ఆనంద మధురానుభూతి | Ananada Madhuranubhuthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 6, 2023 · 18 MIN

ఆనంద మధురానుభూతి | Ananada Madhuranubhuthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ananada Madhuranubhuthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'ఆనంద మధురానుభూతి' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: నీరజ హరి ప్రభల ప్రతి రోజూ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారిని తలుచుకొంటూ, వారి కృతుల అర్ధం తెలుసుకొంటున్న నా జీవితం ధన్యం. ఇదే ఆలోచనలలో ఉన్న నేను నిన్న రాత్రి స్వప్నంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారిని దర్శించాను. ఆ స్వప్నంలో శ్రీత్యాగరాజ స్వామి వారి దినచర్యను గమనిస్తూ ఉన్నాను.. ఉదయం నుండి రాత్రి నిద్రపోయే దాకా శ్రీత్యాగరాజ స్వామివారు శ్రీరాముని ఏ కీర్తనలతో కొలిచేవారో నాకు తెలుసు. ఆ ఆనందమధురానుభూతిని మీకోసం... "తెలతెలవారింది లే, నీరజా! కిటికీ లోంచి భానుకిరణాలు నీమీద పడుతున్నా ఏమిటా మొద్దునిద్ర." అని ఎవరో పిలుస్తున్నట్లు అయి కనులు తెరుద్దామన్నా కనురెప్పలు ఎంతసేపటికీ తెరిపినపడట్లేదు. అదొక అందమైన అద్భుతమైన భక్తి సాగరంలో విహరిస్తూ అలౌకికమైన ఆనందానుభూతిని ఆస్వాదిస్తున్నాను. నిన్న రాత్రి నాకొక స్వప్నం వచ్చినది. అందులో అద్భుతమైన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్యమోహన తేజము నా కనులముందు సాక్షాత్కరించింది. నేను స్వప్నంలో ప్రత్యక్షంగా చూచి తరించిన అలౌకిక ఆనందానుభూతిని ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎంత చెప్పినా తనివితీరదు. అనుభవించి తీరాలి. అయినా చెప్పటానికి ప్రయత్నిస్తాను. "ఆహా! ఏమి నా భాగ్యం!. ఎంత మహత్తరమైన తేజస్సు! సూర్యచంద్రులకు సరిసమానమైన ఆ కళను చూసి తరించాలే కానీ మాటలతో వర్ణించనలవి కాదు". ఆ మహానుభావుడు తన దివ్యతేజస్సుతో ప్రాతఃకాలముననే నిదుర లేచి కాలకృత్యాలను తీర్చుకుని తన శిష్యులను వెంటనిడుకొని పవిత్రమైన కావేరి నదిలో స్నానం చేసి జపతపాదులను పూర్తి కావించి ఇంటికి రాగా భార్య కమలమ్మ ఎదురేగి అర్ఘపాద్యాదులతో ఆయన పాదములను కడిగి ఆ ఉదకమును తన శిరస్సుపై చల్లుకుంది. మెత్తటి బట్టతో సుతారంగా భర్త పాదములను తుడిచి వాటిని భక్తితో కనులకద్దుకుని కొంచెం ప్రక్కగా జరిగి భర్తకు దారి ఇవ్వగా చిరునవ్వుతో శ్రీ త్యాగరాజ స్వామివారు లోపలికి వెళ్లి తాను నిత్యమూ పూజించే శ్రీరామచంద్రుని మందిరము ముందు ఆసనముపై కూర్చొని ఆ మందిరము తలుపులను తెరిచి తన రెండు చేతులూ జోడించి "మేలుకోవయ్యా! మమ్మేలుకో రామా! మేలైన సీతా సమేత నా భాగ్యమా!" అని భక్తితో గానం చేస్తూ తన శ్రీరాముని నిద్ర లేపుతున్నారు. వెంటనే భక్తవశుడైన శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ నిద్ర లేచి "నీవు వచ్చి లేపితే గానీ నాకు తృప్తి ఉండదు. ఇంక నీ పూజ మొదలుపెట్టు" అని అన్నట్లుగా ఆయన చూపులు ఉన్నాయి. త్యాగరాజస్వామి వారు షోడశోపచారాలతో భక్తిగా పూజ మొదలుపెట్టగానే కమలమ్మ గారు ఒక వెండిగిన్నెలో ఆవుపాలను తీసుకొచ్చి అక్కడ పెట్టగా "ఆరగింపవే…" అంటూ ఆ పాలను భక్తితో రామచంద్రమూర్తికి నివేదించగా శ్రీరాముడు దాన్ని ప్రేమగా తీసుకున్నాడు. వెంటనే త్యాగరాజస్వామి రామునితో "నేను ఇప్పుడే ఉంఛవృత్తికి వెళ్లి నీ పూజకు, నివేదనకు కావల్సిన ఫలములను, ద్రవ్యాలను తీసుకువస్తాను. అంత దాకా నీవు మా సీతమ్మతో సరదాగా ముచ్చటిస్తూ హాయిగా విశ్రాంతి తీసుకో రామా! " అని చెప్పి బయటకు వచ్చారు. తన శిష్యులకు చూపులతో సైగ చేయగానే వాళ్లు వచ్చి "పిలిచారా స్వామీ! " అని చేతులుకట్టుకుని నిలబడ్డారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JZ8nznajA3g

Episode metadata supplied by the publisher feed · Published Aug 6, 2023

Embed this episode

NOW PLAYING

ఆనంద మధురానుభూతి | Ananada Madhuranubhuthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 18:01

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!