EPISODE · Apr 5, 2023 · 3 MIN
45. జన్మ మృత్యువులనే భ్రాంతిలో కలిగే బంధాలు
from Gita Acharan · host Siva Prasad
“సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక, వారునిర్వికారమైన పరమపదమును పొందుదురు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.51). నిశ్చలమైన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంటాడని దీర్ఘకాలంగా మానవాళి నమ్మింది. నిజానికి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని తరువాత కనుగొనబడింది. అంటే మన అవగాహన అస్తిత్వ సత్యంతో మేళవించింది. మన ఇంద్రియాల పరిమితుల వల్ల కలిగే భ్రమతో, సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. జననం, మరణం గురించిన మన భ్రమ కూడా ఇటువంటిదే. శ్రీకృష్ణుడు'దేహి' లేక ఆత్మను గురించి వివరిస్తూ భగవద్గీతను ప్రారం భించారు; అది అన్నింటిలోనూ వ్యాపించినది, జన్మలేనిది, శాశ్వతమైనది, పురాతనమైనది (2.20). కొత్త వస్త్రాలను ధరించడానికి మనం జీర్ణమైన వాటినివిడిచినట్లుగా ఆత్మ భౌతిక శరీరాలను మారుస్తుందని ఆయన చెప్పారు (2.22). సమ బుద్ధితో జన్మ బంధాల నుండి విముక్తి పొందుతారని ఆయన చెప్పినప్పుడు,వారు 'దేహి/ ఆత్మ' అనేఅస్తిత్వ సత్యంతో తమను తాము జోడించు కోవడాన్ని సూచిస్తుంది. ఇది భూమి చుట్టూ తిరిగేది సూర్యుడన్న భ్రమ నుండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందన్నఅస్తిత్వ సత్యంతో మేళవించడం లాంటిది. మనము బాహుళ్యముతో పాటు గుర్తింపబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ సమాజంలో ఎక్కువ మంది మనకు పుట్టుక మరియు మరణాలు ఉన్నాయని నమ్ముతారు. అటువంటి నమ్మకం కలవారు దేహి/ఆత్మ యొక్క అస్తిత్వ సత్యానికి మనల్ని మార్గనిర్దేశం చేయలేరు. ఇది మన స్వంత సమ బుద్ధి మాత్రమే చేయగలదు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్వంద్వాలకు అతీతమైన స్థితిని గురించి ప్రస్తావించారు. సాధారణంగా ఇది స్వర్గంగా, కొన్నిసార్లు బయట ఎక్కడో ఉన్న పరమపదంగా వర్ణించబడుతుంది. కానీ ఈ గమ్యం మనలోనే ఉందని ఈ శ్లోకం సూచిస్తుంది. ఇది కర్మలను త్యజించకుండా కర్మ ఫలాలను త్యజించే మార్గం (2.47).
Embed this episode
NOW PLAYING
45. జన్మ మృత్యువులనే భ్రాంతిలో కలిగే బంధాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.