EPISODE · Feb 28, 2024 · 3 MIN
76. కామము పట్ల జాగ్రత్త వహించాలి
from Gita Acharan · host Siva Prasad
“ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా, దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయు చుండును?” అని అర్జునుడు అడిగాడు (3.36). “రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియేప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎఱుంగుము.” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.37). శ్రీకృష్ణుడు కామం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే కోరిక యొక్క తీవ్ర రూపం. కర్మతో అనుబంధం అనేది రజోగుణం యొక్క ముఖ్య లక్షణం. ఉదాహరణకి ఒక వాహనం విషయంలో కదలిక లేదా వేగం అనేది రజోగుణం నుండి పుట్టిన గుణం; దీనిని సాధించడానికి యాక్సిలరేటర్ ఒక పరికరం. అదే విధంగా మందగించడం లేదా జడత్వం తమస్సు యొక్క స్వభావం; దీని కోసం బ్రేక్ ఒక పరికరం. డ్రైవర్ సత్వగుణానికి ప్రతినిధి; సురక్షితంగా వెళ్లడానికి త్వరణం, బ్రేకింగ్ ని సంతులనం చేస్తాడు. స్పీడోమీటర్ అనేది అవగాహన కోసం ఒక పరికరం. వీటి మధ్య సంతులనం తప్పిపోతే ప్రమాదం తప్పదు. కామం కూడా మన జీవితాల్లో సమతుల్యత కోల్పోవడం తప్ప మరొకటి కాదు. మనం సుఖాన్ని పొందేందుకు, ఏదైనా వస్తువును కలిగి ఉండటానికి, ఎవరైనా వ్యక్తితో కలిసి ఉండటానికి, అధికారం, కీర్తిని పొందడానికి చాలా శక్తిని వెచ్చిస్తాము. ఈ కోరికలకు శక్తిని ఇస్తున్నప్పుడు వాటి పర్యవసానాల గురించి మనకు పూర్తిగా తెలియదు. ఒకసారి అది సరిహద్దు దాటిన తర్వాత మనకు ఈ కోరికల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. నెరవేరని కోరిక క్రోధాన్ని తీసుకు వస్తుంది. అట్లాగే సుఖం వెనుక దుఃఖం ఎల్లప్పుడూ దాగి ఉంటుంది. ఎందుకంటే, ఈ రెండూ ద్వంద్వము యొక్క ధ్రువాలు కనుక. ఆ సుఖం తరువాత వచ్చే దుఃఖమే క్రోధంగా వ్యక్తమవుతుంది. కోరికలు ఎప్పుడూ తృప్తి చెందవని ఈ శ్లోకం సూచిస్తుంది. మనం వాటిని సంతృప్తి పరచడానికి ఎంత ప్రయత్నిస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయని అర్ధము. ధనవంతుడు మరిన్ని సంపదలను కోరుకుంటాడు; శక్తిమంతుడు నిరంకుశమైన శక్తిని కోరుకుంటాడు; వాటిని అణచివేయడం లేదా సంతృప్తి పరచడం అనేది ఉపాయం కాదు. మనము కామం లేదా భయం యొక్క కోరల్లో చిక్కుబడ్డప్పుడు వాటి పట్ల అవగాహన వహించమని, ఈ అవగాహనే వాటి పట్టు నుండి మనల్ని విడిపిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తున్నారు.
Embed this episode
NOW PLAYING
76. కామము పట్ల జాగ్రత్త వహించాలి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.