EPISODE · Sep 17, 2022 · 3 MIN
8. వ్యక్తము, అవ్యక్తము
from Gita Acharan · host Siva Prasad
చుక్కానికి జోడించబడ్డ చిన్న యంత్రం (ట్రిం టాబ్) లోని మార్పు పెద్ద ఓడ యొక్క దిశను మారుస్తుంది. అలాగే, భగవద్గీతను అధ్యయనం చేయాలనే చిన్న తపన మన జీవన మార్గాన్నే గొప్పగా మార్చగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల మనకు అందుబాటులో ఉన్న కాలాన్ని భగవద్గీతలో మునగడానికి ఉపయోగిస్తే మన జీవితంలో పెద్ద మార్పు రావడానికి అవకాశము ఉంది. భగవద్గీత ప్రాథమిక విద్య (కిండర్ గార్డెన్) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారి దాకా ఆత్మజ్ఞానం కోసం చదవదగ్గ శాశ్వతమైన పాఠ్య పుస్తకం. మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్ధమవుతాయి. కానీ, మనం వ్యక్తము మరియు అవ్యక్తం యొక్క దృష్టి కోణం నుంచి సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఇంద్రియాల పరిధిలోకి వచ్చేవి వ్యక్తమైనవి; ఇంద్రియాలకు అతీతమైనవి అవ్యక్తమైనవి. వ్యక్తమయ్యే వాటి కథ బిగ్ బాంగ్ (బృహత్ ప్రళయం) మొదలు నక్షత్రాల పుట్టుక, ఈ నక్షత్రాల్లోని కీలకమైన భాగాల్లో అత్యున్నత రసాయనిక మూలకాలు కలిగిన అణువుల నిర్మాణం, నక్షత్రాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఈ మూలకాలు చెల్లాచెదురవుతున్న తీరు, గ్రహ మండలం ఏర్పాటు, భూమ్మీద బౌద్ధిక జీవితం ఆరంభం వంటి అనేక అంశాలను వివరిస్తాయి. ఈ వ్యక్తమైన జీవ రూపాలు, గ్రహాలు, నక్షత్రాలు, చివరికి ఈ విశ్వం కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని కలిగి ఉన్నాయి అని శాస్త్రీయ సమాజం అంగీకరించిన వాస్తవం. కానీ అంచనా వేసిన కాల పరిమితుల్లో తేడా రావచ్చు. వ్యక్తమయ్యే వాటి దృక్కోణంలో మనం పుట్టినప్పటి నుండీ చనిపోయే దాకా మనుగడ కలిగి ఉంటామన్నది వాస్తవం. అవ్యక్తమైన వాటి దృక్కోణంలో చూసినట్లయితే, భగవద్గీత చెప్పే ప్రకారం మనం పుట్టుకకు ముందు, చావు తరువాత కూడా మనుగడ కలిగి ఉంటాము. మన మనసులో ఈ స్పష్టతను దృష్టిలో పెట్టుకుంటే, భగవద్గీతలో వివరించినట్లుగా మనం వ్యక్తము అవ్యక్తముల యొక్క అనుబంధాన్ని సులభంగా అర్థం చేసుకుని, అవ్యక్తమైన లక్ష్యాన్ని (మోక్షాన్ని) గుర్తించి, పొందగలుగుతాము. అహంకారమే ఈ మార్గంలో ప్రయాణానికి అవరోధంగా ఉంటుంది. అయితే, బయటి ప్రపంచంలో సుఖదుఃఖాలకు అతీతంగా, మనలో ఎంత ఆనందం నిండి ఉన్నది అనేది అవ్యక్తమైన అంతరాత్మ వైపు సాగే ప్రయాణంలో సాధించిన పురోగతికి సూచిక.
Embed this episode
NOW PLAYING
8. వ్యక్తము, అవ్యక్తము
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.