ఆ రోజు రాత్రి యేమి జరిగింది | Aa Roju Rathri Emi Jarigindi | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 31, 2023 · 18 MIN

ఆ రోజు రాత్రి యేమి జరిగింది | Aa Roju Rathri Emi Jarigindi | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రోజు రాత్రి యేమి జరిగింది?  రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు ఉద్యోగస్థులైన దంపతులు పార్థసారథి పరిమళం ఇద్దరూ ఆపీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. కారణం-ముఖ్యమైన కుటుంబ విషయం చర్చించి మాట్లాడి తీర్మానించాలని పకడ్బందీగా సర్దుకుని హాలులో కూర్చున్నారు. ఇంద్రానగర్ లో ఉంటూన్న పెద్ద కూతురు మాలిని గురించి యెదురు చూసారు గాని, ఆమేదో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉందని, భర్త పరిపాలనా పర్యటనపై పొరుగూరు వెడళిపోవడాన బుజ్జిగాణ్ణి తనే కిడ్స్ ప్లేయింగ్ ప్రీ స్కూలు నుండి తీసుకు రావలసి ఉందని తనది యిప్పటికిప్పుడు కదల్లేని పరిస్థితంటూ తప్పుకుంది. ఇక సీను కట్ చేసి చూస్తే వ్యవహారం మరీ అంత పెద్దదీ కాదు మరీ చిన్నదీ కాదు. చిన్నకూతురు సంకీర్తన పెళ్లి సంగతి తేల్చుకోవలసిన తరుణం ఆసన్న మైంది. నిజానికది ఆషా మాషీ సంగతేమీ కాదు. సంకీర్తన మామూలు స్థాయికి చెందిన అమ్మాయి కాదు. రేపు కాలం కలసి రావాలే గాని కంపెనీ డైరక్టర్ గా ఉంటూన్న తండ్రిగారికి సహితం మించిపోయే స్థాయికి చేరుకోగలదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకి యెంపికై పూర్తి స్థాయిలో డెహరాడాన్ అకాడమీలో శిక్షణ తీసుకుని భారత రాజధాని ఢిల్లీ నగరం వెళ్ళబోతూంది. సెంట్రల్ రెవన్యూ డిపార్టుమెంటులో డైరక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతూంది. అంచేత ఆమెను వెతుక్కుంటూ మండువా లోగిలిలో మూడు పెద్దింటి సంబంధాలు కాచుక్కూర్చున్నాయి. సంబంధం ఖాయం చేయడానికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కాని—వాళ్లిప్పుడు చర్చించబోయేది ఆ మూడు సంబంధాల విషయం కాదు. పార్థసారథి చిన్ననాటి నేస్తం రామగోపాలం కొడుకు సంబంధం గురించి. ఇక విషయానికి వస్తే మిత్రులిద్దరి మధ్యా పరస్పరావగాహన ఉన్నా అదీ అంత తేలికైన వ్యవహారం కాదేమో! ఎందుకంటే రామగోపాలానికి ముగ్గురు కొడుకులు. పోటీ పరీక్షలతో కసరత్తు చేస్తూ అహర్నిశలూ హోరాహోరీగా తిరుగూతూ ఎం దులోనూ కుదరలేకుండా పోతూన్న కామరాజుని భార్యాభర్తలెప్పుడో తెరవెనుక్కి సుతారంగా తోసేసారు. అతడెప్పుడు గట్టుకి చేరుకుంటాడో ఇప్పటిప్పుడు తేల్చుకోలేని పరిస్థితి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/65UsZQKqh3U

Episode metadata supplied by the publisher feed · Published Jan 31, 2023

Embed this episode

Ready to play

ఆ రోజు రాత్రి యేమి జరిగింది | Aa Roju Rathri Emi Jarigindi | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 18:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 31, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!