5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు episode artwork

EPISODE · Aug 25, 2022 · 3 MIN

5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

from Gita Acharan · host Siva Prasad

వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము, సాంఖ్య యోగము, భక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపై, భక్తియోగం హృదయం పై, ఆధారపడే వారికి అనుకూలమైనవి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో కట్టబడ్డామనీ, వాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా 'ఇప్పుడు నేను ఏమి చేయాలి' అన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనను నిష్కామకర్మ, అంటే కోరికలు లేని, ఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది. సాంఖ్య యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదు; ఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామని, ఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాలన్న నమ్మకమే దాని ఆరంభ బిందువు. ఈ మార్గం మనకు కోరిక లేదా ఎంపిక లేని అవగాహన యొక్క అనుభూతిని ఇస్తుంది. భక్తి యోగం శరణాగతికి సంబంధించినది. సముద్రంలోని అలతో వారు తమను పోల్చుకుంటారు. ఇక్కడ సర్వోత్కృష్టులైన పరమాత్మే సముద్రం. మొట్టమొదట్లో ఈ మూడు మార్గాల యొక్క భాష, అవగాహన చాలా విభిన్నంగా ఉంటుంది. అవగాహన ను గురించిన మార్గాన్ని మనస్సు ఆధారిత వ్యక్తికి చెప్పినట్లయితే, అతడు అవగాహనను పొందడానికి ఏదైనా పని చెయ్యాలని వెతుకుతూ ఉంటాడు. నిశ్చయంగా ఈ మూడు మార్గాలూ ఒకదానికొకటి భిన్నమైనవి కావు. జీవితములో మనము ఈ మూడు మార్గాల యొక్క కలయికనే అనుభూతి చెందుతాము. ఉదాహరణకు కర్మ, సాంఖ్య మార్గాలు కలిసినప్పుడు అన్ని కర్మల యొక్క అంతిమ గమ్యం ఎండమావేనని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కర్మకు అంటకుండా నాటకంలో పాత్రధారులు లాగా కర్మలను కొనసాగిస్తాము. ఎలాగైతే 'ఎలక్ట్రాన్,' 'ప్రోటాన్', 'న్యూట్రాన్' అనే మూడు పరమాణువుల సమ్మేళనం వలన ఈ విశ్వము నిర్మింపబడునో అలాగే, ఆధ్యాత్మిక ప్రపంచం ఈ మూడు దారుల యొక్క సమ్మేళనము. ఈ మూడు మార్గాలూ కూడా అహంకార విముక్తమైన అంతరాత్మ అనే ఒకే గమ్యానికి చేరుస్తాయని శ్రీకృష్ణుడంటారు.

Episode metadata supplied by the publisher feed · Published Aug 25, 2022

Embed this episode

NOW PLAYING

5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

0:00 3:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Bhagavad Gita Chapter 14 Swami Guruparananda Bhagavad Gita is a dialogue between Lord Krishna, the teacher and Arjuna, the student. The episode of Lord Krishna imparting knowledge to Arjuna occurs in the epic Mahabharata. There are totally 700 verses classified into 18 chapters. Krishna gives the essence of the entire Veda in his teaching. He explains in detail various disciplines like Karma Yoga, Devotion, Values, Meditation, and so on. Lord Krishna also imparts knowledge about the true nature of God, World and Beings and clearly points out the underlying oneness of God and Beings. In these 322 classes, all the 700 verses of the Bhagavad Gita are explained word by word, in keeping with Shankaracharya's commentary. These classes will help the listener in gaining a thorough knowledge of the Bhagavad Gita. The summary of Bhagavad Gita - Chapter 14, given by Swami Paramarthananda, is available for download. The main topic of this chapter is the discrimination of the three guna Gita For Daily Living Neil Bhatt Gita for Daily Living is a weekly podcast that distils the wisdom of the Bhagavad Gita and presents it in a way that is action-able and relevant to daily life Bhagavad Gita Class (Ch3) in Sanskrit by Dr. K.N. Padmakumar (Samskrita Bharati) Samskrita Bharati Bhagavad Gita Class (Ch3) in Sanskrit by Dr. K.N. Padmakumar (Samskrita Bharati) Gita Wisdom Teachings by Joshua M. Greene (Yogesvara) Joshua M. Greene (Yogesvara das) A bi-weekly Bhagavad Gita class in NY. Each session includes readings, analysis, audiovisuals, verse recitations and practical insights into India's essential wisdom text. Attendees will discover the message of the Gita, master basic vocabulary and concepts, and acquire skills for teaching and practicing yoga philosophy. Class notes available at www.gitawisdom.org/podcast.For information on attending a class, visit www.facebook.com/pg/gitawisdomteachings/events.

Frequently Asked Questions

How long is this episode of Gita Acharan?

This episode is 3 minutes long.

When was this Gita Acharan episode published?

This episode was published on August 25, 2022.

Can I download this Gita Acharan episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!