EPISODE · Jan 19, 2023 · 15 MIN
ఆజన్మాంతపు కృతజ్ఞత | Ajanmanthapu Kruthajnatha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆజన్మాంతపు కృతజ్ఞత రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఉదయం 6 గంటలకు మా ఊళ్లో బస్సు ఎక్కిన వాడిని బస్టాండ్ లో దిగి రిక్షా కట్టించుకుని రూమ్ కి వచ్చేసాను. రేపే బిఈడి పరీక్షలు ప్రారంభం. మా రూమ్మేట్స్ ఐదుగురిలో ముగ్గురు వాళ్ల వాళ్ల స్థానాల్లో కూర్చుని సీరియస్ గా చదువుకుంటున్నారు. "వావ్. వచ్చేసాడు మన హీరో. ప్రిపరేషన్ హాలిడేస్ లో అన్ని సబ్జెక్టులు బాగా చదివేసి ఉంటావు. మన అయిదుగురిలో నీదే ఫస్ట్ మార్క్." అన్నాడు వెంకటరత్నం. నాకు ఒళ్ళు మండింది."భూషణం రాలేదా ఇంకా?" అడిగాను. "అతని ఊరి మీదుగానే కదా నీ బస్ వచ్చేది..... మీ ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటున్నాం" అన్నాడు నటరాజ్. "సరే మీ చదువు ఎందుకులే పాడు చేసుకుంటారు కానీ బాగా చదవండి." అనే బట్టలు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కుని వచ్చి నేను తెచ్చిన బ్రీఫ్ కేస్ ముందు కూర్చున్నాను. అంతలోనే భూషణం కూడా రిక్షా దిగి లోపలికి వచ్చాడు. వస్తూనే" గురువుగారు.. మీరు ఒకసారి నాతో ఇలా పెరట్లోకి రండి. మీతో ఒక మాట మాట్లాడాలి." అన్నాడు. మిగతా ముగ్గురు తనని పలకరించలేదు. అతనితో పాటు పెరట్లోకి వెళ్లా. చాలా ఆందోళనగా కనిపించాడు. "ఏమైందండీ"అన్నాను. "గురువుగారు. ఈ నెలరోజుల ప్రిపరేషన్ హాలిడేస్ లో ఒక్కరోజు పుస్తకం తీస్తే ఒట్టు. నేను పరీక్ష పేపర్ మీద ఒక్క అక్షరం కూడా పెట్టలేను. కానీ నేను పరీక్ష పాస్ అవ్వకపోతే మా నాన్నగారు నా భార్యని నా పిల్లలిద్దరిని నాతో సహా ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నన్ను ఎలాగైనా ఈ పరీక్ష మీరే పాస్ చేయించాలి. మీరు ఏం సలహా ఇచ్చినా పాటిస్తాను. నా పిల్లల మీద ఒట్టు" అతని కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కటే తక్కువ. రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు అతను చెప్పిన మాట విని నేను నివ్వెర పోయాను. ఎందుకంటే ప్రిపరేషన్ హాలిడేస్ కి పుస్తకాలన్నీ సర్దుకుని బ్రీఫ్ కేసులో పెట్టుకుని ఎలా వెళ్లానో నెల రోజుల తర్వాత నేనూ అలాగే తిరిగి వచ్చాను. దానికి కారణం నేను ఇంటికి వెళ్లిననాడే, కడుపులో కంతి తో పాటు గర్భసంచిని కూడా తీసేసి, పెద్ద ఆపరేషన్ జరిగిన అమ్మని ఆ రోజే నాన్నగారు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cEuS5BRlwbk
Embed this episode
Ready to play
ఆజన్మాంతపు కృతజ్ఞత | Ajanmanthapu Kruthajnatha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.