EPISODE · Aug 24, 2023 · 4 MIN
63. మిధ్యాచారి
from Gita Acharan · host Siva Prasad
“కర్మ కి మనం కర్త కాకపోతే నిజమైన కర్త ఎవరు?” అనే ప్రశ్న మన అందరిని వేధిస్తుంది. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానమిస్తారు, “ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలనన, మనష్యులందరును ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగు దురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును” (3.5). ఎలక్ట్రాన్', 'ప్రోటాన్', 'న్యూట్రాన్' అనే మూడు పరమాణు కణాలు మొత్తం భౌతిక ప్రపంచానికి మూలము. అదేవిధంగా, సత్వ, తమో, రజో అనే మూడు గుణాలు మనల్ని కర్మలు చేసేలా ప్రేరేపిస్తాయి. అందుకే అవే నిజమైన కర్తలు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు, “బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు” (3.6). కుటుంబ, సామాజిక స్థాయిలో చిన్నప్పటి నుంచి మనం మంచి ప్రవర్తనకు పొగడ్తలను, చెడు ప్రవర్తనకు శిక్షను పొందుతూ పెరిగాము. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, మంచి ప్రవర్తన గలవారిగా కనిపించటానికి మనం మన మాటల్ని, చేష్టల్ని నిగ్రహించుకొంటాము కానీ మన మనస్సు ద్వేషం, పశ్చాత్తాపం, అన్యాయ భావనతో నిండిపోతుంది. ఫలితంగా మన అంతర్గత, బాహ్య స్వభావాల మధ్య సమన్వయం లేకుండా విభజిత వ్యక్తిత్వానికి (సిట్ పర్సనాలిటీ) దారి తీస్తుంది. అందుకనే, ఇలాంటి అణచివేతకు శ్రీకృష్ణుడు ఎప్పుడూ అనుకూలంగా లేరు; దీన్నే ఆయన మిథ్య అంటారు. విమర్శలను, ప్రశంసలను సమానంగా పరిగణించే సమత్వం పొందమని ప్రేరేపిస్తారు. తద్వారా ద్వంద్వత్వం అదృశ్యమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరూ ఈ దుస్థితిలో జీవించాలని కోరుకోరు; కానీ దాని నుండి ఎలా బయటపడాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు ఒకరు కర్మ యొక్క అవయవాలను అనాసక్తులై కర్మయోగములో వాటిని నిమగ్నం చేయడమనే తక్షణ పరిష్కారాన్ని చూపిస్తారు (3.7). 'అనాసక్తి' అన్నదే గమనార్హము. ఇది గుణాలే నిజమైన కర్త అని గ్రహించి, తాను 'కర్త' అనే భావం వదిలివేసి, కర్మలను చేయడం; కర్మఫలం తో సంబంధం లేకుండా కర్మలను చేయడం; ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాల (నియంత్రక భాగం) ను వేరు చేయడం. 'ఆసక్తి', 'విరక్తి' విడిపోయినప్పుడు షరతులు లేని ప్రేమ ఉద్భవిస్తుంది.
Embed this episode
NOW PLAYING
63. మిధ్యాచారి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.