ఆ నలుగురు | Aa Naluguru | Telugu Short Story | Nagavarapu Srinivasa Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 4, 2023 · 9 MIN

ఆ నలుగురు | Aa Naluguru | Telugu Short Story | Nagavarapu Srinivasa Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ నలుగురు రచన : నాగవరపు శ్రీనివాస రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చుట్టూ చిమ్మ చీకటి. ఎక్కడ ఉన్నానో చూద్దామనుకున్నా కానీ, చెప్పానుకదా! కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం. నా పక్కన ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని చేతులు చాచాను. ఎవరూ తగల్లేదు కానీ, ఏవో మెత్తటి గోడల్లాగా తగిలాయి. అంత చీకటిలో ఒంటరిగా ఉన్నా, నాకు భయం కలగలేదు సరికదా ఏదో వెచ్చటి భద్రతాభావం కలుగుతోంది. అంతలో ఎవరో నన్ను బలవంతంగా ముందుకు తోస్తున్నట్లనిపించింది. అది కూడా, గుంపులో తోపులాటలా కాకుండా, చాలా జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారం శ్రద్ధగా తోస్తున్నారు. అప్పుడే బయటినుండి ఎవరో బాధగా అరుస్తున్న అరుపులు వినిపించాయి. ఆ అరుపులు ఎవరివో తెలియకపోయినా, నన్ను కూడా ఎందుకో తెలియని బాధ ఆవరించింది. బహుశా, ఆ వ్యక్తిపై ఉండే సానుభూతి దానికి కారణం అయి ఉండవచ్చు. అంతలోనే, ఆ అరుపులతో బాధకన్నా మించిన ఒక రకమైన ఆనందం వినిపించింది. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని కవిగారు చెప్పినా, నిజంగా బాధని ఆనందంగా అనుభవించేవారుంటారా? అనుకున్నాను. "జాగ్రత్త. జాగ్రత్త." ఈ మాటలు వినిపిస్తుండగా వెనకనుండి తోసిన తోపులకి, మెల్లగా ఒక ఇరుకు గుహలాంటి ఆ వెచ్చని చీకటి ప్రదేశంనుండి బయట పడ్డాను. అంత చీకటిలోంచి బయటకొచ్చిన నాకు ఆ గదిలోని వెలుతురు కోటి సూర్యుల కాంతిలా అనిపించింది. కళ్ళు విప్పడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో, ''ఆహా! ఎంత చక్కటి పిల్లాడమ్మా! దిష్టి తగిలేటట్టున్నాడు. నలుగురి కంట పడకుండా కాచుకోడం నీకు పెద్ద పనే " అని నన్ను డెలివరీ చేసిన డాక్టర్ మా అమ్మతో అన్న మాటలు వినగానే భయంతో, నలుగురంటే ఎవరో నన్నెత్తుకెళ్లిపోయేవారనుకుని ఆరున్నొక్క రాగంలో ఏడుపు మొదలెట్టాను. మా అమ్మ నీరసంగా నవ్వి, "నలుగురి నోళ్ళలో పడేవాడు కాకుండా ఉంటే చాలు." అంటూ మత్తులోకి జారుకుంది. ఆ గదిలో అప్పుడే పుట్టిన నేను, అమ్మ, డాక్టర్, నర్సు కాక వేరే ఎవరు కనిపించకపోడంతో, ఆ నలుగురు లేరనుకుని ధైర్యంగా నవ్వడం, హాయిగా పడుకోవడం చేశాను. కాస్సేపటికి నన్ను చూడడానికి కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్లలో ఆ నలుగురు ఉన్నారేమోనని భయపడి ఏడవడం మొదలెట్టాను. "వెధవ వేలెడంత లేడుగానీ ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో, నీ నాన్న, తాతా, నానమ్మలంరా బడుద్ధాయి." అన్న మాటలు విని, ఓహో! మన వాళ్ళే కానీ, ఆ నలుగురు కాదన్నమాట అనుకుని నవ్వడం మొదలెట్టాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AS_Z06e7MMw

Episode metadata supplied by the publisher feed · Published Mar 4, 2023

Embed this episode

NOW PLAYING

ఆ నలుగురు | Aa Naluguru | Telugu Short Story | Nagavarapu Srinivasa Rao | manatelugukathalu.com

0:00 9:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!