EPISODE · Dec 4, 2022 · 3 MIN
21. సృజనాత్మకతను నాశనము చేయలేము
from Gita Acharan · host Siva Prasad
అంతరాత్మను అర్థం చేసుకునే తృష్ణతో ఉన్న మానవాళికి రెండు రకాల జ్ఞానులు మార్గదర్శకత్వం చేశారు. రెండు మార్గాల గమ్యం ఒకటిగానే ఉన్నప్పటికీ ఒకరు సానుకూల పక్షం నుంచి, మరొకరు ప్రతికూల పక్షం నుంచి ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రయాణం ఆరంభించే స్థలంలోనే తేడా ఉంటుంది. ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది మన స్వభావం పై ఆధారపడి ఉంటుంది. సానుకూల దృక్పథంతో సాగే మార్గదర్శనము నాశనము లేనిది, శాశ్వతమైనది, స్థిరమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అయిన 'దాన్ని', దానికి 'ఇంకేమి కలపలేని' దానిగా వర్ణిస్తుంది. 'సృజనాత్మకత' దీనికి రూపకం. ప్రతికూల దృక్పధంతో సాగే మార్గదర్శనం నాశనం చేయలేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించబడినది అయిన 'దాన్ని', దాని నుండి 'ఇంకేమి తీయలేని' దానిగ వర్ణిస్తుంది. 'శూన్యం' దీనికి ఒక రూపకం. 'సృజనాత్మకత', 'శూన్యం' అనేవి రెండూ సృష్టి/భౌతిక వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 'సృజనాత్మకత' సృష్టికి దారితీస్తుందని అంతర్లీనంగా అర్థం చేసుకోవడం సులభం. మరొకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ సమస్త సృష్టి 'శూన్యం' నుంచి పుట్టిందనీ, విశ్వాన్ని ఉనికిలోకి తీసుకురాగలిగిన శక్తి శూన్యానికి ఉందని నిర్ధారణకు వచ్చింది. చిన్న పరమాణువు నుంచి శక్తివంతమైన విశ్వం దాకా శూన్యం అన్నిటా వ్యాపించి ఉంటుంది. శ్రీకృష్ణుడు తరచుగా ఉల్లేఖించిన శ్లోకంలో (2.23) ఇలా అంటారు. “ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు; అగ్ని దహింప జాలదు; నీరు తడపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.” 'శూన్యాన్ని' గాని 'సృజనాత్మకత'ను కానీ ఏదైనా ఆయుధం నాశనం చేయగలదా? ఖచ్చితంగా చేయలేదు. మహా అయితే 'సృజనాత్మకత' యొక్క భౌతిక వ్యక్తీకరణను మార్చుకోగలుగుతుంది అలాగే అగ్ని సృజనను కానీ, శూన్యాన్ని కానీ నాశనం చేయలేదు. దాని సామర్థ్యం శక్తి కట్టెను బూడిదగా మార్చడం వరకే పరిమితం; ఈ రెండు భౌతిక స్వరూపాలే. నీరు కూడా సృజనను లేక శూన్యాన్ని కరిగించలేదు. అలాగే గాలికి కూడా వీటిని ఆరిపోవునట్లు చేసే నైపుణ్యాలు గాని, శక్తి గానీ లేదు. సృజనాత్మకత సృష్టిని ఉనికిలోకి తెస్తుంది. కానీ సృష్టికి సృజనను ప్రభావితం చేసే శక్తి లేదు. ఇక్కడ దిశ ముఖ్యమైనది. ఆకాశంలో మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి ఆకాశాన్ని ప్రభావితం చేయలేవు.
Embed this episode
NOW PLAYING
21. సృజనాత్మకతను నాశనము చేయలేము
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.