EPISODE · May 23, 2023 · 17 MIN
ఆకలేస్తోంది బాబూ | Akalesthondi Babu | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'ఆకలేస్తోంది బాబూ' తెలుగు కథ రచన: అల్లు సాయిరాం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది. సాయంత్రం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం తగ్గితే, నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్దామని ఎదురుచూస్తున్నాడు లోకేష్. ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి గొడుగు పట్టుకుని ఆఫీసుకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేరిన బురదనీళ్ళలో, రోడ్లు తేలుతున్నట్లుగా ఉన్నాయి. కరెంటుపోయి చిమ్మచీకటిగా ఉంది. వచ్చేదారిలో పక్కనున్న ఓ టిఫిన్ సెంటర్ కి వెళ్లి, ఐదు ఇడ్లీలు టిఫిన్ పార్సిల్ చేయించుకుని గబగబా వస్తున్నాడు. రైల్వేస్టేషన్ పక్కనున్న బైక్ పార్కింగ్ స్టాండు దగ్గర నైట్ డ్యూటీకి వస్తున్న సతీష్ కనపడితే, కలిసి మాట్లాడుకుంటూ ఆఫీసుకి వస్తున్నారు. సతీష్ తనకి సీనియర్ ఆఫీసర్. పైగా, కొంచెం ఈగో మనిషి. ఏం మాట్లాడినా, ఏదో విధంగా జోకులు వేస్తూ, తానే నవ్వుతుంటాడు. అందుకని, సతీష్ ఏవేవో జోకులు చెప్తూ నవ్వుతుంటే, ముఖం మీద నవ్వుపూసుకుని మౌనంగా వస్తున్నాడు లోకేష్. లోకేష్ తనతో వస్తున్నాడే కానీ, ఎవర్నో వెతుకుతున్నట్టు చూట్టూ చూడడం గమనించిన సతీష్ "ఏంటి! అంతలా చూస్తున్నావు లోకేష్! యిరోజు ఎవరికైనా అపాయింట్మెంట్ యిచ్చావేంటీ?" అని నవ్వుతూ అడిగితే "అదేం లేదులే అన్నా!" అని లోకేష్ అన్నాడు. యిద్దరూ నవ్వుతూ ఆఫీసురూంలోకి వచ్చి, బయోమెట్రిక్ హాజరు వేశారు. వెంటనే, టిఫిన్ పార్సిల్ పట్టుకుని బయటకు వస్తుంటే "యిప్పుడే వచ్చావు. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతున్నావు లోకేష్? కాసేపైనా డ్యూటీ చెయ్యబ్బా!" అని సతీష్ అడిగాడు. "ఐదునిమిషాల్లో వచ్చేస్తా అన్నా!" అని ఆత్రుతగా బయటికి వచ్చేశాడు లోకేష్. అంత ఆత్రంగా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడని సతీష్ బయటికి వచ్చి చూస్తున్నాడు. లోకేష్ వెతుక్కుంటూ వెళ్లి, పడుతున్న వర్షానికి బాగా తడిసిపోయి, తడి బట్టలతో వణికిపోతూ, మూల కూర్చున్న ఒక పెద్దాయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్దాయనకి కంటిచూపు సరిగా లేకపోయినా, అంత చీకటిలో లోకేష్ రూపం చూడగానే, ఆప్యాయత పూర్వకమైన ముఖంలో నవ్వు వచ్చేసింది. లోకేష్ తినమని టిఫిన్ పార్సిల్ పెద్దాయన చేతికందించాడు. అదే నవ్వుతో పార్సిల్ తీసుకున్నాడు పెద్దాయన. వారిద్దరి మౌనంతో కూడుకున్న చూపుల్లో, మాటల్ని మించిన భావాలు పంచుకున్నారు. పెద్దాయన పార్సిల్ విప్పి తినడం మొదలుపెట్టిన తర్వాత అక్కడినుంచి ఆఫీసుకి వచ్చేశాడు లోకేష్. ఆఫీసు దగ్గర్నుంచి నిల్చుని యిదంతా చూస్తున్న సతీష్ కి ఏం అర్ధంకాక "అంత ఆత్రంగా ఆయనకి పార్సిల్ యిస్తున్నావేంట్రా? ఆ పార్సిల్ నువ్వు తినడానికి తెచ్చుకోలేదా? ఏం పార్సిల్ కట్టించావ్?" అని గ్యాప్ లేకుండా అడుగుతున్నాడు. "ఐదు ఇడ్లీలు!" అని ఆఫీసు లోపలికివస్తూ చెప్పాడు లోకేష్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/CUZ-15C7YPY
Embed this episode
NOW PLAYING
ఆకలేస్తోంది బాబూ | Akalesthondi Babu | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.