Skip to content
ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా! episode artwork

Mar 27, 2020 6 min

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

from Harshaneeyam

నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి. మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికులు, లెక్కలేసేసి, మూడు రూపాయల వడ్డీ గిట్టుబాటు అవతుళ్లా మనకి అనుకొని, తరవాత రోజునుండి అమెరికాలో గాని థాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపఖానా పరిచి పడుకున్నట్టు పండుకొని పోయారు, ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులు తన్నుకు పోతారేమో అని. సమయం గడిచే కొద్దీ అల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాదురా నాయనా తూకుమానుమిట్టకిరా అన్నట్టు ఒకటే తిరునాళ్ల, కట్టే వాళ్లు కట్టి పోతుంటే, పట్టకెళ్లే వాళ్ళు పట్టకెళ్లి పోతున్నారు. అప్పట్లో మా నెల్లూరోళ్లకి పండగలొస్తే ఇంట్లో వుండే స్టీల్ సామానులని బయట తీసి, విమ్మో లేక సబీనాతో తోమి, వీధిలో వెళ్లే వాళ్ళకి, డిస్ప్లే పెట్టందే నిద్రబట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆరుముగం బాగా పట్టేసేడు. రాబోయే పండగ సీజన్కి ఆరు నెలలు ముందుగానే దేశంలో వుండే స్టీల్ సామానులు తయారుచేసే ఫ్యాక్టరీల నన్నిటిని గంపగుత్తగా లీజ్ కి తీసేసుకొని మూడు షిఫ్టులలో తయారు చేయించి నెల్లూరులో దించేసేశాడు. దానికి వాడు ఆ రోజుల్లోనే BI /BW వాడాడని నాకు అనుమానం. స్టీల్ సామానులు తర్వాత మా నెల్లూరోళ్లకి ఆరోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప. ఏ బీరువా అయినా గాడ్రేజీ బీరువానే మా వాళ్లకి. స్టీల్ సామానులు తర్వాత ఎక్కువ మా వాళ్ళు పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు, బి.ఎస్.ఏ సైకిళ్ళు, ఆ తర్వాత ఎప్పడు బొమ్మ రాదుకాని బహు భద్రంగా షట్టర్లు తో సహా వచ్చే క్రౌన్ టీ.వీ లు, ఎన్ని టీ.వీలో వాటికి నాలుగు రెట్లు సంఖ్యలో ఆంటెన్నాలు. మీకు సందేహం రాలా నాలుగు రెట్లు ఆంటెన్నాలు ఏందబ్బా అని? నాకు వచ్చింది, వెళ్లి ఆరా తీస్తే ఒకాయన ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే తన గోడు వెళ్లబోశాడు, "మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీ.వీ అన్నా పెట్టకపోతే పెట్టక మాయినావు, ఇంటి మీద ఆంటెన్నా అన్నా పెట్టబ్బా, యింటికొచ్చిన చుట్టాలకి మా టీ.వీ రిపేర్ కి వెళ్లిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తా వుందబ్బయ్యా" అని. అలా వుంటాయబ్బా మా నెల్లూరోళ్ల యవ్వారాలు. మా చుట్ట పక్కల వాళ్లంతా డబ్బులు కట్టేశారు, కొని తెచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర డబ్బులు అసలే లేవు. నేను ఏదో ఒకటి కొందాము అని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహ లోకి వెళ్ళిపోయా. మా దోస్తులేమో రంగు రంగుల బి.ఎస్.ఏ సైకిళ్ళు తొక్కేస్తున్నారు, కొన్న బీరువాలో ఏమి పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా వుంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలని పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీ.వీ లేదని తెలిసినా పక్కనోళ్లు చూసేలా ఆంటెన్నాలు తెగ అడ్జస్ట్ చేసేస్తున్నారు, సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీ.వీ సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకోవటం పెద్ద ఫాషన్, అంతర్లీనంగా మా ఇంట్లో టీ.వీ వుంది అని తెలిసేలా. ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురం లోని మా చిన్నక్క దగ్గరకి వెళ్ళిపోయా. మా ఆరుముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకు ఎలాగూ బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి, పొట్టేళ్లని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వేలి పొడువునా తీసుకొని మొహానికి రాసుకొనే ఫెయిర్ అండ్ లవ్లీ మూడు నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామానులతో నింపెయ్య వచ్చు అని సాయంత్రం దాకా ఊదరకొట్టి, లాస్ట్ బస్సుకు బయలుదేరతీసి నెల్లూరుకు తీసుకొచ్చా. మరునాడు వెళ్లి నాలుగు స్టీల్ బిందెలు, మూడు గంగాళాలు, ఓ ఐదు చిల్లుల గరిటెలకు డబ్బులు కట్టేసి వచ్చాము. అప్పటికి గాని నా కడుపు ఉబ్బరం తగ్గలా. మా అక్క వెళ్ళిపోయాక నేను గోడమీద బొగ్గుతో గీతలు గీయటం మొదలుపెట్టా, ఎన్ని రోజులు మిగులున్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావటానికి అని. రోజులు గడవటం నాకు చాలా కష్టం గా వుంది. మా చు This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి. మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికులు, లెక్కలేసేసి, మూడు రూపాయల వడ్డీ గిట్టుబాటు అవతుళ్లా మనకి అనుకొని, తరవాత రోజునుండి అమెరికాలో గాని థాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపఖానా పరిచి పడుకున్నట్టు పండుకొని పోయారు, ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులు తన్నుకు పోతారేమో అని. సమయం గడిచే కొద్దీ అల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాదురా నాయనా తూకుమానుమిట్టకిరా అన్నట్టు ఒకటే తిరునాళ్ల, కట్టే వాళ్లు కట్టి పోతుంటే, పట్టకెళ్లే వాళ్ళు పట్టకెళ్లి పోతున్నారు. అప్పట్లో మా నెల్లూరోళ్లకి పండగలొస్తే ఇంట్లో వుండే స్టీల్ సామానులని బయట తీసి, విమ్మో లేక సబీనాతో తోమి, వీధిలో వెళ్లే వాళ్ళకి, డిస్ప్లే పెట్టందే నిద్రబట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆరుముగం బాగా పట్టేసేడు. రాబోయే పండగ సీజన్కి ఆరు నెలలు ముందుగానే దేశంలో వుండే స్టీల్ సామానులు తయారుచేసే ఫ్యాక్టరీల నన్నిటిని గంపగుత్తగా లీజ్ కి తీసేసుకొని మూడు షిఫ్టులలో తయారు చేయించి నెల్లూరులో దించేసేశాడు. దానికి వాడు ఆ రోజుల్లోనే BI /BW వాడాడని నాకు అనుమానం. స్టీల్ సామానులు తర్వాత మా నెల్లూరోళ్లకి ఆరోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప. ఏ బీరువా అయినా గాడ్రేజీ బీరువానే మా వాళ్లకి. స్టీల్ సామానులు తర్వాత ఎక్కువ మా వాళ్ళు పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు, బి.ఎస్.ఏ సైకిళ్ళు, ఆ తర్వాత ఎప్పడు బొమ్మ రాదుకాని బహు భద్రంగా షట్టర్లు తో సహా వచ్చే క్రౌన్ టీ.వీ లు, ఎన్ని టీ.వీలో వాటికి నాలుగు రెట్లు సంఖ్యలో ఆంటెన్నాలు. మీకు సందేహం రాలా నాలుగు రెట్లు ఆంటెన్నాలు ఏందబ్బా అని? నాకు వచ్చింది, వెళ్లి ఆరా తీస్తే ఒకాయన ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే తన గోడు వెళ్లబోశాడు, "మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీ.వీ అన్నా పెట్టకపోతే పెట్టక మాయినావు, ఇంటి మీద ఆంటెన్నా అన్నా పెట్టబ్బా, యింటికొచ్చిన చుట్టాలకి మా టీ.వీ రిపేర్ కి వెళ్లిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తా వుందబ్బయ్యా" అని. అలా వుంటాయబ్బా మా నెల్లూరోళ్ల యవ్వారాలు. మా చుట్ట పక్కల వాళ్లంతా డబ్బులు కట్టేశారు, కొని తెచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర డబ్బులు అసలే లేవు. నేను ఏదో ఒకటి కొందాము అని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహ లోకి వెళ్ళిపోయా. మా దోస్తులేమో రంగు రంగుల బి.ఎస్.ఏ సైకిళ్ళు తొక్కేస్తున్నారు, కొన్న బీరువాలో ఏమి పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా వుంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలని పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీ.వీ లేదని తెలిసినా పక్కనోళ్లు చూసేలా ఆంటెన్నాలు తెగ అడ్జస్ట్ చేసేస్తున్నారు, సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీ.వీ సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకోవటం పెద్ద ఫాషన్, అంతర్లీనంగా మా ఇంట్లో టీ.వీ వుంది అని తెలిసేలా. ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురం లోని మా చిన్నక్క దగ్గరకి వెళ్ళిపోయా. మా ఆరుముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకు ఎలాగూ బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి, పొట్టేళ్లని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వేలి పొడువునా తీసుకొని మొహానికి రాసుకొనే ఫెయిర్ అండ్ లవ్లీ మూడు నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామానులతో నింపెయ్య వచ్చు అని సాయంత్రం దాకా ఊదరకొట్టి, లాస్ట్ బస్సుకు బయలుదేరతీసి నెల్లూరుకు తీసుకొచ్చా. మరునాడు వెళ్లి నాలుగు స్టీల్ బిందెలు, మూడు గంగాళాలు, ఓ ఐదు చిల్లుల గరిటెలకు డబ్బులు కట్టేసి వచ్చాము. అప్పటికి గాని నా కడుపు ఉబ్బరం తగ్గలా. మా అక్క వెళ్ళిపోయాక నేను గోడమీద బొగ్గుతో గీతలు గీయటం మొదలుపెట్టా, ఎన్ని రోజులు మిగులున్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావటానికి అని. రోజులు గడవటం నాకు చాలా కష్టం గా వుంది. మా చు

Ready to play

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

0:00 6:21

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Harshaneeyam?

This episode is 6 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on March 27, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.