EPISODE · Nov 7, 2022 · 11 MIN
ఆమె పాదాలు | Ame Padalu | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆమె పాదాలు! రచన : కొత్తపల్లి ఉదయబాబు ''అమ్మా.. ధరణీ. దేవుడి మందిరంలో ఒక పసుపు పచ్చని పాదాల ఫోటో ఉండాలి కదా. ఏమైందమ్మా? కనిపించడం లేదు?'' పూజకు కూర్చోబోతూ కోడలిని అడిగాడు పూర్ణచంద్రరావు. ''దానిని తీసి మీ బట్టల బీరువాలో బట్టల మధ్య భద్రంగా దాచి పెట్టాను మామయ్య గారు. కొత్తగా గృహప్రవేశం అయిన ఇంట్లో పూజామందిరంలో దేవుళ్ళ పక్కన అలాంటి ఫోటోలు ఉండకూడదని యు ట్యూబ్ వీడియోల్లో ఒక పండితుడు చెప్పారండీ. అందుకే తీసేసాను. ఏమీ అనుకోకండి'' అంటూ పూజా మందిరం బయటే నిలబడి జవాబు చెప్పింది ధరణి. పూర్ణచంద్ర రావు గారు వెంటనే లేచి పూజామందిరం లోంచి బయటికి వచ్చేసారు. ''అదేంటి మావయ్యగారు... దీపం పెట్టుకోకుండా వచ్చేసారు?'' అడిగింది ధరణి. ''అవి ఉన్న చోటే నాకు పూజా మందిరం అమ్మా.. ఈరోజునుంచి నువ్వు గాని, అబ్బాయి గాని దీపం పెట్టేసుకోండి. '' అని తన గదిలోకి వెళ్లిపోబోయారాయన. ''మీతో చెప్పకుండా తీసేశానని కోపం వచ్చిందా మామయ్యగారు?'' అడిగింది ఆమె ''లేదమ్మా. దానికి నాకు కోపం ఎందుకు? నా దృష్టిలో ఆ పాదాలే నాకు నిజమైన దేవుడు. నేనీవేళ ఇలా ఉన్నానంటే ఆ పాదాలే కారణం. ఉదయం అనగా ఆఫీసుకు పోయి ఎపుడో రాత్రి వస్తాడు వాడు. తెల్లవారి లేస్తూనే ఏ టిఫిన్ చేయాలా అన్న ఆలోచనతో వంటగదిలో కుస్తీ పడుతుంటావు నువ్వు. నిండు ఇంట్లో దీపం పెట్టుకోకపోతే అరిష్టం అని మాఅమ్మగారు చెప్పారు. నేను ఆపాదాలు దేవుడి మందిరంలో పెట్టిననాడు నువ్వు అభ్యంతరం చెప్పలేదని ఇంతకాలం దీపారాధన చేస్తూ వచ్చాను. అది అక్కడ లేకపోయిన తరువాత నాకు దేవుడి మందిరంలో పనిలేదమ్మా. ఎందుకంటే అది ఉన్నచోటే నాకు దేవుని మందిరం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా”. ఆయన తన గదిలోకి వెళ్లిపోయారు. ''ఆ... యు ట్యూబ్ లో పంతులు గారికన్నా ఈయనకు ఎక్కువ తెలుసేమిటి? మీరు పెట్టకపోతే మానేయండి. వీలున్ననాడు పెట్టుకుంటాను.. లేనినాడు లేదు. అయినా అసలా ఫొటోలో ఏముందని? కాళ్ళకి చిక్కటి దేశవాళీ పసుపురాసుకుని, పారాణీ పెట్టుకుని, రెండు కాళ్ళ బొటన వేళ్ళకు పక్కనున్న రెండో వేళ్ళకు వెండి మట్టెలుపెట్టుకుని, వెండి పట్టీలు పెట్టుకున్న లేత తములపాకుల్లా మెరిసిపోతున్న రెండు కాళ్ళు ఉన్న బొమ్మ అది. ఇంతకాలం ఎక్కడ దాచారో... బయటకు వెళ్ళినపుడు లామినేషన్ చేయించి తెచ్చుకున్నారు కాబోలు పూజామందిరంలో పెట్టుకున్నారు. అలా ఉండకూడదని తెలుసుకున్నాకా తీసేసింది తానూ. ఇందులో తప్పేముంది? కొడుకు వచ్చిన వెంటనే పిర్యాదు చేస్తారేమో. చేస్తే చెయ్యనీ.. ఈయనకన్నా ముందు మొగుడికి తానే చెప్పేస్తే సరి అనుకుంది ధరణి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xvM0omU7fXk
Embed this episode
Ready to play
ఆమె పాదాలు | Ame Padalu | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.