EPISODE · Feb 13, 2023 · 19 MIN
ఆడపిల్ల | Adapilla | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆడపిల్ల రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ వాకిట్లో ఉన్న నందివర్ధనం చెట్టు నిండుగా విరగబూసి వుంది. ఆ చెట్టు మొదట్లో ఉన్న అరుగు మీద కూర్చొని రామలక్ష్మణులిద్దరూ వారి చేతిలో ఉన్న శనగపిండి తో చేసిన కారం చుట్టలను చిన్నగా నములుతున్నారు. వరండాలో వాలు కుర్చీలో కూర్చొని వారిని ముచ్చటగా చూస్తున్నాడు మాధవ శర్మ. ఇద్దరూ పది సంవత్సరాల లోపు పిల్లలు. చక్కగా చదువుకుంటూ వున్నారు. రేపు సంవత్సరం ఇద్దరినీ కర్నూల్ లో కాన్వెంట్ కు పంపించడానికి ఏర్పాట్లు చెయ్యాలి, అనుకుంటూ ఆలోచన చేస్తున్నాడతను. ఇంతలో లోపల్నుంచి ఆ పిల్లల అమ్మమ్మ రాధమ్మ వచ్చింది. వరండాలో ఆరబెట్టిన మామిడి వొరుగులను చేత్తో చక్కగా నెరుపుతూ అల్లుడి వైపు తిరిగి ఇలా అంది. “నాయనా దేవమ్మకు ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. మందులు సరిగా పనిచేస్తున్నట్లుగా లేదు. కానుపు ఇబ్బందువుతుందేమో?” ఆ మాటలకు ఈ లోకం లో కొచ్చాడు, మాధవశర్మ. ఆమెకు దేవమ్మ ఒక్కతే కూతురు. అందుకని దేవమ్మకు మూడవ గర్భం వచ్చినప్పటి నుంచీ ఇద్దరు మగపిల్లలను, దేవమ్మను చూసుకుంటూ వీళ్ళదగ్గరే వుంది. దేవమ్మకు ఇప్పుడు తొమ్మిదో నెల గర్భం జరుగుతోంది. కానీ గర్భం వచ్చినప్పటినుంచీ దేవమ్మ ఆరోగ్యం అంత కుదురుగా లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. “రేపు మళ్ళీ కర్నూల్లో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చూపిద్దాం అత్తయ్యాగారూ, ” అన్నాడు మాధవశర్మ లేస్తూ. కానీ అంత అవసరం లేకుండానే దేవమ్మకు అర్దరాత్రి నొప్పులు వచ్చి, ఆడపిల్లకు జన్మనిచ్చి ఆమె పై లోకాలకు వెళ్ళిపోయింది. ఇద్దరు చిన్నమగపిల్లలతో పాటు, ఇంకొక పసికూన కూడా చేరింది, మాధవశర్మ వంటరి జీవితానికి. ముగ్గురు పిల్లల్తో రాధమ్మ అవస్థ పడటం చూస్తుంటే ఉర్లో వాళ్ళందరూ ఆమె మీద జాలి పడేవాళ్ళు. మాధవశర్మకు ముప్పయి సంవత్సరాలు కూడా నిండలేదు. మరో పెళ్ళి చేసుకొమ్మని ఎంతమంది చెప్పినా మాధవశర్మ ఇష్టపడలేదు. మగపిల్లలిద్దరినీ కాన్వెంట్ లో చదువుకోవడానికి అగ్రహారం నుండి రోజూ గుర్రం బండిలో కర్నూల్ కు పంపిస్తూ వచ్చారు. ఒక సంవత్సరం నెమ్మదిగా గడిచింది. రోజులు నిండి, నెలలు గడిచేటప్పటికీ, చిన్నపాప మామూలుగా లేదనీ, మాటలు రావనీ, మతిస్థిమితం కూడా లేదనీ అర్ధమయ్యింది. మాధవ శర్మ కుప్పకూలిపొయ్యాడు. పిల్లను చూసినప్పుడల్లా రాధమ్మ గుండెలవిసేలా రోజూ ఏడుస్తూనే ఉంది. అసలే తల్లి లేదు. పైన అవకరాలు తోడయ్యాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/eoaCfkF-4io
Embed this episode
NOW PLAYING
ఆడపిల్ల | Adapilla | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.