EPISODE · Mar 6, 2023 · 14 MIN
ఆమె కోరిక | Ame Korika | Telugu Short Story | Thirumalasri | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆమె కోరిక రచన: తిరుమలశ్రీ పి.జి. ఫైనలియర్లో ఉన్న మహిజ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తికాగానే భువనేశ్వర్ లో ఉంటూన్న ఆమె పిన్ని లలిత దగ్గర నుండి ఫోన్ వచ్చింది, దసరాకి రమ్మని. లలిత భర్త అక్కడ ఎ.జి. ఆఫీసులో పనిచేస్తున్నాడు. లలితకు ఆడపిల్లలు లేనందున మహిజ అంటె ప్రేమ. మహిజకు కూడా పిన్ని అంటె ఎంతో ఇష్టం. పిన్ని కొడుకులు కవలలు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నారు. దసరాకి తమ్ముళ్ళతో సరదాగా గడపవచ్చునని ఉవ్విళ్ళూరింది మహిజ. కాని, తీరా వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ కాలేజ్ ఎడ్యుకేషనల్ టూర్ కి వెళ్ళినట్టు తెలియడంతో కించిత్తు నిరుత్సాహానికి గురయింది. మహిజ వచ్చిన రెండు రోజులకు మోహిత్ వచ్చాడు. పాతికేళ్ళుంటాయి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. లలిత భర్త గోపాలరావు, మోహిత్ తండ్రి జనార్దనం మంచి స్నేహితులు. సంపన్న కుటుంబానికి చెందిన జనార్దనం కోల్ కత్తా హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్. మోహిత్ స్టేట్ స్ లో ఎమ్మెస్ చేసి ఆమధ్యే ఇండియాకి తిరిగివచ్చాడు. గోపాలరావు అంకుల్నీ, లలిత ఆంటీనీ చూడ్డానికని భువనేశ్వర్ వచ్చాడు. అతని కలుపుగోరుతనము, స్నేహతత్వమూ మహిజను ఆకర్షించుకున్నాయి. నగరంలో దసరా సందడి ఆరంభమయింది. లలిత ప్రోత్సాహం పైన దుర్గాదేవి పూజా పందిళ్ళను దర్శించి వచ్చారు మహిజ, మోహిత్ లు. లింగరాజు గుడికి వెళ్ళి, చెరో ప్రమిదను వెలిగించి భక్తితో శివుడికి నమస్కరించారు. వారిని దంపతులుగా ఎంచిన అర్చకుడు వారి పేర్లను కలిపి అర్చన చేస్తూంటే బిత్తరపోయారు. ఆ పురాతన దేవాలం యొక్క శిల్పసౌందర్యాన్ని మహిజ అబ్బురంగా తిలకిస్తూంటే, మోహిత్ కన్నులు ఆమె అందాలను ఆస్వాదించసాగాయి… ఇరవై రెండేళ్ళ మహిజ పొడగరి. స్లిమ్ గా, పసిడిచాయలో… అనుభవజ్ఞుడైన శిల్పి ఉలి నుండి జాలువారిన సుందర శిల్పంలా ఉంటుంది. క్రీమ్ కలర్ పట్టుచీరలో కవులు వర్ణించే కావ్యకన్యలా తోచింది అతనికి. “మహిజా! ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు” అన్న అతని కాంప్లిమెంటుకు ఓపక్క సంతోషము, మరోపక్క గుండె ఝల్లూ కలిగాయి మహిజకు. “ఇక వెళ్దాం” అంటూ బైటకు నడచింది. మర్నాడు పూరి, కోణార్క్ లకు బైలుదేరారు. ముందుగా కోణార్క్ కి వెళ్ళారు. అక్కడ ‘బ్లాక్ పగోడా’ గా పిలువబడే సుమారు వెయ్యేళ్ళ చరిత్రగల సూర్యదేవాలయాన్ని దర్శించారు. ఇరవై నాలుగు చక్రాలు గల రాతి రథం, దాన్ని లాగుతూన్న సప్తాశ్వాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడాదికోసారి - రథసప్తమి రోజున – తొలి సూర్యకిరణాలు రథం మీది రవి చరణాలను తాకడం అచ్చటి విశేషత. రథం మీద, కట్టాడాల మీద అందంగా మలచబడ్డ శృంగారభంగిమలు ఉత్సుకతను రేకిత్తిస్తాయి. లంచ్ తరువాత పూరీకి బైలుదేరారు మోహిత్, మహిజలు. సముద్రపు గాలి చల్లగా వీస్తూంటే కోణార్క్, పూరీల నడుమనున్న పాతిక కిలోమీటర్ల మెరైన్ డ్రైవ్ ఉల్లాసకరంగా ఉంది. పూరీలో వెంటపడ్డ పండాలను కష్టం మీద వదిలించుకుని గుడిలో ప్రవేశించి జగన్నాథుడి దర్శనం చేసుకున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
ఆమె కోరిక | Ame Korika | Telugu Short Story | Thirumalasri | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.