EPISODE · Oct 12, 2022 · 3 MIN
12. మనసును నియంత్రించడం
from Gita Acharan · host Siva Prasad
అర్జునుడు మనసును గాలితో పోలుస్తూ, సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ, వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు. జ్ఞాపకశక్తిని ఉపయోగించి, ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా, సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామక్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి, అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది. మనసుకున్న ఇదే సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనినే జాగరూకత అని కూడా అంటారు. మనం ఈ సామర్ధ్యం ద్వారా సొంత ఆలోచనలు, భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు. నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించ డానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసాన్ని) ను, కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే 'ఫీడ్ బ్యాక్ లూప్స్' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనక, ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. ఇది మెదడులో కొత్త శక్తిని నింపడం వంటిది. విభిన్న ధ్రువం అయిన 'రాగం' అర్థం చేసుకోవడం ద్వారా వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. 'రాగం' అంటే భౌతిక ప్రపంచంలో అందం, ఆస్తులు, అభివృద్ధి వంటి ఆనందాల కోసం విస్తృతంగా పాకులాడడం. ద్వంద్వాల యొక్క సూత్రం ప్రకారం ప్రతి 'రాగ భావము/భావన' వైరాగ్యంతో ముగుస్తుంది కానీ మన దృష్టి ఎల్లప్పుడు 'రాగం' పైనే ఉంటుంది. అందుకే వైరాగ్యాన్ని విస్మరిస్తాము. స్టోయిసిజం వంటి కొన్ని తత్వాలు. వైరాగ్యానికి శిఖరం వంటి మరణం యొక్క ఉపయోగాన్ని సమర్ధిస్తాయి. దీన్ని 'మెమెంటో మోరి' అంటారు అంటే మరణాన్ని మళ్లీ మళ్లీ దర్శించడం లేక అనుభూతి చెందడం. ఈ పద్ధతిలో వారు చావుకి గుర్తుగా (జ్ఞాపకార్ధంగా) పనిచేసేచోటిలో లేక ఇంట్లో ఒక ప్రముఖ స్థానంలో దేన్నైనా ఉంచి, దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ మృత్యువు పైన ధ్యాస నిలబడేలా చూస్తారు. భారతీయ వేదాంతం దీనినే 'స్మశాన వైరాగ్యం' అంటుంది. మనం వైరాగ్యాన్ని సాధన చేయడం మొదలు పెడితే అది మనసుని స్థిరపడేలా చేస్తుందని, శ్రీకృష్ణుడు అంటారు. ఈ లాక్ డౌన్ సమయాలు మనకు వైరాగ్య క్షణాలను దర్శింప చేశాయి. వీటిని మనసును సమతుల్యతలో ఉంచడానికి, శాంతి ఆనందాలను పొందడానికి ఉపయోగించుకోవచ్చు.
Embed this episode
NOW PLAYING
12. మనసును నియంత్రించడం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.