EPISODE · Jul 8, 2023 · 12 MIN
ఆ అమ్మాయి | Aa Ammaayi | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aa Ammaayi' - New Telugu Story Written By P. Gopalakrishna 'ఆ అమ్మాయి' తెలుగు కథ రచన: P. గోపాలకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చూడ్డానికి ఛామనఛాయ అయినా, ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తోంది. పెద్దపెద్ద కళ్ళు.. అందమైన ఆ కళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎవరికైనా. నల్లని ఒత్తైన వంకీల జుట్టు.. పొడవైన జడ వేసుకో డానికి ఆమెకు ఎంత టైం పడుతుందో. ఆమె నడుస్తూ ఉంటే అంతవరకూ పక్కపక్కనే నడిచిన నేను ఆమెకంటే కొంచెం వెనకపడ్డాను. జడ లయబద్ధంగా కదులుతూ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. "ఆహా, ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకునేవాడు నిజంగా ఎంత అదృష్టవంతుడో కదా" అనిపించింది. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి. లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలి అనుకున్నాను. ‘ఆమె పేరు తెలుసుకుంటే!’.. మనసులో వచ్చిన కోరికను మనసులోనే తొక్కిపెట్టేసాను. ఇది ఇండియా. పైగా తెలుగు రాష్ట్రం. అమ్మాయితో అనవసరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే తరువాత జరిగే విపరీత పరిణామాలు తలుచుకునేసరికి అప్పటిదాకా ఉప్పొంగిన ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆమె సుమారు ఐదడుగుల ఎనిమిది అంగుళాలు పొడవుంటుందేమో. పొందిగ్గా కట్టుకున్న చీర చూస్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్తోందేమో అనిపిస్తోంది. మళ్ళీ నడకలో వేగం పెంచి ఆమె పక్కకి వచ్చా. ఇందాక పరిశీలనగా చూడలేదు కానీ, ఇప్పుడు చూస్తే ఆమె అందమంతా ముక్కు పుడకలోనే ఉందనిపిస్తోంది. ఆమెనే చూస్తూ నడుస్తూ ఎదురుగా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న ముసలాయన్ని బలంగా ఢీ కొట్టేసి. పడగొట్టేసాను. అసలే ట్రాఫిక్ చాల ఎక్కువగా ఉందేమో. ముసలాయన సైకిల్ నుండి కిందపడి "కొంచెం ముందుకు చూసుకొని నడవ్వయ్యా బాబూ, సైకిల్ ని గుద్దుకున్నావు కాబట్టి నేను కిందపడ్డాను. అదే బస్సు కింద పడితే నువ్వు మళ్ళీ పైకి లేవలేవు" అంటూ చేతికి తగిలిన దెబ్బను చూసుకుంటూ కోపంగా తిట్టుకోవడం మొదలెట్టాడు. ముసలాయన్ని పైకి లేపి, బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ గాయం మీద పోసి కడిగాను. ఆమె కూడా గబగబా వచ్చి సైకిల్ పైకి లేపి నిలబెట్టి, నావైపు చూసి, "పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు కదా" అని అడిగింది. ఎంత బాగుందో ఆ వాయిస్. "పెద్దగా ఏమీ తగల్లేదండీ" అన్నాను. "అవును, పెద్దగా తగల్లేదు. నీకేం పోయింది, పడింది నేను, దెబ్బలు తగిలింది నాకు".. వందో ఏభయ్యో చేతిలో పెడితే శాంతిస్తాడేమో అనిపించి జేబులో చేతులు పెట్టి చేతికి దొరికిన ఒక నోటును బయటికి తీసాను. నోటును చూడ్డంతోనే శాంతించాడు. చేతిలో పడిన రెండు వందల నోటును ఆప్యాయంగా తడుముకుంటూ జేబులో పెట్టుకున్నాడు. ఆమె కూడా ఒక వందనోటు తీసి చేతిలో పెట్టి, "పళ్ళుకొనుక్కో తాతయ్యా" అంది. "అదేంటండీ, నేనంటే సైకిల్ ని కింద పడేసాను కాబట్టి డబ్బులిచ్చాను. మీరెందుకు అనవసరంగా డబ్బులిచ్చారు" అడిగాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Qb26Vk83nSs
Embed this episode
NOW PLAYING
ఆ అమ్మాయి | Aa Ammaayi | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.