెత్తించే విశాలమైన ఛాతీపై గాలికి కదులుతున్న రింగు రింగుల జుత్తూ మనసులో అలజడి రేపుతుంటే.. నిగ్రహించుకోలేక గబుక్కున ముఖం పక్కకి తిప్పుకుంది. ఊ.. హూ! ఆమె వల్ల కాలేదు. 'ఎన్నడూ లేనిది ఎందుకింత పరితపిస్తున్నాను?' సమాధానం దొరకని ప్రశ్నతో వేసారిపోయింది. మనసు వద్దని వారిస్తున్నా, కళ్ళు అతడివైపే లాగుతున్నాయి. భారమైన ఉచ్ఛ్వాశ, నిశ్వాశాలతో బరువెక్కిన ఆమె పై ఎద మీద నిలువలేక, జారిన పమిటను సర్దుకునే ప్రయత్నం చెయ్యలేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. https://youtu.be/UQnrLxX0W8k

NOW PLAYING

వరూధిని | Varudhini | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

0:00 8:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 3, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వరూధిని రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ట్రైన్ కదలడానికి ఇంక రెండు నిముషాలు మాత్రమే సమయముందనగా, రొప్పుతూ బోగీలోకి ఎక్కింది పాతిక సంవత్సరాల ఆ జవ్వని....

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!