వసంత గీతం | Vasantha Geetham | Telugu Short Story | Buddhavarapu Kameswara Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · May 26, 2023 · 19 MIN

వసంత గీతం | Vasantha Geetham | Telugu Short Story | Buddhavarapu Kameswara Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Vasantha Geetham' New Telugu Story Written By Buddhavarapu Kameswara Rao 'వసంత గీతం' తెలుగు కథ రచన: బుద్ధవరపు కామేశ్వరరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు, నాగపూర్ లోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి వారి 168వ జన్మదిన సందర్భంగా జరుగుతున్న ఆరాధన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకినాడకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రామశాస్త్రిగారు. వేదిక మీద యువ గాయనీ గాయకులు పాడుతున్నారు కానీ, రామశాస్త్రి గారి కళ్ళు మాత్రం వేదిక క్రింద ఆశీనులైన ఆహూతుల మీదే ఉన్నాయి, ఎక్కడైనా తన చిట్టి తల్లి లక్ష్మి కనబడుతుందేమోననన్న ఆశతో. కూతురు ఇల్లు విడిచి పాతిక సంవత్సరాలైనా, ఏ నాడూ ఆమె గురించి ఆలోచించని ఆ ముసలి ప్రాణం ఓ నాలుగైదు సంవత్సరాల నుంచి ఆమెను ఒకసారైనా చూడాలని కొట్టుకుంటోంది. అందుకే ఏ కచేరీకి వెళ్లినా తనని చూడ్డానికి కూతురు వస్తుందేమో, ఓసారి చూడవచ్చు అన్న ఆరాటం ఆయనది. ఉబికివస్తున్న కంటనీరు ఎవరికీ కనబడకుండా తుడుచుకుంటూ, రెండున్నర దశాబ్దాల నాటి ఆ సంఘటన తలుచుకుంటూ గతంలోకి జారిపోయారు రామశాస్త్రి గారు. ***** ***** ***** ***** 'త్యాగరాజ స్వామి వారి 140వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా సంగీత ప్రియులకు స్వాగతం. ఇట్లు త్యాగరాజ గాన సభ, భాస్కర్ నగర్, కాకినాడ' అని రాసి ఉన్న ఆ స్వాగత ద్వారం వంక ఆరాధనగా చూస్తూ ఆ మైదానంలోకి అడుగు పెట్టారు, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రామశాస్త్రి గారు, తన భార్య, కుమార్తె వెంట రాగా. సభాసాంప్రదాయ ప్రకారం పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే, గానసభ అధ్యక్షులు శ్రీ సూర్యారావు గారు మాట్లాడుతూ, "కర్ణాటక సంగీత ప్రియులు అందరికీ నమస్కారం. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజ స్వామి వారి జన్మదిన ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటుంన్నాం! ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరం యువ గాయనీగాయకుల లోని ప్రతిభను వెలికి తీయడానికి కీర్తనల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసినదే. మన సంస్థ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగానూ మరియు త్యాగరాజ స్వామి వారి నూట నలభైయ్యవ జన్మదిన కారణం గానూ, ఈరోజు ఓ రెండు ప్రత్యేక కార్యక్రమాలు మీకు అందిస్తున్నాము. అందులో మొదటిది, తమ గానకళ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను తయారు చేసిన మన నగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నేమాని రామశాస్త్రి గారిని సన్మానించడం! వారిని వేదిక మీదకు తీసుకుని రావలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. ఇక రెండవ కార్యక్రమం గురించి చివర్లో చెబుతాను" అని ముగించారు. ఆ తరువాత శాస్త్రి గారికి సన్మానం, ఆ తదుపరి కీర్తనల పోటీలు అయిన పిదప చివర్లోవేదిక మీదకు వచ్చిన సూర్యారావు గారు, "సంగీత రసజ్ఞులకు పునఃస్వాగతం. ఇప్పుడు రెండో ప్రత్యేక కార్యక్రమం గురించి ఓ రెండు ముక్కలు. తన తండ్రిగారి వద్ద శిష్యరికం చేసిన మన రామశాస్త్రి గారి ఏకైక కుమార్తె కుమారి లక్ష్మి మొట్టమొదటి సారిగా ఈ వేదిక ద్వారా ఓ రెండు కీర్తనలు పాడుతుంది. అందరూ ఆ రసఝరిని ఆస్వాదించి ఆ చిన్నారిని ఆశీర్వదించగలరని ఆశిస్తున్నా" అంటూ ముగించారు. తర్వాత వేదిక ఎక్కిన లక్ష్మి, మొదటి పాటగా "ఎందరో మహానుభావులు" పాట, తర్వాత "జయమంగళం నిత్య శుభమంగళం" పాడి ఆ రోజు కార్యక్రమాలకు ముగింపు పలికింది. కూతురు పాట విన్న తరువాత, "పరవాలేదు, ఇంకా కొంచెం సాధన చేయస్తే మంచి గాయని అవుతుంది" మనసులో అనుకున్నారు రామశాస్త్రి గారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/IXUBBNeQYSE

Episode metadata supplied by the publisher feed · Published May 26, 2023

Embed this episode

NOW PLAYING

వసంత గీతం | Vasantha Geetham | Telugu Short Story | Buddhavarapu Kameswara Rao | manatelugukathalu.com

0:00 19:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!