ఆ ఇల్లు ఈ ఇల్లు | Aa Illu Ee Illu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 2, 2023 · 15 MIN

ఆ ఇల్లు ఈ ఇల్లు | Aa Illu Ee Illu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ ఇల్లు..ఈ ఇల్లు రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పోర్టికోలో కారును నిలిపి ధర్మరాజు వరండాలో ప్రవేశించాడు. ముఖద్వారం దగ్గర వారి సతీమణి సిరి ఓరకంట వారిని చూస్తూ నిలబడి వుంది. ద్వారాన్ని సమీపించి ధర్మరాజు సిరి ముఖంలోకి చూచాడు. వ్యంగ్యంగా నవ్వుతూ సిరి.. ‘‘అయ్యగారి రాక ఎక్కడనుండి?..’’ అడిగింది. ‘‘మా అమ్మగారి ఇంటి దగ్గరనుంచి..’’ ‘‘పొద్దున ఏడుగంటలకు వెళ్లారు.. ఇపుడు టైమ్‌ సాయంత్రం నాలుగు..’’ ‘‘తెలుసు!..’’ ‘‘ఇంతసేపు అక్కడ వెలగబెట్టిన రాచకార్యం ఏమిటో!..’’ హేళనగా అడిగింది సిరి. ‘‘అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లవలసి వచ్చింది!..’’ సహనంతో జవాబిచ్చాడు ధర్మరాజు. ‘‘అమ్మ.. అమ్మ.. అమ్మ.. ఎందుకో అంత అమ్మ పిచ్చి.. తమ్ముడొకడున్నాడుగా.. ఆరడుగులు పైకెదిగి.. వారు ఏంచేస్తున్నట్టో..’’ వ్యంగ్యంగా అడిగింది సిరి. ‘‘రాఘవ వూర్లో లేడు..” ధర్మరాజులో సహనం సతమతమవుతోంది. కళ్లు ఎర్రబడ్డాయి. క్షణం సేపు భార్య ముఖంలోకి నిరసనగా చూచి తన గదిలోనికి వెళ్లిపోయాడు.. పొరుగింటి శశమ్మ.. వరుసకు సిరికి పిన్ని.. రెండు ప్లాట్సుకు నడుమన ఐదు అడుగుల ఎత్తులోవున్న కాంపౌండు గోడను సమీపించింది. ‘‘ఏందే సిరీ!.. ఆయాసపడుతున్నావు?..’’ ఓ దీర్ఘం తీసింది. భర్త తనను నిర్లక్ష్యం చేసి లోనికి పోవడం సిరిమ్మగారి అవమానం.. ‘‘ఏంవుందిలే పిన్నీ!.. ఎపుడూ వుండేదే..’’ విరక్తిగా అంది సిరి. ‘‘చాలా డల్‌గా వున్నావు ఏమయిందే?..’’ ప్రశ్న.. యధార్థానికి ఆ భార్యా భర్తల సంభాషణను శశమ్మ గోడకింద చేరి అంతావిన్నది. ఆమెకు.. ధర్మరాజు తల్లి అన్నపూర్ణమ్మగారికి వైరం.. ఆ కారణంగా పూర్ణమ్మ సిరిని రెచ్చగొట్టి.. ఆ సిరి.. తను అత్తగారిని గురించి నాలుగు అవకతవక వాక్యాలు పలికితే.. సిరిని మెచ్చుకొంటూ.. అన్నపూర్ణమ్మను గురించి పాడుకొంటూ.. ఆనందించే గొప్పరకం శశమ్మగారు. ఇక.. సిరి పెద్ద అందగత్తేం కాదు. సిరి తండ్రి రాధాకృష్ణయ్య ధర్మరాజు తండ్రి వెంకటరాజు మంచి స్నేహితులు బావమరదుల వరుసైనవారు. ఒకే వయస్సువారు. వెంకటరాజుగారిని మాయదారి కరోనా కాటువేసింది సంవత్సరం క్రిందట.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Wts881JHIGc

Episode metadata supplied by the publisher feed · Published Mar 2, 2023

Embed this episode

NOW PLAYING

ఆ ఇల్లు ఈ ఇల్లు | Aa Illu Ee Illu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 15:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 2, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!